Ammayi garu Serial Today Episode సూర్య ప్రతాప్ ఇంటికి వస్తారు. విరూపాక్షి తనని ఓడిపోతావని అనడం గుర్తు చేసుకుంటాడు. రూప తండ్రి దగ్గరకు వచ్చి తగ్గిందా నాన్న అని అడుగుతుంది. బాగానే ఉంది ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు. దాంతో రూప మందులు ఇవ్వమని డాక్టర్ చెప్పారని ట్యాబ్లెట్ ఇస్తుంది. ఏ అవసరం కావాలి అన్నా నన్ను అడుగు నాన్న అంటుంది. నా కోసం నువ్వేం మేల్కొవాల్సిన అవసరం లేదని అంటాడు. 


రూపకి విరూపాక్షి కాల్ చేసి ఎలా ఉందని అడుగుతుంది. నీరసంగా ఉన్నారని ట్యాబ్లెట్ ఇచ్చాను అని చెప్తుంది. ఇక విరూపాక్షి రూపతో నేను సూర్యని చూడాలి సాయం చేయ్ రూప అంటుంది. రూప వద్దని చెప్పినా వస్తున్నా అని అంటుంది. రాజు వస్తున్నాడా అంటే ఎవరికీ చెప్పలేదని ఒక్కదాన్నే వస్తున్నా అని విరూపాక్షి అంటుంది. వద్దని చెప్పొద్దని సూర్యని చూడకుండా ఇక్కడ చావడం కంటే చూసి అక్కడ గొడవ అయినా పర్లేదని అంటుంది. ఇక రూప మనసులో తల్లిని ఎవరూ చూడకుండా నాన్నని చూపించి పంపేయాలని అనుకుంటుంది. ఇక విజయాంబిక విరూపాక్షి గురించి మాట్లాడుతుంది. ఎక్కడో ఒక చోట దొరుకుతుందని అప్పుడు విరూపాక్షి అంతు చూస్తాను అంటుంది. 


విరూపాక్షి ఇంటికి వస్తుంది. రూపకి కాల్ చేస్తే పవర్ ఆఫ్ చేస్తా ఈలోపు వచ్చేయమ్మా అంటుంది. విరూపాక్షి ఇంటిలోపలికి వెళ్తుంది. దీపక్ వాళ్లు ఇప్పుడు పవర్ పోయింది ఏంటా అనుకుంటారు. ఇక దీపక్‌కి జీవన్ కాల్ చేస్తాడు. సిగ్నల్ లేక దీపక్ బయటకు వస్తాడు. దీపక్ ఫోన్ మాట్లాడుతూ రూప, విరూపాక్షిలను చూస్తాడు. మామయ్యని చూడటానికి వచ్చింది అనుకుంటాడు. జీవన్‌కి దీపక్ విషయం చెప్తాడు ఇప్పడే మామయ్యకి చెప్తా అంటే దీపక్‌ని జీవన్ ఆపి తన ప్లాన్ చెప్తాడు. హంతకురాలని చేయమని అంటాడు. మామయ్యని చంపేయమని అంటావా అంటే వద్దని మీ మామయ్య అవసరం ఉందని మీ అమ్మని లేపేయ్ అంటాడు. దాంతో జీవన్ మీ అమ్మ ప్రాణానికి ప్రమాదం లేకుండా పొడిచి నింది మీ అత్త మీద తోసేయ్ అంటాడు. దాంతో దీపక్ సరే అంటాడు. 


విరూపాక్షి పడుకున్న సూర్యప్రతాప్‌ని చాటుగా చూస్తుంది. ఇక దీపక్ తల్లికి విరూపాక్షి వచ్చిందని విజయాంబికతో చెప్తాడు. విజయాంబిక ఆవేశంగా వెళ్తుంది. దీపక్ తల్లితో చెప్పకుండా జీవన్ చెప్పిన ప్లాన్ చేయాలని అనుకుంటాడు. విరూపాక్షి సూర్యని చూసి వెళ్లిపోతుంటే విజయాంబిక అడ్డుకుంటుంది. విరూపాక్షి షాక్ అయిపోతుంది. నీ అడ్డు తొలగించుకుంటా అని విజయాంబిక అంటే అంత దమ్ము ఉంటే ఎలక్షన్‌లో గెలువు అని విరూపాక్షి అంటుంది. ఇక విజయాంబిక విరూపాక్షి గొంతు పట్టి నలిపేస్తుంది. ఇంతలో దీపక్ వెనక నుంచి వచ్చి తల్లిని పొడిచేస్తాడు. విజయాంబిక కేకలకు రూప, సూర్య అందరూ లోపలికి వస్తారు. దీపక్ పారిపోతాడు. దీపక్ మెయిన్ వేస్తాడు. అందరూ వచ్చే సరికి విజయాంబిక రక్తపు మడుగులో ఉంటుంది. అందరూ షాక్ అయిపోతారు.


విరూపాక్షి చేతిలో కత్తి ఉండటంలో అందరూ విరూపాక్షినే హత్య చేసిందని అనుకుంటుంది. చంద్ర అంబులెన్స్‌కి కాల్ చేస్తాడు. దీపక్ వచ్చి మా అమ్మపై గెలవలేనని మా అమ్మని చంపేయాలి అనుకున్నావా తనని వదలొద్దు మామయ్య అని అంటాడు. సూర్య విరూపాక్షి మీద అరుస్తాడు. మా అక్క ఏం చేసిందని ఇలా చంపాలని చూశావని అంటాడు. విజయాంబికను వేరే ఎవరో పొడవటం చూశానని చెప్తుంది. అయినా ఎవరూ నమ్మరు సూర్య విరూపాక్షిని అరెస్ట్ చేయిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్‌ టెన్షన్!