Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode గౌతమ్, జ్యోత్స్నల పెళ్లి చూపులు జరుగుతాయి. రెండు ఫ్యామిలీలు అన్నీ మాట్లాడుకుంటారు. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టమని శివన్నారాయణ చెప్తారు. జ్యోత్స్న, గౌతమ్‌లను మాట్లాడుకోవడానికి పంపిస్తారు. 


గౌతమ్ జ్యోత్స్నకి గులాబి పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. నీ ప్రేమ ఇప్పటికీ అలాగే ఉందా అని జ్యోత్స్న అడిగితే ఎప్పటికీ అలాగే ఉంటుందని గౌతమ్ అంటాడు. ఎందుకు అని జ్యోత్స్న అడిగితే గౌతమ్ మనసులో ఈ ఆస్తి మొత్తానికి నువ్వే కదా వారసురాలు అని నీకు మొగుడు అయితే నా లైఫ్ అంతా ఎంజాయ్మెంట్ ఉంటుందని అనుకుంటాడు. ఇంతలో పారు వచ్చి ఇద్దరినీ పిలుస్తుంది. నిశ్చితార్థానికి నాలుగు రోజుల్లో ముహూర్తం ఉందని చెప్తారు. 


శివన్నారాయణ: అమ్మా సుమిత్ర ఇక నీ కూతురి పెళ్లి అయిపోయినట్లే. థ్యాంక్స్ మనవరాలా నీ నోటి నుంచి ఓకే అనే మాట వచ్చే వరకు మాకు టెన్షన్‌గానే ఉంది. మా పరువు కాపాడావు ఈ ఇంటి వారసురాలు అనిపించుకున్నావ్.
జ్యోత్స్న: మనసులో నేను ఈ ఇంటి వారసురాలినే తాత. ఈ రోజు నేను ఏంటో నా స్థాయి ఏంటో నాకు తెలుసు. తెలియని మనిషి ఒకడున్నాడు. ముందు ఆ మనిషికి కనిపించి తనేం కోల్పోతున్నాడో చెప్పి రావాలి.
అనసూయ: సుమిత్రమ్మ గారి కూతురి పెళ్లి చూపులు ఏమయ్యాయో ఏంటో.
జ్యోత్స్న: స్వీట్ బాక్స్ తీసుకొని వస్తుంది. అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు. 
అనసూయ: ఏంటమ్మా అలంకరణ తీయకుండా వచ్చేశారు. పెళ్లి వద్దు అనుకున్నారా.
కాంచన: ఇలా ఎన్ని పెళ్లిళ్లు చెడగొడతావే. పెళ్లీ పెటాకులు లేకుండా నా కొడుకు జీవితంతో ఆడుకుంటావా.
కార్తీక్: జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందని అత్త ఫోన్‌లో చెప్పింది కానీ నేను నమ్మలేదు. 
దీప: ఇక ఎప్పుడూ ఒకటే పద్ధతా నీ ఇష్టానికి నువ్వు బతుకుతావే ఇంకేం ఆలోచించవా.
జ్యోత్స్న: దయచేసి అందరూ ఆపుతారా. స్వీట్ బాక్స్‌తో వచ్చాను అంటే కూడా మీకు అర్థం కావడం లేదా. నాకు పెళ్లి చూపులు జరిగాయి. నేను పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఒకేనా. నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టారు. 
కాంచన: నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావ్ కదా అదే సరి.
జ్యోత్స్న: ఏం చేస్తామ్ మరి అందరికీ బావ కావాలి అంటే కుదరదు కదా. నేను ఇష్టపడిన బావ దక్కకపోయినా నన్ను ఇష్టపడిన వాడిని చేసుకుంటా.


జ్యో.త్స్న అందరికీ స్వీట్స్ ఇస్తుంది. అందరికీ ఇచ్చి కార్తీక్‌కి ఇచ్చే టైంకి కాళీ బాక్స్ ఉంటుంది. మిస్ అయిపోయావ్ బావ అని జ్యోత్స్న అంటే నేనేం మిస్ అవ్వలేదు పంచుకునే మనిషి పక్కనే ఉన్నప్పుడు అన్నీ కాళీ డబ్బాలే అని దీప దగ్గర నుంచి సగం తీసుకుంటాడు. నీ వల్ల ఓ ఆడపిల్ల బాధ పడుతుందని నీకు ఎప్పుడు అనిపించలేదా అని దీపని అడుగుతుంది. గతం గుర్తు చేయడానికి వచ్చావా అంటే అన్నీ మర్చిపోతా అని అంటుంది. ఇక కాంచన కాళ్ల మీద పడి కోడలిని అవ్వాలి అనుకున్నా మేనకోడలిగానే మిగిలిపోయానని అంటుంది. ఈ పెళ్లితో మన రెండు కుటుంబాలు కలవాలి అత్త అంటుంది. నిశ్చితార్థానికి రమ్మని చెప్తుంది. మీ కళ్ల ముందే నా నిశ్చితార్థం జరగాలి అని జ్యోత్స్నఅంటుంది. వెళ్తూ వెళ్తూ జ్యోత్స్న కార్తీక్‌కి థ్యాంక్స్ చెప్తుంది. 


అనసూయ, కాంచన చాలా సంతోషపడతారు. ఇక జ్యోత్స్న పెళ్లి చేసుకొని వెళ్లిపోతుందని అంటుంది. జ్యోత్స్న అసలు పెళ్లి చేసుకుంటుందా అని కార్తీక్ అనుకుంటాడు. పెళ్లికి ఎవరికి పిలవాలా అని దశరథ్, శివన్నారాయణ, సుమిత్ర, పారులు లిస్ట్ రెడీ చేస్తారు. చెల్లిని పిలవలేదని దశరథ్ అంటాడు. దానికి పెద్దాయన వాళ్లు ఆ అర్హత పోగొట్టుకున్నారని శత్రువుతో చేతులు కలిపాడు.. నా సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు.. అరవడం గొప్ప అనుకుంటున్నాడు.. నా ఇంటి వారసురాలిని కొట్టిన ఆ దీపని వాళ్లు నెత్తిన పెట్టుకుంటున్నారు.. అలాంటి వాళ్లనా నేను పిలవాల్సింది. వాళ్లు రావడం వల్ల నష్టమే అని చెప్తారు. సుమిత్ర మామ గారిని బతిమాలుతుంది. ఈ తరంలో ఇదే మొదటి ఆఖరి పెళ్లి అని ప్రతీ శుభకార్యంలో ఇంటి ఆడపడుచు ఉండాలి అంటుంది. ఇంత మందిలో మరో ఇద్దరిని చేర్చడానికి పేపర్‌లో ప్లేస్ ఉందని దశరథ్ అంటే అక్కడున్నా నా గుండెలో లేదని పెద్దాయన చెప్తారు. నేను చెప్పిన వాళ్లే రావాలి.. వస్తారు. నాకు ఒక్కడే కొడుకు ఒక్కర్తే మనవరాలు అంతే అని అంటారు. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?