Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప చేసిన వంటల వల్ల అందరికి ఫుడ్ పాయిజిన్ అయి అందరూ హాస్పిటల్‌ పాలవుతారని జ్యోత్స్న కల కంటే అక్కడ మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. ఫుడ్ చాలా బాగుందని అమ్మ వంటలా ఉందని పొగిడేస్తారు. దీప, కార్తీక్‌లు పొంగిపోతారు. ఇక జ్యోత్స్న వర్కర్‌ వినోద్‌కి కాల్ చేసి రమ్మని వాడి కాలర్ పట్టుకొని మందు సరిగా కలిపావా లేదా అని అడుగుతుంది. అప్పుడే దీప వచ్చి బాగా కలిపాడు అంటుంది.


జ్యోత్స్న షాక్ అయిపోతుంది. వినోద్‌కి రెండు తగిలిస్తే సెట్ అయ్యాడని అతన్ని పంపేసి తిన్న తిండిలో మందు కలుపుతావా అని జ్యోత్స్నని లాగిపెట్టి కొడుతుంది. ఇంతలో కార్తీక్ కూడా అక్కడికి వస్తాడు. 


కార్తీక్: నీ చుట్టూ మంచి వాళ్లు ఉండి బతికిపోయావ్ కానీ తాగి కారు నడిపిన రోజే జైలుకి వెళ్లాల్సిన దానివి.
దీప: ఏం బతుకు జ్యోత్స్న ఇది ఎలాంటి కుటుంబంలో పుట్టావ్. ఎలాంటి పనులు చేస్తున్నావ్. నువ్వు ఇవన్నీ చేసేది కార్తీక్ బాబు నా మెడలో తాళి కట్టాడనే కదా.
కార్తీక్: నువ్వు అంతా ఆవేశంతో చేస్తున్నావ్. నీ కంపెనీ క్యాటరింగ్ నాకు వచ్చిందని ఇలా చేయాలి అనుకున్నావ్. వద్దు జ్యోత్స్న తప్పుల మీద తప్పులు చేస్తున్నావ్. నువ్వు ఇప్పుడు రెడ్ హ్యాండ్‌డ్‌గా దొరికిపోయావ్ కానీ నువ్వు ఏం చేసినా అత్త బాధ పడుతుంది. అందుకే ఆగిపోతున్నా. నా వెంట పడటం మానేయ్. నీ జీవితం నువ్వు చూసుకో. మరో సారి ఇలాంటి తల తిక్క పనులు చేయకు చేస్తే ఈ పంచాయితీ మీ తాత ముందు ఉంటుంది. మరో విషయం చెప్పడం మర్చిపోయా మీ ఫుడ్‌ని జనం తిడుతున్నారు కాపాడుకోండి పరువు తీయకండి.


దశరథ్ బాధ పడుతుంటే సుమిత్ర ఏమైందని అడిగితే నా చెల్లికి అన్యాయం జరిగింది బాధ పడతాడు. జ్యోత్స్న పెళ్లి చూపులకు తన చెల్లి ఉంటే బాగుండని దశరథ్ అంటుంది. సుమిత్రకి కాల్ చేయమని అంటే కార్తీక్ వస్తే జ్యోత్స్న, గౌతమ్‌లు ఇబ్బంది పడతారని అంటుంది. మా చెల్లి అర్థం చేసుకుంటుందని ఒక సారి కాల్ చేసి మాట్లాడమని సుమిత్ర అంటుంది. మరోవైపు కార్తీక్, దీపలు జరిగిన విషయం కాంచనకు చెప్తే కాంచన పుట్టింటికి వెళ్లి జ్యోత్స్న చేసిన పని గురించి చెప్తానని అంటుంది. దీప, కార్తీక్‌లు ఆపేస్తారు. ఇంతలో సుమిత్ర కాల్ చేస్తుంది. 


సుమిత్ర: వదిన.. వదిన మాట్లాడటం లేదు అండీ వదిన
కాంచన: చెప్పండి.
సుమిత్ర: నేను సుమిత్ర మాట్లాడుతున్నా వదిన.
కాంచన: నేను కాంచననే. 
సుమిత్ర: కోపంగా మాట్లాడుతుంది అండీ వదిన. 
కాంచన: చెప్పండి కాల్ చేసి మాట్లాడరేంటి. ఇంకా అసలు విషయం చెప్పలేదు.
సుమిత్ర: మీ మేన కోడలికి పెళ్లి సంబంధం కుదిరింది. జ్యోత్స్నకి నచ్చాడు మేం బలవంతం చేయకుండా తానే ఒప్పుకుంది. రేపు అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు. మీకే ముందు  చెప్పాలి అనుకున్నాం.
కాంచన: మంచి విషయం చెప్పారు వదిన.
దీప: మీరు ఇలా మాట్లాడితే బాధ పడతారు కదండీ.


ఆడ పిల్లని ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేరా అని కాంచన తిడుతుంది. ఇక దీప కాంచనకు స్వీట్ ఇస్తుంది. ఎందుకు అంటే జ్యోత్స్నకి పెళ్లి సంబంధం కుదిరినందుకు, మన వంటలకు మంచి పేరు వచ్చినందుకు అని ఇస్తుంది. అందరూ చాలా సంతోషిస్తారు. కార్తీక్ డల్‌గా ఉంటే దీప మీ వల్లే జ్యోత్స్న మారిందని అంటుంది. కార్తీక్ డల్‌గా వెళ్లిపోతాడు. కార్తీక్ ఎందుకు అలా ఉన్నాడని అనసూయ అడిగితే నా మేనకోడలు చేసే పనులకు ఇలా అయిపోయాడు అని ఇంకెన్నాళ్లు ప్రేమ అని వెంట పడుతుందని అంటుంది. కార్తీక్ సుమిత్ర మాటలు తలచుకొని ఉంటే దీప కార్తీక్‌తో జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది అంటే మీరు నమ్మడం లేదు కదా అంటుంది. అవును అని కార్తీక్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిన్ని సీరియల్: నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఉష, విజయ్‌ల సీన్ చాలా పర్సనల్‌గా ఉందే!!