Karthika Deepam Idi Nava Vasantham Serial Episode ఇంట్లో అందరికీ ఓ విషయం చెప్పాలని కార్తీక్ తన తల్లిదండ్రుల్ని తీసుకొని సన్నాయి మేళాలతో జ్యోత్స్న ఇంటికి వస్తాడు. తను తన జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నానని అది చెప్పేటప్పుడు దీప కూడా ఉండాలని అంటాడు. కార్తీక్ ఏం చెప్తాడా అని దీప, జ్యోత్స్న, పారిజాతంలు తెగ టెన్షన్ పడతారు. ఇక కార్తీక్ దీప గురించి చెప్తే ఇక్కడేం జరుగుతుందో తనకే తెలీదని అనుకుంటూ జ్యోత్స్న చాకు తీసుకొని నిల్చుంటుంది. అది పారు చూస్తుంది.
పారిజాతం: కత్తి ఎందుకు తీశావే..
జ్యోత్స్న: ఏం మాట్లాడకు
పారిజాతం: కార్తీక్ దీప పేరు చెప్పగానే ఇది దీపని పొడిచేసేలా ఉంది ఇప్పుడేం చేయాలి. ఏదో తేడా జరిగేలా ఉందే.
దీప: మనసులో.. ఇప్పుడు కార్తీక్ బాబు జ్యోత్స్ని పెళ్లి చేసుకోను అని చెప్తారు. కారణం అడిగితే జీవితాంతం శౌర్యకి ఫ్రెండ్‌గా ఉంటాను అంటారు. దాన్ని వీళ్లు ఎలా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేను ఏం చేయాలి.
కార్తీక్: నా జీవితానికి సంబంధించినది అని ఎందుకు అంటున్నాను అంటే నేను ఇప్పుడు జరిగిపోయిన పెళ్లి గురించి మాట్లాడుతున్నా. జరిగిపోయిన పెళ్లి ఎవరిది అని అడగకండి అది నాదే.
పారిజాతం: అయిపోయింది అంతా సర్వనాశనం అయిపోయింది.
జ్యోత్స్న: నో డౌట్ గ్రానీ చెప్పింది నిజమే శౌర్య బావ కూతురే. వీళ్లిద్దరికీ ఎప్పుడో పెళ్లి అయిపోయింది. అది ఇప్పుడు చెప్పబోతున్నాడు.
శివనారాయణ: ఏదో మమల్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నావ్ అని అర్థమైంది అదేదో తొందరగా చెప్పు మనవడా.
కార్తీక్: దీపని చూస్తూ.. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి అంటారు. ఇక్కడ ఆ పెళ్లి అయిన జంటకు మళ్లీ పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి అయిన జంట ఎవరూ అని చూస్తున్నారా నేను జ్యోత్స్న..
కార్తీక్ మాటకు జ్యోత్స్న ఎమోషనల్ అయిపోతుంది. పారు మాత్రం గుండె పట్టుకొని కుప్పకూలిపోతుంది. కార్తీక్ వెళ్లి పారిజాతాన్ని లేపుతాడు. నేను విన్నది నిజమేనా అని అడుగుతుంది. అక్షరాలా నిజం అని కార్తీక్ అంటాడు. ఇక దీప కూడా హమ్మయ్యా అనుకుంటుంది. పారిజాతం మనవడిని చాలా థ్యాంక్స్ చెప్తుంది. ఇక బాజాతో వచ్చావేంటి అని అడిగితే ముహూర్తం పెట్టిన తర్వాత మొదటి సారి ఫ్యామిలీ మొత్తం వచ్చామని అందుకే మంత్ర వాయిద్యాలతో వచ్చానని అంటాడు. ఇక రేపే నిశ్చితార్థానికి షాపింగ్‌కు వెళ్తామని అంటే కార్తీక్ వద్దని షాపింగ్‌కి బట్టలు ఇంటికే వస్తాయని అంటాడు. కార్తీక్ తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా నువ్వు హ్యాపీనా అని అడుగుతాడు. దాంతో కాంచన నాకు ఉన్న ఒకే ఒక కల ఇది అని చాలా హ్యాపీ అని అంటుంది. ఇక దీప వెళ్లిపోతే కార్తీక్ కూడా వెనకాలే వెళ్తాడు. జ్యోత్స్న కాంచన దగ్గరకు వెళ్లి కాంచన ఆశీర్వాదం తీసుకుంటుంది. కాంచన తన వెంట తెచ్చిన చీర జ్యోత్స్నకి ఇస్తుంది. అందరూ జ్యోత్స్నకి కార్తీక్ పేరు చెప్పి సెటైర్లు వేస్తారు.
శోభ అనసూయ చేతిలోని తమలాపాకు తీసుకొని నములుతుంది. ఇక శోభ అనసూయ మధ్య మాటల వార్ జరుగుతుంది. పాపని తీసుకురావడం లేదని ఇన్‌డైరెక్ట్‌గా శోభ సెటైర్లు వేస్తుంది. రేపు పాపని తీసుకొద్దామని అనసూయ అంటుంది.
దీప: కార్తీక్ బాబు అర్థం చేసుకొని మంచి నిర్ణయం తీసుకున్నందుకు థ్యాంక్స్ బాబు. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు దాని వల్ల ఏ గొడవలు అవుతాయా అని అనుకున్నాను మీరు ముఖ్యంగా అందరి గురించి ఆలోచించారు. భర్త న్యాయం చేయకపోయినా కొడుకుగా మీరు న్యాయం చేశారు.
కార్తీక్: జీవితం అంటే మన కోసం కాదు మన వాళ్ల కోసం బతకాలి అని మిమల్ని చూసి తెలుసుకున్నాను దీప. నా తండ్రి నా తల్లిని మోసం చేసిన తర్వాత అతన్ని కొట్టాలి అనిపించింది. నర్శింహ స్థానంలో మా నాన్న ఉంటే శౌర్య స్థానంలో నేను ఉన్నాను దీప. నా తండ్రి చాలా మంచోడు అనుకున్నాను కానీ ఆయన కూడా నేను అసహ్యించుకునే నర్శింహ లాంటివాడే. ఎందుకో మా అమ్మలో నాకు జ్యోత్స్న కనిపించింది. అమ్మ ప్రేమ నిజం కానీ మా నాన్న ప్రేమ అబద్థం.. జ్యోత్స్న ప్రేమ నిజం జ్యోత్స్న మీద నాకు ప్రేమ ఉంది అనేది అబద్ధం మా అమ్మకి నిజం తెలిస్తే ఎంత బాధ పడుతుందో జ్యోత్స్నకి కూడా నిజం తెలిస్తే అంతే బాధ పడుతుంది కదా. చేయని తప్పునకు జ్యోత్స్నని ఎందుకు బాధ పెట్టాలి అని ఇలా చేశాను. ఇప్పుడు నా కారణంగా మీకు ఎలాంటి నిందలు రావు. ఇప్పుడు మనం మనలాగే ఉండొచ్చు.
దీప: ఇప్పుడు నాకు మీ మీద కూడా గౌరవం పెరిగింది బాబు.
కార్తీక్: ముందు ఈ పెళ్లి జరగాలి తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తా. స్వప్న నా చెల్లి తనకు ఏ అన్యాయం జరగకుండా చూస్తాను. మా అమ్మకి ఈ నిజం తెలీకుండా చూడాలి.
దీప రాత్రి శౌర్యకి అన్నం తినిపిస్తుంటుంది. ఇక్కడే మనం ఉందామని రోజూ కార్తీక్‌ని చూడొచ్చని అంటే దీప కార్తీక్‌కి పెళ్లి అవుతుందని అంటుంది. ఇక శౌర్య నాన్న గురించి అడిగాను కానీ ఇప్పుడు నాకు నువ్వు కార్తీక్ ఉంటే చాలు అనిపిస్తుందని చెప్తుంది. దీప ఏడుస్తూ మనసులో మీ నాన్న కార్తీక్ బాబులా ఉండడని అనుకుంటుంది. మరోవైపు కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. నర్శింహ రెండో పెళ్లి చేసుకోకపోయి ఉంటే నువ్వు ఈ ఊరిలో సంతోషంగా ఉండేదానివని అనుకుంటాడు. తన తండ్రి చేసిన తప్పు కారణంగా తన జీవితం మారిపోయిందని కార్తీక్ అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: గంటలమ్మ గుండె ఆగినంత పని చేసిన గాయత్రీ పాప.. సుమనను శపించిన పెద్దబొట్టమ్మ!