Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode అనసూయ పాపని టిఫెన్ తినిపిస్తుంది. కాంచనతో అనసూయ గుడికి వెళ్దామని అంటుంది. శౌర్య కూడా వస్తానని అంటుంది. ఇక దీప ఇందాకే తిన్నావ్ కదా మళ్లీ తింటున్నావేంటి అని అడుగుతుంది. ఇక కార్తీక్ ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న దీప గదిలోకి వెళ్లి బీరువాలో చాలా డబ్బు ఉండటం చూస్తుంది. కార్తీక్‌ని డబ్బు గురించి అడిగితే అప్పు తీసుకున్నాను అని రెస్టారెంట్ కోసం అని చెప్తాడు.


దీప: ఈ ఐదు లక్షలతో రెస్టారెంట్ ఎలా బాబుగారు. ఇది సరిపోదు కదా. రెస్టారెంట్ ఎక్కడ పెడుతున్నారు. ఈ డబ్బు ఎక్కడ తీసుకున్నారో చెప్పండి.
కార్తీక్: ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నా
దీప: మీరు అప్పు తీసుకోను అని అప్పుడు చెప్పారు. మరి ఇదేంటి. ఉదయం ఫోన్ రాగానే కంగారుగా బయటకు వెళ్లారు ఏమైందని అడిగితే ఏం చెప్పడం లేదు. ఏమైంది కార్తీక్ బాబు.
కార్తీక్: ఏంటి దీప నువ్వు నేను ఏదో నేరం చేసినట్లు అలా నిలదీస్తావేంటి అని అరుస్తాడు. చెప్పాను కదా రెస్టారెంట్ కోసం అని.
కాంచన: ఏమైందిరా అంత పెద్దలా మాట్లాడుతున్నావ్. 
కార్తీక్: ఏం లేదులేమ్మా.


ఇక కార్తీక్ దాసు కనిపించడం లేదని చెప్తాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని చెప్తాడు. ఇక కాంచన వాళ్లు గుడికి బయల్దేరుతారు. కార్తీక్ గదిలో దీపకి నిజం చెప్పలేకపోతున్నానని శౌర్యకి ఆపరేషన్ చేయకపోతే పాప చనిపోతుందని బాధ పడతాడు. ఇక శ్రీధర్ అద్దం ముందు కూర్చొని రెండు పెళ్లిళ్లు అయ్యాయి కానీ సుఖం లేదు అని అనుకుంటాడు. అద్దం చూసి నవ్వుకుంటూ గ్లామర్‌గా ఉన్నానని దానికి కారణం తన శత్రువులు ఓడిపోవడమే అని అనుకుంటాడు ఇక కావేరి వచ్చి మీ వియ్యంకుడు కనిపించడం లేదని వెళ్దామని అంటే అవసరం లేదని వాడో తిక్కలోడని అంటాడు. మరోవైపు దీప బాధ పడుతున్న కాశీ, స్వప్నలకు కాఫీ ఇస్తుంది. స్వప్న అన్నయ్యతో మాట్లాడుదామని కాశీని పిలిస్తే దీప నువ్వు వెళ్లు కాశీ ఉంటాడని అంటుంది. స్వప్న వెళ్తుంది. దీప కాశీతో కార్తీక్ డబ్బు అప్పుగా తీసుకొచ్చాడని శౌర్యని తన ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉంచుదామని అంటున్నాడని శౌర్య కూడా దానికి ఒప్పుకుందని పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని అంటుంది. దీప మాటలు కార్తీక్ చాటుగా వింటాడు. కార్తీక్ తన దగ్గర ఏదో దాస్తున్నాడని నువ్వే మీ బావకి విషయం అడిగి తెలుసుకో అని అంటుంది. కాశీ తనకు తెలీదని చెప్పేస్తాడు ఇక కాశీకి కానిస్టేబుల్ కాల్ చేసి కాశీ హాస్పిటల్‌లో ఉన్నాడని చెప్తారు. దాంతో కాశీ, కార్తీక్‌లు వెళ్తారు. 



మరోవైపు జ్యోత్స్న దాసు గురించి టెన్షన్ పడుతుంది. పారిజాతం వచ్చి జ్యోత్స్నతో దాసు దొరికాడని కాశీ కాల్ చేసి చెప్పాడని చెప్తుంది. దాంతో జ్యోత్స్న చేతిలో ఉన్న కాఫీ కప్పు కింద పడేస్తుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. హాస్పిటల్‌లో ఉన్నాడని పారు చెప్పగానే దశరథ్ మనసులో జ్యోత్స్న చంపాలి అని ప్రయత్నించడం వల్లే హాస్పిటల్‌లో ఉన్నాడని అనుకుంటాడు. ఇక పారిజాతం దాసుని చూడటానికి వెళ్తాను అంటే జ్యోత్స్న కూడా వస్తాను అంటుంది. దశరథ్ వద్దని అంటాడు. పారు ఒప్పించి తీసుకెళ్తుంది. దాసుని హాస్పిటల్‌లో చూసి కాశీ, కార్తీక్‌లు బాధ పడతారు. దాసుని ఇంటికి తీసుకెళ్తామని చెప్తారు. డాక్టర్ మనసులో ఇతన్ని చేర్పించింది అతని అన్నయ్యే అయినా ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని అన్నారని అనుకుంటాడు. ఇక దాసుని ఇంటికి తీసుకెళ్తారు. పారిజాతం కొడుకుని చూసి ఏడుస్తుంది.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: ‘కార్తీక దీపం 2’ సీరియల్ : శివనారాయణ ఇంటికి వచ్చిన కాశీ – రౌడీల నుంచి బాబును కాపాడిన దీప