Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప కుంకుమ పట్టుకొని జ్యోత్స్న ఇంటికి ఇస్తుంది. హాల్‌లో ఉన్న తాతయ్యని చూసి గుమ్మం ముందే నిల్చొని తాతయ్య గారు అని పిలుస్తుంది. సుమిత్ర చూసి దీప దగ్గరకు వెళ్లబోయి ఆగిపోతుంది. లోపలికి రావొచ్చా తాతయ్య గారు అని అంటుంది.
శివనారాయణ: అక్కడే ఆగమ్మా. అక్కడే ఎందుకు ఆగమన్నానో తెలుసా నేను నీకు రెండు విషయాలు అడగాలి. చంటి దానికి ఇప్పుడు ఎలా ఉందమ్మా.
దీప: శౌర్య ఆరోగ్యంగానే ఉంది తాతయ్య గారు.
జ్యోత్స్న: ముందు నువ్వు తాతయ్య గారు అని పిలవడం ఆపు మనసులో విషం ఉన్నా బాగానే నటిస్తున్నావ్.
శివనారాయణ: జ్యోత్స్న ఆగు. చూడమ్మా దీప ఇక నేను అడగాల్సిన రెండో ప్రశ్న పోయిన సారి మీ అత్తలు భర్త వచ్చి నన్ను అనరాని మాటలు అని శాపాలు పెట్టారు. కార్తీక్ వెళ్తూ మేం మీ గుమ్మం తొక్కాలి కానీ మీరు తొక్కరు అన్నాడు. ఇప్పుడు వాడు అన్న మాట నిజమైతే ఇప్పుడు దీప ఈ గుమ్మం తొక్కితే కార్తీక్ ఓడిపోయినట్లే కదా. ఏమ్మా ఈ మాట కార్తీక్ నీకు చెప్పలేదా.
పారిజాతం: ఎందుకు చెప్పడు.
సుమిత్ర: అసలు ఆ మనిషి ఎందుకు వచ్చిందో అడగాలి ఫస్ట్.
శివనారాయణ: సుమిత్ర ఇప్పుడు నువ్వు దీపని లోపలికి పిలు. సుమిత్ర పిలుస్తుంది.
దీప: రాలేనమ్మా మా ఇద్దరికీ రెండు మాటలు లేవమ్మా.
పారిజాతం: శభాష్ దీప గుణ స్త్రీ అనిపించుకున్నావ్. అప్పుడు భర్తని రెచ్చగొట్టి ఇప్పుడు ఇదంతా చేస్తున్నావ్.
శివనారాయణ: నువ్వు నీ భర్తకి తెలియకుండా వచ్చావా. ఎందుకు వచ్చావ్ చెప్పు. దాని కంటే ముందో నేను నీకు అడగాల్సిన రెండు విషయాల్లో రెండో సగం ఉందమ్మా. నీ కూతురికి ప్రాణాపాయం ఉన్నప్పుడు డబ్బు కోసం నువ్వే రావొచ్చు కదామ్మా.
దీప: నా కూతురికి ప్రాణాలు పోయేంత సమస్య ఉందని అందరికీ తెలిసిన తర్వాతే నాకు తెలిసింది తాతయ్య గారు. అప్పటికే జరగాల్సింది అంతా జరిగిపోయింది. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఈ గడప తొక్కమంటారు. నా కూతురు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కాంచనమ్మ గారు మొక్కుకున్నారు. రేపు మా ఇంట్లో శివుడి హోమం జరుగుతుంది. మీలాంటి పెద్దల ఆశీర్వాదం నా కూతురికి కావాలి. అందుకే మిమల్ని హోమానికి ఆహ్వానించడానికి వచ్చాను. పెద్దమనసు చేసుకొని మీరంతా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
జ్యోత్స్న: చప్పట్లు కొడుతూ అదిరిపోయింది దీప. తాత ఆపరేషన్ జరిగింది ఎవరికి శౌర్యకి హోమం చేస్తానని మొక్కుకుంది కాంచన అత్తయ్య అయితే పిలవడానికి దీప రావడం ఏంటి. డబ్బులు అడగటానికి దీప రావాలి. హోమానికి పిలవడానికి దీప రావాలి.
శివనారాయణ: ఒక్క నిమిషం ఆ మనిషి మన ఇంటికి వచ్చింది మన అభిప్రాయం చెప్తే సరిపోతుంది కదా. చూడమ్మా మేం ఎవరి ఇంటికి రాం. చంటి పిల్ల నన్ను ముద్దుల తాత అని పిలిచేది కానీ నీ భర్త నన్ను చాలా మాటలు అన్నాడు ఇప్పుడు నాకు రావాలి అని ఉన్నా నీ భర్త ముందు తల వంచాలని పిలిచినట్లుంది. తల దించుకోవడం అంటే నాకు చావుతో సమానం. చెప్పు నన్ను చావమంటావా.
దీప: మీరే అన్నారు కదా నా కూతురు ముద్దుల తాత అని పిలుస్తుంది కాబట్టి దానికి అక్షింతలు వేయడానిక రండి.
శివనారాయణ: అయితే బయట వాళ్లగా రమ్మంటావ్.
దీప: లేదు కాంచనమ్మ గారి కోసమే రండి. ఎందుకంటే హోమం చేయాలి అనుకున్నదే కాంచన అమ్మగారు. పుట్టింటి వాళ్లు ఆశీర్వదించి పసుపు కుంకుమలు ఇవ్వాలి. నేను ఎలాగూ అనాథని కాబట్టి నాకు పెట్టే దిక్కు లేదు. కానీ కాంచనమ్మ గారికి మీరంతా ఉన్నారు కదా తాతగారు. నాలా తనని అనాథని చేయొద్దు.
పారిజాతం: పిలవాలి అని నీకే కాదు వాళ్లకి ఉండాలి కదా.
శివనారాయణ: పారిజాతం నువ్వు నోరుముయ్. అమ్మా దీప నువ్వు ఇక వెళ్లమ్మా ఈ ఇంటి నుంచి ఎవరూ రారు.
దీప ఏడుస్తూ ఇంటి గడప మహాలక్ష్మీ అంటారు కదా అందరి తరుఫున గడపకు కుంకుమ పెట్టి అందరకీ ఆహ్వానిస్తున్నాను. దీప కార్చిన కన్నీరు గుమ్మం మీద పడతాయి. వస్తారు అనే ఆశతోనే వెళ్తున్నా తాతగారు అని చెప్పి దీప వెళ్లిపోతుంది. సుమిత్ర దశరథ్‌తో అందరినీ దూరం చేసుకొని సంతోషంగా ఉండండి అని వెళ్లిపోతుంది. శివనారాయణ మనసు మారిపోకుండా చేయాలని పారిజాతం పరుగులు తీస్తుంది. దీపకి అడగాల్సినవి ఇంకా ఉన్నాయని జ్యోత్స్న పరుగులు పెడుతూ గుమ్మం తొక్కి వెళ్తుంది. దీప జ్యోత్స్నతో నువ్వు చేసిన పనికి మాలిన పనులు ఇంట్లో చెప్తే నీ చెంప పగులుతుందని రెండు కుటుంబాలు కలిపడానికి ప్రయత్నిస్తున్నానని అడ్డు పడొద్దని అంటుంది. పాప ఆపరేషన్‌కి డబ్బు ఎవరు ఇచ్చారని అడిగితే కార్తీక్ బాబు అని చెప్తుంది. జ్యోత్స్న షాక్ అయిపోతుంది. జ్యోత్స్నకి మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చి అన్నీ ఇక్కడితో వదిలేయమని అంటుంది. జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. ఇంకా ఇంకా దీపని ఏడ్పించాలి అనుకుంటుంది.
తర్వాత దీప కావేరి ఇంటికి వెళ్తుంది. మీ సాయం మర్చిపోవడానికి ఈ జన్మ సరిపోదని మీ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోదని అంటుంది. కావేరి దీపని లోపలికి తీసుకెళ్తుంది. చేతిలో కుంకుమ బరిని చూసి ఏదో శుభకార్యానికి పిలవడానికి వచ్చావని అర్థమైంది అని అంటుంది. ఇక దీప హోమం గురించి చెప్తుంది. శ్రీధర్ దీపని చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పుష్ప రేంజ్‌లో జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. తల్లి నగలు చెక్ చేసిన జ్యోత్స్న!