Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode చరణ్‌తో జ్యోత్స్న తనకు బావ అంటే ఇష్టం అని చెప్తుంది. ప్రేమించిన వాళ్లు దక్కకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు నేను పెళ్లి చేసుకోను అని జ్యోత్స్న చరణ్‌తో చెప్తే దానికి చరణ్ మీ బావకి పెళ్లి అయింది కదా నాకు తెలుసు అని అంటాడు. దానికి జ్యోత్స్న నీతో పెళ్లి అయిన పిల్లల్ని కన్నా నాకు నా బావేనే ప్రేమిస్తాను నీకు ఓకేనా అని అడుగుతుంది.


జ్యోత్స్న: టెడ్డీ బియర్ మీద బావ ఐలవ్‌యూ అని రాసి హగ్ చేసుకొని పడుకుంటా. నీకు ఓకేనా.
పారిజాతం: జ్యోత్స్న..
జ్యోత్స్న: నువ్వు ఆగు గ్రానీ ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటా అంటే నా మనసు వాడికి తెలియాలి కదా.
చరణ్: అవసరం లేదు అర్థమైంది. మా తాతయ్యకు ఇవన్నీ చెప్పను లేండీ ఆ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్తాలెండీ. 
దశరథ్: నువ్వు కోరుకున్నది నీకు ఈ జన్మలో దొరకదు.
జ్యోత్స్న: అయితే ఒంటరిగా ఉండిపోతా. 
శివన్నారాయణ: నువ్వు ఓ చదువుకున్న మూర్ఖురాలివి. ఆ అబ్బాయికి ఉన్న సంస్కారం కూడా నీకు లేదు. 


బావని తీసుకొచ్చి నన్ను పెళ్లి చేయండి అని జ్యోత్స్న అంటే సుమిత్ర పట్టుకొని కొడతానని కడుపుకి తిండి తింటున్నావా గడ్డి తింటావా అని అంటుంది. ఇక కార్తీక్ రెస్టారెంట్‌కి వెళ్లి తిన్నావ్ మా పరువు తీశావ్ అని అంటాడు. నేను నీ పెళ్లి చేస్తాను అని శివన్నారాయణ అంటే నేను బతికి ఉండగా అది జరగదు అని తాతని అంటుంది. నువ్వు అత్త నా జీవితం నాశనం చేసేశారని తండ్రికి చెప్పి వెళ్లిపోతుంది. సుమిత్ర ఏడుస్తుంది. నీ కూతురి పెళ్లి నేను చేస్తాను అని పెద్దయన అంటారు. సుమిత్ర పారిజాతంతో రెండు చేతులు పెట్టి కూతురిని పెళ్లికి ఒప్పించండి అని బతిమాలుతుంది. 


దీప, శౌర్యలు ఆటోలో స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే ఆటో రిపేర్ వస్తుంది. వేరో ఆటో కోసం ఎదురు చూస్తుంటే జ్యోత్స్న వస్తుంది. జ్యోత్స్నకు శౌర్య హాయ్ చెప్తుంది. జ్యో కూడా హాయ్ చెప్తుంది. ఇక తను డ్రాప్ చేస్తా అంటుంది. నేను రాను అని అవసరం లేదని దీప అంటుంది. శౌర్య ఎక్కుదామని చెప్పి తాను కారు ఎక్కి దీపని ఎక్కమని అంటుంది. చిన్న పిల్ల ముందు గొడవ వద్దని రమ్మని అంటుంది. దానికి దీప నువ్వు ఇంటికి వచ్చి గొడవ చేస్తావని అంటుంది. మీరు గెలిచిన సంతోషంలో ఉన్నారు నేను ఓడిన బాధలో ఉన్నాను ఏమైనా అంటానారా అని అంటుంది. దీప కారు ఎక్కుతుంది. శౌర్య ఫాస్ట్‌గా వెళ్లమని అంటే జ్యోత్స్న సరే అని సీటు బెల్ట్ పెట్టుకో మై డియర్ అంటుంది. 


కార్తీక్ కాంచనతో రెస్టారెంట్ విశేషాలు పంచుకుంటాడు. దీప పాపని తీసుకొస్తానని చెప్పిందని అంటుంది. దీప, జ్యోత్స్న వాళ్లు ఇంటికి వస్తారు. జ్యోత్స్న శౌర్యతో ఇంటికి వస్తుంది. కాంచన కార్తీక్‌తో పెళ్లి కొడుకుతో మాట్లాడిన మాటలు గురించి చెప్తుంది. సుమిత్ర ఏడుస్తుందని అంటుంది. కార్తీక్ తల్లితో ఈ సారి అత్త ఫోన్ చేస్తే జ్యోత్స్నని నాలుగు తగిలించి చెప్పమను అని అంటుంది. అప్పటికీ వినకపోతే అని జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. కాంచన జ్యోత్స్న మీద అరుస్తుంది. నా కొడుకు కోడల్ని ప్రశాంతంగా ఉంచవా..ఇంటికి వస్తే సాయం చేయలేదు కానీ ఇప్పుడు మా రెస్టారెంట్‌కి ఎందుకు వస్తున్నావ్ అని అరుస్తుంది. తాత మమల్ని భయపెడితే బావ తాతని తిడుతున్నాడని కొడుకు కోడల్ని ఇంటికి పంపి మరీ గొడవ పడమని నువ్వే చెప్పావా అంటుంది.


ఇక కాంచన పెళ్లి గురించి చెప్తే ఇష్టం లేని పెళ్లి చేస్తే నాకు బాధ గానే ఉంటుందని అంటుంది. పద్ధతి లేని ఇష్టాలు ఉంటే ఇలాగే ఉంటుంది అంటే ఏంటి పద్ధతి లేని ఇష్టాలు అంటే ఒకరిని ప్రేమించి మరొకరి పెళ్లి చేసుకోవడం నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకే మాట బావే నా భర్త  అని అంటుంది. అందరూ జ్యోత్స్నని వెళ్లిపోమని అంటారు. అత్త కడుపున కూతురిగా దీప పుట్టాల్సింది నువ్వు పుట్టకుండా ఉండాల్సింది అంటాడు. నువ్వు  నా అత్త కూతురి కాకపోయి ఉంటే ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వను అని అంటాడు. దాంతో జ్యోత్స్న అయితే నేను సుమిత్రమ్మ కూతురు కాదని తెలిస్తే బావ దృష్టిలో నాకు ఏ విలువ ఉండదు అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని తన్ని నిజం బయట పెట్టేసిన 'రౌడీ'దేవయ్య.. గుండె బాధుకొని ఏడ్చి కాళ్లవేళ్లా పడిన క్రిష్!