Satyabhama Serial Today Episode మహదేవయ్య క్రిష్ మెడ పట్టుకొని గెంటేస్తాడు. చక్రవర్తిని రుద్ర, సంజయ్‌ పట్టేస్తే సత్య విడిపించి మామయ్యకి రెండు వైపులా ఇద్దరం ఉన్నాం ఒంటరి వాడు కాదు అని సత్య  అని మామయ్య చేయి పట్టుకుంటే చక్రి క్రిష్‌ చేయి పట్టుకొని ఇంటి నుంచి వెళ్లిపోతారు. క్రిష్ మహదేవయ్యని గుర్తు చేసుకొని ఏడుస్తారు.   


క్రిష్‌, సత్య ఏడుస్తూ వెళ్తే రేణుక, జయమ్మ తలో మూల కూర్చొని ఏడుస్తారు. భైరవి ఏం బాధ లేకుండా సంజయ్‌కి ప్రేమగా తినిపించుకొని నవ్వుకుంటుంది. మహదేవయ్య ఫ్యామిలీ ఫొటో దగ్గర నిల్చొని చూస్తుంటాడు. అందులో సత్య, క్రిష్‌ఉండటంతో ఫొటో విసిరి కింద పడేస్తాడు. దాంతో సంజయ్ వెళ్లి తండ్రిని హగ్ చేసుకుంటాడు. క్రిష్ సత్య భుజం మీద వాలి ఏడుస్తాడు. క్రిష్ వాళ్లు చక్రవర్తి ఇంటికి వస్తారు. 


క్రిష్‌: ఎక్కడికి వచ్చాం.
చక్రవర్తి: మన ఇంటికి.
క్రిష్: మన ఇంటికా.
సత్య: అవును ఇది మన ఇళ్లే.
చక్రి: మొదటి సారి నా కొడుకు కోడలు ఇంటికి వచ్చారు. కానీ హారతి ఇచ్చే మనిషి లేదు ఇది నా దురదృష్టం. మీరు సరే అంటే నేను హారతి ఇస్తా.
సత్య: అంత కంటే అదృష్టమా మామయ్య. ఓయ్ ఇది దిగులుగా ఉండే సమయం కాదు. నీకు మంచి రోజులు వచ్చాయి హ్యాపీగా ఫీలవ్వు నవ్వు ఒకసారి. నవ్వు. చక్రి ఇద్దరికీ హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తాడు.
చక్రి: మీ అమ్మ.. గోడ మీద ఫొటో చూపిస్తూ..
సత్య: ఒక సారి అత్తయ్య గారికి దండం పెడదామా పై నుంచి దీవిస్తారు. 
చక్రి: నువ్వు కడుపులో ఉన్నప్పుడు నీ గురించి చాలా కన్నాం. నిన్ను డాక్టర్ చేయాలి అనుకుంది. ఫారిన్ పంపాలి అనుకుంది. నువ్వు ఎలా ఉంటావో మీ అమ్మ చూడలేదు. నిన్ను మీ అమ్మ చూడలేదు. అసలేం జరిగింది అంటే..
సత్య: పురిటి నొప్పులతో చనిపోయింది క్రిష్. మామయ్యకి చెప్పొద్దని అంటుంది. క్రిష్‌ని నవ్వించడానికి క్రిష్‌ మంచి వాడని మారిపోయాడని అంటుంది.
చక్రి: ఈ ఇంట్లో నాకు అత్యంత ముఖ్యమైన ఒక గది ఉంది చూపిస్తా రండి. ఆ గదిలో క్రిష్ ఫొటోలు గిఫ్ట్‌లు జ్ఞాపకాలు ఉంటాయి. క్రిష్‌ వాటిని చూసి షాక్ అవుతాడు. నిన్ను దూరం చేసుకోలేదురా. నువ్వు నా దగ్గర పెరగకపోయినా నీ ఫొటోలు చూసుకుంటూ వాటితో మాట్లాడుకుంటూ ఉంటాను. నిన్నటి వరకు నేను అందరూ ఉన్న అనాథని జీవితం కూడా అలాగే ముగిసిపోతుంది అనుకున్నా. దేవుడు ఇంత పెద్ద అదృష్టం ఇస్తాడు అనుకోలేదు. గుండెల మీద ఆడుకోవాల్సిన నా కొడుకుని గోడల మీద చూసుకుంటూ ఉన్నాను. పర్లేదు ఇప్పుడు నా కన్న నా దగ్గరకు వచ్చేశాడు. ఓరేయ్ పాతికేళ్ల నా కల ఒక్క సారి నాన్న అని పిలవరా. ఏంట్రా ఆలోచిస్తున్నావ్.
సత్య: అంటే తను ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు కొంచెం టైం ఇవ్వండి మామయ్య. మీరు మాట్లాడుతూ ఉండండి నేను టీ తీసుకొస్తా. 
జయమ్మ: నీతో మాట్లాడొచ్చారా. బాధని దిగమింగుకొని తన బిడ్డని నీ చేతిలో పెట్టిన నీ తమ్ముడికి దండం పెట్టాలిరా నువ్వు. నువ్వు నా కొడుకు కాదు అని పాతికేళ్ల తర్వాత నువ్వు మెడ పట్టుకొని గెంటేసినా బాధగా చూస్తూ వెళ్లి పోయాడు చూడు ఆ చిన్నా గాడి కాళ్లు మొక్కాలి. ప్రతీ ఒకరి జీవితంలో స్వార్థం ఉంటుంది కానీ అది మితిమీరుకూడదురా. ఉన్నంత వరకేరా ఏదైనా. తప్పొఒప్పో వాడిని నీ స్వార్ధానికి వాడుకున్నావ్. తర్వాత వాడిని మర్యాదగా సాగనంపాలి కదరా ఇంత దారుణంగా అవమానించి పంపాలా. బతికున్నంత కాలం ఇలా రౌడీలా బతికేస్తావా నిన్ను ఎవరూ ఏం చేయలేరు అనుకుంటున్నావా. నువ్వు ఎంతరా. జాలి దయ లేకుండా ఇలా ఎంత కాలం బతుకుతావ్. కానీ చిన్నా గాడి ఉసురు నీకు తగులుతుందిరా. ఏ తల్లీ కొడుకుకు ఇలా శపించదురా. కానీ ఆ దౌర్భాగ్యం నాకు దగ్గింది. నేను కూడా ఈ ఇంట్లో ఉండాలో వద్దో నీ కొడుకులతో మాట్లాడి చెప్పు. నా మెడ పట్టి కొని బయటకు గెంటించకముందే వెళ్లిపోతా. కానీ తల్లిగా ఒక వరం కోరుకుంటున్నాను నా తల కొరివి మాత్రం నువ్వు పెట్టొద్దు. 


క్రిష్ దగ్గర చక్రి కూర్చొని నేను ఆ రోజు ఎదురించాల్సింది అని అంటాడు. క్రిష్ వాళ్లతో నిజం ఇచ్చిన బాధ కంటే అబద్ధం ఇచ్చిన సంతోషమే నాకు కావాలి అనిపిస్తుందని అంటాదు. గతం నుంచి బయటకు రాలేకపోతున్నా అని అంటాడు. బాపు బాపు అని లక్షల సార్లు పిలిచా ఇప్పుడు ఆయన నా బాపు కాదు అంటే ఎలా నా బాధ ఎవరికీ పట్టదా.. నా గుండె నలిగిపోతుంది. ఈ చేదు నిజం నా వల్ల కావడం లేదని అంటాడు. దానికి సత్య అతనే నిన్ను కాదు అనుకుంటే నువ్వు ఎందుకు బాధ పడతావు అంటుంది. దానికి క్రిష్ పక్కన ఉన్న వాళ్లకి తెలీదు నొప్పి పడే వాళ్లకి తెలుస్తుంది. నువ్వు నా మనిషి కాదని క్రిష్ అనడం నాకు బాధగా ఉందని సత్య ఏడుస్తుంది. క్రిష్ సత్య దగ్గరకు వెళ్లి సారీ చెప్తాడు. మనసు అంతా గజిబిజిగా ఉంది ఏదో అనేశా అంటాడు. తన చేతిని విడిచిపెట్టుకుండా గట్టిగా పట్టుకోమని అంటాడు. నా వాళ్లు నన్ను మోసం చేశారని క్రిష్ అంటే మోసం చేసిన వాళ్లు నీ వాళ్లు అవ్వరు అంటాడు. నేను ఫీలైనట్లే బాపు నాలా ఫీలవుతాడు. కాసేపట్లో బాపు ఫోన్ చేస్తాడు అంటాడు. ఇక చక్రితో కన్న తండ్రి ఎదురుగా ఉన్న నాన్న అన్న పిలుపు రావడం లేదని సారీ అని చక్రితో చెప్తాడు. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని తన్ని నిజం బయట పెట్టేసిన 'రౌడీ'దేవయ్య.. గుండె బాధుకొని ఏడ్చి కాళ్లవేళ్లా పడిన క్రిష్!