Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న చెవి పోగు గురించి టెన్షన్ పడుతుంది. దాసు ఇంట్లో పడిపోయిందా.. రాత్రి అయినా డాడీ ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు.. దాసు నిజం చెప్పేసి ఉంటాడా.. దాసు నిజం చెప్తే అందరికీ తెలిసిపోతుంది కదా నీ మీద కంప్లైంట్ ఇచ్చుంటారా అని జ్యోత్స్న కంగారు పడుతూ దాసు ఇంటికి వెళ్లాలని కిందకి వస్తుంది. ఇంతలో దశరథ్ ఎదురుగా వస్తాడు. 


జ్యోత్స్న డాడీకి నిజం తెలీదు అనుకొని ఆఫీస్‌కి వెళ్లారా అని అంటుంది. నీకు తెలీదా అంటే తెలీదు అని అంటుంది. ఇక దాసు జ్యోత్స్నకి చెవి పోగు ఇస్తాడు. జ్యోత్స్న కంగారు పడుతుంది. ఎక్కడ దొరికింది డాడీ అంటే నువ్వు ఎక్కడ పడేసుకున్నావో అక్కడే దొరికిందని అంటాడు. దానికి జ్యోత్స్న నిజం చెప్పాలా వద్దా అని చాలా టెన్షన్ పడుతుంది. ఎందుకు చెమటలు పడుతున్నాయి టెన్షన్ పడుతున్నావ్ తుడుచుకో అని అంటుంది. నాన్నకి నిజం తెలిసిపోయిందని జ్యోత్స్న కంగారు పడుతుంది. 


పారిజాతం: అంత తప్పు ఏం చేశావే.
దశరథ్: ఒక తప్పు దాయాలి అంటే మరో తప్పు చేయాలి కదా పిన్ని.
పారిజాతం: దశరథా ఇదేం తప్పు చేసిందో చెప్పు మనమే సరిదిద్దుదాం మీ నాన్నకి తెలిస్తే ఆయన ఊరుకోరు. 
దశరథ్: చెవు పోగు పడేసుకుంది పిన్ని. గార్డెన్‌లో. 
పారిజాతం: నువ్వు ఎక్కడికి వెళ్లావ్.
దశరథ్‌: దాసు దగ్గరకు వెళ్లాను పిన్ని. అన్నీ గుర్తొచ్చాయి. నిజం చెప్పాలి అనుకున్నాడు సరిగ్గా చెప్పే టైంకి సౌండ్ విని మర్చిపోయాడు. వాడికి సౌండ్ వింటే గతం మర్చిపోతాడని ఎవరికో తెలుసు అందుకే అలా చేశారు. అయినా దొరుకుతారులే ఎవరైనా ఎంత కాలం తప్పించుకుంటారు. పట్టుకుంటా నేనే పట్టుకుంటా. 
జ్యోత్స్న: డాడీకి నా మీద డౌట్ వచ్చింది. దాసు చెప్తే కన్ఫమ్ అవుతుందని ఎదురు చూస్తున్నాడు. కానీ నిజం చెప్తే ఏం అవుతుందో దాసుకి తెలుసు.
పారిజాతం: జ్యోత్స్న ఇప్పుడు దేవుడు దీప వైపు ఉన్నాడే. అందుకే టిఫెన్ కొట్టు స్థాయి నుంచి రెస్టారెంట్ స్థాయికి ఎదిగిపోయింది.
జ్యోత్స్న: మనం చేతకాని తింగరి వెదవల్లా చూస్తూ ఉండిపోతే వాళ్లు ఎంత వరకు అయినా వెళ్తారు. ఎంత సేపు నేను చెడు అవటం తప్ప నాకు ఏ సపోర్టు లేదు.  


దీప తండ్రి ఫొటోకి దీపం పెట్టి జీవితం మళ్లీ మొదలైంది నాన్న అని సంతోషంగా చెప్తుంది. ఈ సారి బలంగా నిలబడాలి కార్తీక్ బాబు గెలిచి అందరి ముందు తలెత్తుకొని నిల్చొవాలి అని  అంటుంది. దీప సంతోషంగా తండ్రికి దండం పెట్టుకోవడం అనసూయ చూస్తుంది. ఇక శౌర్య రావడంతో నువ్వు రేపటి నుంచి స్కూల్‌కి వెళ్లి బాగా చదువుకొని అమ్మానాన్నల పేరు నిలబెట్టాలని అంటుంది. నేను కుభేర్ కూతురు అని గర్వంగా చెప్పుకుంటా కదా నువ్వు అలాగే చేయాలి అంటుంది. దాంతో శౌర్య నేను కార్తీక్ కూతురు అని గర్వంగా చెప్పుకునేలా చేసుకుంటా అంటుంది.


ఇక అనసూయ మనసులో నువ్వు నా తమ్ముడి కూతురివి కాదే అని అనుకుంటుంది. దాసుకి ఏం కాకుండా ఉండి ఉంటే దీప ఎవరి బిడ్డో తెలుసుకునే వాడని దాసు దీప తల్లిదండ్రుల్ని దాసు కనిపెట్టేలా చేసి దీప జీవితం బాగు పడాలని కోరుకుంటుంది. మరోవైపు శ్రీధర్ కావేరిని తీసుకొని శివనారాయణ  ఇంటికి వస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాం ఎవరి ఇళ్లు అని కావేరి అడుగుతుంది. నీకు తెలియాల్సిన వాళ్లే రా అంటాడు, చాలా పెద్ద ఇళ్లులా ఉంది అంటే అవును ఇంట్లో వాళ్లు కూడా చాలా పెద్ద పెద్ద మనుషులు అని కావేరిని తీసుకొని వెళ్తాడు.


శ్రీధర్: నమస్తే అత్తయ్య గారు
పారు: అల్లుడు గారు మీరా.
శ్రీధర్: అత్తయ్యగారు వెళ్లి మామయ్యని పిలవండి మీరు పిలవరా అయితే నేనే పిలుస్తా.
పారు: నా మాట విని ఆయన కంట పడకుండా వెళ్లండి.
శ్రీధర్: నో ప్రాబ్లమ్ నేనే పిలుస్తా మామయ్యగారు.
శివనారాయణ: రేయ్ ఈ ఇంట్లో మనుషుల్ని వరసలు పెట్టి పిలిచే అధికారం నీకు లేదు వెళ్లు. అయినా ఈ మనిషి ఎవరు.
శ్రీధర్: తమరు నన్ను కొట్టి గేంటేసింది ఈ మనిషి గురించే. నా రెండో భార్య కావేరి.
శివనారాయణ: చూడు దశరథ మనం ఇంటి నుంచి గెట్టేసినా మళ్లీ వచ్చాడు మీ ఇద్దరూ పొండి.
శ్రీధర్: కావేరి ఇంటిళ్లపాది నీకు పరిచయం చేస్తా. ఈయన పెద్దాయన మనిషి వయసు పెరిగారు కానీ బుద్ధి పెరగలేదు అంటాను కదా. ఈయన దశరథ్ పిల్లని ఇచ్చుంటే నా కొడుకుకు మామ అయ్యేవారు కానీ మేనమామగా మిగిలిపోయాడు. అని అందరినీ పరిచయం చేస్తాడు.
దశరథ్: బావ ముందు నువ్వు ఇక్కడి మర్యాదగా నుంచి పోతావా లేదా.  
శ్రీధర్: మా నాన్న కొట్టినప్పుడే మర్యాద పోయిందిలే. నేను రెండో పెళ్లి చేసుకోగానే అందరూ తిట్టారు. మీ మాటలు వెనక్కి తీసుకోమని చెప్పడానికి వచ్చాను శివన్నారాయణగారు.
శివన్నారాయణ: ఏంట్రా పేరు పెట్టి పిలుస్తున్నావ్ మళ్లీ నాలుగు తన్నాలా.
దశరథ్: బావ వెళ్లిపో.
శ్రీధర్: నీ రక్తం పంచుకుపుట్టిన చెల్లి సాయానికి వస్తే డబ్బు ఇవ్వడానికి మనసు రాని నువ్వు కూడా ఇంత పౌరుషంగా ఎలా మాట్లాడుతున్నావ్ బావ. నాకు మంచి తనం మానవత్వం లేదన్నారు కదా. శౌర్య ఆపరేషన్‌కి డబ్బులిచ్చింది నేనే. నన్ను మోసగాడు అన్నారు కూతురిని మోసం చేసిన మీరు ఏంటి.
శివన్నారాయణ: నువ్వు నా కూతురికి మోసం చేశావ్. నీ కొడుకు నా మనవరాలికి మోసం చేశాడు. దొందుకి దొందు ఒక్కటే. అయినా ఈ పేపర్లలో నీ రెండో పెళ్లాం అప్పు ఇచ్చినట్లు ఉంది. అయినా మాకు ఎందుకు. మీ ఎవరితో మాకు సంబంధం లేదు. పరువు మర్యాద లేని వాళ్లని తీసుకొచ్చి మా గుమ్మం తొక్కితే మర్యాదగా ఉండదు. సుమిత్ర వీళ్లు వెళ్లగానే పసుపు నీరు చల్లండి.
శ్రీధర్: పసుపు నీరు కాకపోతే పన్నీరు పోసుకోండి అమ్మ సుమిత్రా మీ మామ నోటిలో కూడా పసుపు నీరు పోయమ్మా.
జ్యోత్స్న: వీళ్లు సాయం చేసి దీపకి నా అవసరం లేకుండా చేశారు. ఛా మంచి ఛాన్స్ మిస్ అయింది. 


అందరూ తలో మాట అనేసి వెళ్లిపోతే శ్రీధర్ సుమిత్రతో వెళ్లగానే చెల్లమ్మా నువ్వు తిట్టాల్సింది ఏమైనా ఉంది అంటే ఉంది కానీ ముందు కావేరికి థ్యాంక్స్ చెప్పాలి అని పాపకి సాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పి కావేరిని వదిన అని పిలుస్తుంది. దీప నా కూతురి లాంటిది దీపకి సాయం చేస్తే నాకు సాయం చేసినట్లే నీ సాయాన్ని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను వదిన అని మనం తర్వాత మాట్లాడుకుందాం వదిన అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాల కోసం గడప దాటిన త్రిపుర.. ఫణి పేరున రిజిస్ట్రేషన్ ఆపుతుందా!!