Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode రెస్టారెంట్ దక్కించుకున్న కార్తీక్, దీపలు శివన్నారాయణ ఇంటికి వస్తారు. కార్తీక్‌కి, తాతయ్య కుటుంబానికి గొడవ జరుగుతుంది. భార్య మాట వినేవాడిని పత్ని వాక్య పరికాలకుడు అని అంటారన జ్యోత్స్న పారిజాతం అంటారు. దీన్ని కొంచెం దీప భాషలో చెప్పు అని జ్యో అంటే దానికి పారు పెళ్లాం ఆడించినట్లు ఆడే మొగుడు అంటారని అంటుంది.
దీప: పారిజాతం గారు ఆడించే భార్యని కాదు గెలిపించాలి అనుకునే ఆడదాన్ని.
జ్యోత్స్న: అవును దీప నువ్వు మామూలు ఆడదానివి కాదు. అనుకున్నది దక్కించుకునే దానివి.
సుమిత్ర: నువ్వు దీపని అనడానికి సరిపోవు జ్యోత్స్న.
పారు: నువ్వు నీ కూతురిని అనడానికి సరిపోవు సుమిత్ర.
దశరథ్: పిన్ని.
శివన్నారాయణ: దశరథా..
దశరథ్: సారీ నాన్న.
శివన్నారాయణ: మన మీద మనం అరుచుకోవడం కాదురా. మన ఇంటికి రాను అన్న వ్యక్తి ఎందుకు పెళ్లాన్ని తీసుకొచ్చాడో అడుగు.
కార్తీక్: నా భార్యని కొంత మంది కొన్ని మాటలు అన్నారు. వెతుక్కుంటూ వచ్చి సమాధానం చెప్పడం నాకు అలవాడు.
శివన్నారాయణ: నీలాంటి వాడిని దీప లాంటి వాడిని మేమే కాదు ఎవరైనా అంటారు.
సుమిత్ర: అసలేమైందిరా.
కార్తీక్: వీళ్లు గంగాధర్ మనవడి పార్టీకి వచ్చారు. పారు దీపది ఇడ్లీ కొట్టు స్థాయి అన్నావ్ కదా మేం ఈ రోజు రెస్టారెంట్ దక్కించుకున్నాం. మీరు కొనడానికి కోట్లు ఇస్తా అన్నారు కానీ నేను రూపాయి పెట్టకుండా 25 శాతం వాటా తీసుకున్నా. ఇప్పుడు సత్యరాజ్ రెస్టారెంట్ మాది. నా భార్యది రెస్టారెంట్ స్థాయి అని చెప్పడానికి వచ్చా. రేపే కొబ్బరికాయ కొడతాం. పెద్ద మనసు ఉంటే వచ్చి దీవించండి.
శివన్నారాయణ: నిన్న దీవించే అంత మంచి మనసు మాకు లేదులే.
కార్తీక్: తల్లి లాంటి అత్త ఉంది. అని వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు.
పారు: మామయ్యని ఓడించాలని కార్తీక్‌ని దీవిస్తున్నావ్ కదా సుమిత్ర.
శివన్నారాయణ: సత్యరాజ్ నా శత్రువు. శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతారని ఇప్పుడు నువ్వు నిరూపించావు. మీ ఇద్దరూ నన్ను ఓడించాలని బాగా కలలు కంటున్నారు కానీ నేను ఈ వ్యాపారంలో తల పండిపోయిన వాడిని. మీ అవకాశం లాటరీ టికెట్ లాంటిది.
కార్తీక్: లాటరీ టికెట్ కూడా అదృష్టం లాంటిది. ఇప్పుడు అదృష్టం నా వెనక ఉంది. (దీపని చూపించి) నన్ను నీ ముందు నిల్చొపెట్టి విజేతని చేసే రోజు తొందర్లోనే వస్తుంది. అప్పుడు ఇలాగే నా భార్యతో నీ ముందు నిలబడతా.
కార్తీక్, దీపలకు కాశీ, కాంచన వాళ్లు కంగ్రాట్స్ చెప్తారు. దీప సత్యరాజ్ మనవడిని కాపాడటం వల్ల ఈ అవకాశం మనకు దక్కిందని అంటాడు. కార్తీక్ జ్యోత్స్న ఇంటికి వెళ్లామని చెప్తాడు. అక్కడికి ఎందుకు వెళ్లారని కాంచన అడిగితే దీపని తక్కువ చేసిన వారికి సమాధానం చెప్పడానికి వెళ్లామని అంటాడు. కాంచన, అనసూయల్ని టిఫెన్ సెంటర్ చూసుకోమని తాను దీప రెస్టారెంట్ చూసుకుంటామని అంటాడు. కార్తీక్‌కి పాయసం అంటే ఇష్టమని దీప కార్తీక్ కోసం సంతోషంగా పాయసం చేస్తుంది. ఇక పంచధార డబ్బా రాకపోవడంతో దీప కార్తీక్‌ని పిలుస్తుంది. కార్తీక్ వచ్చే టైంకి దీప ఎదురెళ్తుంది. ఒకరిని ఒకరు చూసుకోకుండా గుద్దుకుంటారు. ఇద్దరికీ బాక్స్ గట్టిగా తగులుతుంది. కార్తీక్ కుయ్యో మొర్రో అంటాడు. నువ్వు గుద్దిన గుద్దుడికి గేటు బయట పడాల్సింది అని అంటాడు. ఇక దీప తనకు కూడా గట్టిగానే తగిలిందని అంటుంది.
ఇక కార్తీక దీపకి థ్యాంక్స్ చెప్తాడు. కార్తీక్ చేయి అందివ్వగానే కార్తీక్‌ని చూసి చిన్నతనంలో కార్తీక్‌ని గుర్తు చేసుకొని అలా చూస్తూ ఉండిపోతుంది. కార్తీక్ ఎంత పిలిచినా పలకకుండా కార్తీక్‌నే చూస్తూ ఉండిపోతుంది. దీప ఎక్కడికో వెళ్లిపోయావ్ అంటే అవును బాబు చాలా వెనక్కి వెళ్లిపోయా అంటుంది. కార్తీక్ దీపతో చిన్నప్పుడు నా ప్రాణం కాపాడిన ప్రాణ దాతలా నువ్వు చాలా మంచిదానివి అంటాడు. దానికి దీప మీరు గెలిస్తే ఆ అమ్మాయే నేను అని దీప చెప్పేస్తా అనుకుంటుంది. ఆ అమ్మాయి కోసం జీవితాంతం ఎదురు చూస్తానని కార్తీక్ చెప్పడంతో దీప పొంగిపోతుంది. తను చనిపోయింటే ఏం చేస్తారని దీప అంటే దీప సరదాగా కూడా ఇలా మాట్లాడకు అని అంటాడు. ఏదో ఒకరోజు తనని కలుస్తాను అని అంటాడు. ఆ అమ్మాయి మిమల్ని మర్చిపోయి ఉంటే లాకెట్ ఇచ్చి గుర్తు చేస్తా అంటాడు. అప్పటికీ గుర్తు పట్టకపోతే అని దీప అంటే నా తంటాలు నేను పడతానులే అని అంటాడు. అమ్మాయిని తలచుకుంటేనే ఇంత ఆరాట పడుతున్నారు అది నేనే అని తెలిస్తే ఇంకేమయిపోతారో అని దీప అనుకుంటుంది.
మరోవైపు దాసు కళ్లు తెరుస్తాడు. నిజం చెప్పాలి అనుకుంటే జ్యోత్స్న చంపాలి అనుకుంది కదా తర్వాత ఏం అయింది. దీప అన్నయ్య కూతురని చెప్పేయాలని అని అనుకుంటాడు. జ్యోత్స్న తన తల్లి కంటే దారుణంగా తయారైందని అనుకుంటాడు. ఇంటికి వెళ్ల కూడదని అనుకొని దశరథ్‌కి ఫోన్ చేస్తాడు. దాసు ఫోన్ నుంచి ఫోన్ వచ్చిందేంటి అని దశరథ్ అంటే జ్యోత్స్న విని షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!