Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కావేరి బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు తీసేసిన విషయం శ్రీధర్‌కి తెలిసిపోతుంది. తాను గీసిన గీత కావేరి దాటదని అనుకుంటే ఏకంగా గడప దాటి తనకు చెప్పకుండా అంత పెద్ద సాయం చేస్తావా అని రగిలిపోతాడు. అయితే ఈ విషయం ఇప్పుడే కావేరిని అడగకుండా హోమానికి పిలిచారు కదా వెళ్లు అప్పుడు తేల్చుతా నీ సంగతి అని అనుకుంటాడు. నన్ను వెర్రివెంగలప్పని చేసి మీరంతా కలిసిపోతారా. ఓరేయ్ కార్తీక్ నువ్వు నీ భార్య దొరికారురా మీతో ఆడుకుంటా చూడు అనుకుంటాడు. 


కార్తీక్ ఇంటి ముందు హోమం జరుగుతుంటుంది. కాంచనను చూసిన కార్తీక్ పుట్టింటి చీర సారె కోసం ఎదురు చూస్తున్నావా కానీ ఏం రావని అనుకుంటాడు. ఇక పంతులు కాంచనతో మీ పుట్టింటి వాళ్లు కానీ మీ కోడలి పుట్టింటి వాళ్లు కానీ పట్టు బట్టలు పెట్టాలి కదా ఎవరైనా వచ్చారా అని అడుగుతారు. కాంచన ఎవరూ రారు అని తలూపుతుంది. చుట్టు పక్కల ఆడవాళ్లు కూడా తలా ఓ మాట అనుకుంటారు. ఇంతలో కార్తీక్ తన భార్యకి ఎవరూ లేరని తల్లికి కూడా ఎవరూ లేరని నేను అన్నీ అని అంటాడు. తన తల్లికి తానే తల్లిస్థానంలోనూ భర్త స్థానంలోనూ నేనే బట్టలు పెడతానని అంటాడు. చెల్లమ్మని అనాథని చేయొద్దని అనసూయ అంటుంది. దానికి కార్తీక్ తన తల్లికి ఎవరూ లేరని తన కోసం ఎవరూ రారని చెప్తాడు. ఇంతలో దశరథ్, సుమిత్ర చీరసారెతో ఎంట్రీ ఇస్తారు. పెద్దమ్మ కోసం పుట్టింటి వాళ్లు వచ్చారని స్వప్న అంటుంది. 


కాంచన: అన్నయ్యా నాన్నని దాటుకోని తోడబుట్టిన దాన్ని చూడటానికి నీకు ఇన్ని రోజులు పట్టిందా అన్నయ్యా.
దశరథ్‌: నాన్న గౌరవాన్ని కాపాడాలా. చెల్లి మర్యాదని కాపాడాలా నా బాధని నీ కంటే బాగా ఎవరు అర్థం చేసుకుంటారమ్మా. నువ్వు సాయం చేయమని ఇంటి కొచ్చి వెళ్లిపోయావ్. సాయం అందలేదని నువ్వు ఎంత బాధ పడ్డావో సాయం చేయలేకపోయాం అని మేం అంతే బాధ పడ్డాం. నిజం తెలుసుకొని సాయం చేయాలి అనుకునే లోపే శౌర్యకి ఆపరేషన్ జరుగుతుందని తెలిసింది. ఆ టైంలో ఏమని పలకరిస్తాం.
శౌర్య: ఎలా ఉన్నావ్ తాత.
సుమిత్ర: ఆ మాట మేం అడగాలి.
శౌర్య: మీరు హోమానికి వచ్చారు కదా సంతోషంగా ఉన్నా.
సుమిత్ర: మీ అమ్మ అంత ప్రేమగా పిలుస్తే ఎందుకు రాము.
కార్తీక్: అంటే కూతురి కోసం తప్ప అల్లుడి కోసం రారు అన్నమాట. 
సుమిత్ర: ఏరా అత్త మీద కోపమా.
దశరథ్‌:  వాడి కోపం నా మీద.
కార్తీక్: చూడండి మా అమ్మ ముఖం ఎలా వెలిగిపోతుందో. థ్యాంక్స్ దీప కావాల్సిన వాళ్లని పిలవమంటే తెలిసిన వాళ్లని పిలుస్తావు అనుకున్నా రావాల్సిన వాళ్లే పిలిచావు. 


పంతులు వీళ్లేనా పుట్టింటి వాళ్లా అంటే దీప నా కూతురు కార్తీక్ నా అల్లుడు అని అంటుంది. ఇక బట్టలు పెట్టమని చెప్తారు. కాంచనకు బట్టలు ముందు పెడతామని అంటే ఆవిడ పక్కన భర్త లేరు కదా అని పంతులు అంటాడు. ఇంతలో కావేరి వస్తుంది. ఈవిడను కూడా పిలిచారా పిలవకుండా ఉండాల్సిందని దశరథ్ అంటాడు. కావేరి రాగానే స్వప్న, దీపలు పలకరిస్తారు. అనసూయ మనసులో దీపని ఎప్పుడు ఎవరిని పిలవాలో తెలీదు అనుకుంటుంది. మానాన్నని పిలిచావా అని కార్తీక్ అంటే లేదని దీప అంటుంది. ఇంతలో శ్రీధర్ అక్కడికి వస్తాడు. అందరూ షాక్ అవుతారు. బావని దశరథ్ గారు నన్ను గుర్తు పట్టారా నేను మీ చెల్లి మొగుడిని మమల్ని గుర్తు పట్టండి అని అంటాడు. ఆయన వస్తారని నేను అనుకోలేదని దీప కార్తీక్‌కి అంటే తర్వాత మాట్లాడుకుందామని కార్తీక్ అంటాడు.


తండ్రి పక్కన అవసరం లేదని అమ్మకి మాత్రమే బట్టలు పెట్టమని కార్తీక్ చెప్తాడు. సరే అని సుమిత్ర, దశరథ్ కాంచనకు బట్టలు పెడతారు. ఇది పద్ధతి అంటే ఆవిడకు భర్త అవసరం లేదు వాడికి తండ్రి అవసరం లేదని అంటాడు. తర్వాత సుమిత్ర దీపవాళ్లకి బట్టలు పెడతారు. హోమం పూర్తి అయిపోయిన తర్వాత సుమిత్ర, దశరథ్‌లు వెళ్లిపోతారు. తర్వాత కార్తీక్ దీపతో మాట్లాడకుండా వెళ్లిపోతాడు. దీప వెనకాలే వెళ్లి మాట్లాడుతుంది. కావాల్సిన వాళ్లు అంటే మేలు కోరుకునేవాళ్లు కదా మరి మా అమ్మ సవతిని ఎందుకు పిలిచావని దీప మీద అరుస్తాడు. తన తల్లిని ఎందుకు ఏడిపిస్తున్నావ్ అని అంటాడు. ఇంతలో అందరూ లోపలికి వస్తారు. అందరూ శ్రీధర్‌ని వెళ్లిపోమంటారు. మనం వెళ్లిపోదామని కావేరి ఎంత పిలిచినా నేను మంచి వాడని నిరూపించుకోవాలి కదా అని అంటాడు. నీ కూతురి ఆపరేషన్‌కి డబ్బులు ఎవరు ఇచ్చారని కార్తీక్‌ని అడుగుతాడు. మనసున్న మనిషి అని కార్తీక్ అంటాడు. ఆ మనిషి ఎవరో నేను చెప్పనా అని శ్రీధర్ అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


 Also Read: కార్తీకదీపం 2 సీరియల్: శ్రీధర్‌కి షాక్‌ మీద షాక్‌లు.. పుల్ల పెట్టేసిన మేన కోడలు.. హోమం దగ్గర ఏం గొడవో!