Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప వంట మనిషిగా చేయాలి అనుకున్న ఇంటికే కార్తీక్ సరుకులు తీసుకొస్తాడు. ఇక ఆవిడ దీపతో మీ ఆయనకు కూడా ఉద్యోగం కావాలి అనుకున్నావ్ కదా నాకు చెప్తే ఇలా సూపర్ మార్కెట్‌లో పెడతా అంటుంది. ఇక దీప అవసరం లేదు అన్నట్లు వంటకు టైం అయిందని అంటుంది. ఇక కార్తీక్ సరుకులు అన్నీ ఇచ్చేసి వెళ్తాను అంటే దీప సాయంత్రానికి వచ్చేస్తా అంటుంది. ఇక కార్తీక్ త్వరగా వచ్చేస్తా అంటాడు. ఇద్దరూ మాటలు అర్థం కాని ఆవిడ ఏంటి ఇలా అంటున్నారు అంటుంది. ఇక కార్తీక్ వెళ్తుంటే ఆవిడ ఆపి 50 రూపాయలు ఇవ్వమని దీపతో చెప్తుంది. దీప కన్నీరు పెట్టుకుంటూ
భర్తకి 50 రూపాయలు ఇస్తుంది.. నాకు ఇలా అలవాటు లేదని వద్దని చెప్పేసి కార్తీక్ వెళ్లిపోతాడు.
జ్యోత్స్న పారుతో బావ ఇంటికి వెళ్లానని చెప్తుంది. బావ వాళ్ల మాట తీరు మారలేదని అంటుంది. బావ జాబ్ కోసం తిరుగుతున్నాడని చెప్తుంది. బావకి జాబ్ దొరకకుండా చేశానని చెప్తుంది. ఓ అవకాశం వస్తుందని బావని నా సొంతం చేసుకుంటానని అంటుంది. దీప, కార్తీక్ ఇద్దరూ ఇంటికి వస్తారు. కాంచన కార్తీక్‌కి ఉద్యగం గురించి అడిగితే తనకు పిలిచింది తన తండ్రే అని చెప్తాడు. వెటకారం చేశాడని అంటాడు. ఇక కార్తీక్ దీపతో మాట్లాడాలి అని లోపలికి పిలుస్తాడు. దీప వెళ్లగానే డోర్ లాక్ చేస్తాడు. వంట మనిషిగా చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు. దాంతో దీప సూపర్ మార్కెట్‌లో పని చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతుంది. ఇంటి కోసం ఏదో ఒక పని చేయాలి కదా అని అంటాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు ఆ పని చేయొద్దని అనుకుంటారు. ఇద్దరం మానేద్దాం వెళ్లొద్దు అని కార్తీక్ అంటాడు. ఈ విషయం అమ్మకి చెప్పొద్దని అంటాడు. దీప మనసులో ఇలా మిమల్ని చూడటం వల్ల నేనే తట్టుకోలేకపోయాను అంటే మీ అమ్మగారు ఎలా తట్టుకోలేరని అనుకుంటుంది.
మరోవైపు స్వప్న వాంతులు చేసుకుంటుంది. ఇది అదే అని కాశీ ఎగిరి గంతులేస్తాడు. అందరికీ సంతోషంగా విషయం చెప్తానని అంటే దానికి స్వప్న నీ వంట వల్ల ఇలా అయింది అని ఇది అది కాదు అని అంటుంది. ఇక దాసుకి దీప రమ్మని చెప్పిందని బయల్దేరితే దాసుతో పాటు కాశీ, స్వప్నలు వెళ్తారు. వందల మందికి ఉద్యోగాలు ఇచ్చిన నా కొడుకు ఇప్పుడు ఉద్యోగం కోసం తిరగడం బాధగా ఉందని ఏడుస్తుంది కాంచన. అందరూ ఏం చేద్దాం అని అనుకుంటే దానికి దీప మనం ఎదుటి వారి కడుపులు నింపితే మన కడుపులు నిండుతాయ్ అని అంటుంది. దాంతో దీప మనం టిఫెన్ సెంటర్ పెడదామని అంటుంది. కార్తీక్ ఇష్టం లేదని అంటాడు. దీప ఒప్పిస్తుంది. కార్తీక్ ఒప్పుకోడు కానీ దీప టిఫెన్ సెంటర్ పెడదామని అంటుంది. ఇక దీప, కాశీలు కూరగాయలు తీసుకురావడానికి వెళ్దామని బయల్దేరుతారు. దాసు మనసులో ఇంటి వారసురాలివి నువ్వు ఇడ్లీ బండి పెట్టుకోవడం ఏంటమ్మా అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: బిడ్డని చంపేసింది రాజే అని రూపకి చెప్పిన సూర్య.. బంటీ మీద రాజు సీరియస్!