Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప వంట చేసి తీసుకొస్తుంది. కార్తీక్ కింద చాప వేసి భోజనాలకు ఏర్పాటు చేస్తాడు. ఇక శౌర్య డైనింగ్ టేబుల్ లేదా ఎలా తినాలి మన ఇంటికి వెళ్లిపోదాం అంటుంది. దాంతో దీప ఏంటి మొదటి నుంచి డైనింగ్ టేబుల్ మీదే తింటున్నావా మన ఊరిలో సుమిత్ర అమ్మగారి ఇంట్లో ఎలా తినేదానివే కిందే కదా అని అంటుంది. దాంతో శౌర్య సైలెంట్ అయిపోతుంది. ఇక తర్వాత కేవలం పప్పు మాత్రమే ఉంది పచ్చడి, ఫ్రై కర్రీ, అప్పడాలు లేవేంటి అని అడుగుతుంది. దాంతో కార్తీక్ నేను తినిపిస్తా నువ్వు కళ్లు మూసుకో అని ఒక్కో ముద్దకు ఒక్కో పేరు చెప్తాడు. శౌర్య అవును అని ఫీలవుతూ తింటుంది. తన కంటే తన భర్తే పాప మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావ్ అని అనుకుంటుంది.
ఇక కాంచన బయట కూర్చొంటే అనసూయ బ్యాగ్ తీసుకొని వస్తుంది. మా ఊరు వెళ్తున్నా అని చెప్తుంది. ఊరు వెళ్లి దీప పేరు మీద ఉన్న ఇళ్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తా అని అంటుంది. దీపకు ఈ విషయం తెలుసా అంటే దీపకి తెలీదు అని తెలిస్తే ఒప్పుకోదు అని కార్తీక్ బాబు అస్సలు ఒప్పుకోరని అందుకే తెలీకుండా వెళ్తున్నా అని పని మీద వెళ్లానని వాళ్లకి చెప్పు అని అంటుంది. ఇక వెళ్తూ వెళ్తూ ఎప్పుడో నాలుగు చీరలు కొన్నాను నీకు కట్టుకో అని చెప్పను కానీ నీకు నచ్చితే కట్టుకో అని అంటుంది. ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు కానీ లేనప్పుడు ఇచ్చే వారే గొప్ప అని ఎమోషనల్ అవుతుంది కాంచన. ఇక కార్తీక్ చిన్న అద్దం పట్టుకొని ఎలా దువ్వుకోవాలో అని సతమతమవుతాడు. ఇంతలో దీపని పిలిచి పట్టుకోమని తల దువ్వుకుంటాడు. కావాలనే అద్దం కిందకి పెట్టమని దువ్వుకుంటూ దీప కళ్లల్లోకి చూస్తాడు. దీప కూడా అలాగే చూస్తుంటుంది. ఇక కార్తీక్ ఇంటర్వూకి వెళ్తున్నా అని చెప్తాడు. జాబ్ వచ్చిందనే గుడ్ న్యూస్తో చెప్తా అని అంటాడు.
ఇక దీప కార్తీక్‌తో మీరు దగ్గరయ్యే కొద్ది ఇంకా బాగా నచ్చుతున్నారని అంటుంది. దాంతో అలా అని చెప్తే ఇంకాస్త దగ్గరవుతాను కదా అని దీప దగ్గరకు వెళ్తాడు. దాంతో దీప మాటల్లో అని చెప్పి కార్తీక్‌ని ఆపేస్తుంది. ఇక కార్తీక్ తల్లికి చెప్తాడు. అనసూయ గురించి కూడా అడిగితే పని మీద ఊరు వెళ్లిందని చెప్తుంది. ఊరిలో పని అని చెప్పి వెళ్లింది అంటే మనకు దూరంగా వెళ్లిందా ఏంటి అనుకుంటుంది. దాంతో కాంచన అలా ఏం లేదు నేను అంతా మాట్లాడే పంపాను అని చెప్తుంది. ఇక కాంచన దీపని కార్తీక్‌కి ఎదురు రమ్మని చెప్తుంది. ఇంతలో జ్యోత్స్న వస్తుంది. జ్యోత్స్న బాధపడుతూ మాట్లాడితే కార్తీక్ సెటైర్లు వేస్తాడు. మీరు ఇలా వచ్చేశారు అమ్మ ఎంతలా ఏడుస్తుందో తెలుసా అని అంటుంది. మన ఇంటికి వచ్చాం పద వెళ్లిపోదాం అంటుంది. దాంతో కాంచన కూడా జ్యోత్స్నతో నువ్వు వెళ్లిపో అంటుంది. మీరు వచ్చే వరకు నేను వెళ్లను అంటుంది. దాంతో కార్తీక్ మీ తాతకి నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే నిన్ను ఇంట్లోకి రానివ్వడు అంటాడు. దాంతో జ్యోత్స్న నేను ఇక్కడే ఉంటాను అంటుంది.
దాంతో కార్తీక్ అంత అదృష్టం మాకు వద్దని అంటాడు. జ్యోత్స్నని వెళ్లిపోమని అంటాడు. వెళ్లను అంటుంది. దాంతో కార్తీక్ దీప నేను వచ్చేసరికి చెత్త ఏం ఇంట్లో ఉండకూడదు అని ఊడ్చి అవతల పడేయ్ అంటాడు. కాంచన కూడా జ్యోత్స్నని పొమ్మంటుంది. దీప వెళ్లిపో అని జ్యోత్స్నకు చేయి చూపించి తలుపు వేయడానికి వెళ్తుంది. దరిద్రులతో కలిసి ఉండి మా బావ దరిద్రమైపోయాడని అందమైన రెండు కుటుంబాల్ని నాశనం చేసేశావని జ్యోత్స్న అంటుంది. నీకు కావాల్సినంత డబ్బు నీకు ఇస్తాను అంటుంది. నువ్వు మా బావని భర్తలా చూడటం లేదని నాకు మా బావని ఇచ్చేయ్ అని అంటుంది. నేను తలచుకుంటే మా బావకి పెళ్లాన్ని అవ్వగలను అంటే దీప చీపురు పట్టుకొని వస్తుంది. తలచుకోవే అని అని అంటుంది. చీపురు కట్ట తిరగేసి కొడతా అంటే జ్యోత్స్న సారీ చెప్పి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తెలివిగా సీతని లాక్ చేసేసిన మహా.. ఇప్పట్లో సుమతి గురించి తెలిసే అవకాశమే లేదుగా!