Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శౌర్య దీప దగ్గరే ఉంటానని జడ్జితో చెప్తుంది. దీప బోనులో నుంచి వచ్చి శౌర్యని హత్తుకుంటుంది. ఇక జడ్జి దీపతో నీ కూతురు నీ దగ్గరే ఉంటుందని అంటారు. దీప, శౌర్యల ప్రేమలకు ఎమోషనల్ అవుతారు. లాయర్ జ్యోతి, కార్తీక్ అందరూ సంతోషిస్తారు. అనసూయ దీప వైపు ప్రేమగా చూస్తూ వెళ్లిపోతుంది. అది చూసిన దీప అనసూయ వెంట వెళ్తుంది.
నర్శింహ: అందరూ కలిసి నన్ను వెధవని చేశారు పద.
దీప: అత్తయ్య అంటూ అనసూయ కాళ్ల మీద పడుతుంది. అత్తయ్య నా కన్న తల్లి బతికున్నా నా కోసం ఏం చేసేదో తెలీదు అత్తయ్య. ఈరోజు తల్లిలా నన్ను కాపాడారు, నా జీవితం కాపాడారు. నా కూతురిని నాకు దూరం కాకుండా చేశారు.
అనసూయ: చెప్పడం అయితే నేను వెళ్తాను.
దీప: ఎక్కడికి వెళ్తావు అత్తయ్య. ఇంత జరిగాక మీ కొడుకు కోడలు మిమల్ని ఇంటి నుంచి వెళ్లగొడతారు అత్తయ్య. నువ్వు నాతో వచ్చేయ్ నేను నిన్ను చూసుకుంటాను. ఊర్లో ఎలా ఉన్నామో ఇక్కడ అలాగే కలిసి ఉందాం.
అనసూయ: ఓ ఇరవై రూపాయలు ఇవ్వు. నడిచి వెళ్లడం కష్టం కదా షేర్ ఆటోలో వెళ్తా.
దీప: నీ కొడుకు నిన్ను రానివ్వడు అత్యయ్య.
జ్యోతి: కంగ్రాట్స్ దీప సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నావ్. మీ అత్తయ్య చెప్పడం వల్లే నీకు ఈరోజు ఇంత మంచి జరిగింది. నువ్వు నీ మంచి తనంతో ఆవిడ మనసు గెలుచుకున్నావ్. దీపని తీసుకొని సుమిత్ర ఇంటికి వెళ్లిపోతుంది.
చిన్నప్పుడు దీపని సుమిత్ర దగ్గర నుంచి దూరం చేసి పసిబిడ్డగా ఉన్న దీపని పారిజాతం ఓ రౌడీ చేతికి ఇవ్వడం అతడు పసిబిడ్డగా ఉన్న దీపని తీసుకొని వచ్చి బస్ స్టాండ్లో వదిలేయడం చూసిన పారిజాతం కొడుకు వస్తాడు.
పారిజాతం కొడుకు: ఒక పని మనిషి కూతురు యజమాని అయింది. ఒక యజమాని కూతురు అనాథ అయింది. ఆ యజమాని కూతురు ఓ అభాగ్యుడి చేతిలో పడింది. వాడు పేద వాడు అని వాడి దుస్తులు చూస్తే అర్థమవుతుంది. నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టొద్దని ఆ శివనారాయణ నన్ను గెంటేశాడు. అదే శివనారాయణని నా తల్లిని అనాథని చేసినా.. నా తల్లి నా కూతుర్ని ఆ ఇంటికి వారసురాల్ని చేసింది. ఇప్పుడు నా కూతురు ఎలా ఉందో, ఆ అనాథ ఎలా ఉందో. వీళ్లందర్ని వదిలేసినా మళ్లీ ఆ ఊరికే రావాల్సి వచ్చింది. నా కూతురు ఎలా ఉందో ఒక్క సారి చూడాలి. నన్ను ఆ ఇంట్లోకి మళ్లీ రానిస్తారో లేదో.
పారిజాతం: జ్యోత్స్న, పారిజాతం రెస్టారెంట్‌కి వెళ్తారు. నిన్ను ఇంటికి తీసుకెళ్తే ఏం చేస్తావా అనే భయంతో ఇక్కడికి తీసుకొచ్చా. జరిగిన దాన్ని మనం మార్చలేం మర్చిపో.
జ్యోత్స్న: నేను ఆలోచించేది కూటమి గురించి. ఈ దీప నర్శింహ, అనసూయ, శౌర్య వీల్లంతా నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చినట్లు ఉన్నారు. బావ నాకు దక్కడేమో అని నేను భయపడటానికి కారణం దీప, బావ దీపని కలవడానికి కారణం శౌర్య, నా ఎంగేజ్ మెంట్ ఆగిపోవడానికి కారణం నర్శింహ, దీపకి విడాకులు రావడానికి కారణం అనసూయ. రెండు ఎద్దులు కొట్టుకొని కిరాణా కొట్టుని నాశనం చేసినట్లు వీళ్లలో వాళ్లు కొట్టుకొని బావని పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేసుకోవాల్సిన నన్ను ఇలా రెస్టారెంట్‌లో ఆలోచించుకునేలా చేశారు.
పారిజాతం: కోర్టు విడాకులు ఇచ్చేసింది కదా ఇక దీప కార్తీక్‌లు కలవరు. కలిసే అవకాశం కూడా లేదు.
జ్యోత్స్న: అవునా ఒక్కసారి అటు చూడు.(దీప కార్తీక్‌లు శౌర్య చేయి పట్టుకొని అదే రెస్టారెంట్‌కి వస్తారు) వాళ్లు కలిసే వస్తున్నారు. వాళ్లని చూస్తే ఏం అనిపిస్తుంది..
పారిజాతం: దీపకు విడాకులు రావడంతో మీ బావ సెలబ్రేట్ చేస్తున్నాడు.
జ్యోత్స్న: బ్యాచ్ మొత్తం కలిసే ఇంటికి వెళ్లాలి కదా వీళ్లు మాత్రం సపరేట్‌గా ఎందుకు వచ్చారు.
కార్తీక్ శౌర్యకి టిఫిన్ తినమని అంటాడు. దీప కోర్టులో తనకి కార్తీక్‌కి సంబంధం ఉందని అన్న మాటలు గుర్తు చేసుకొని ఏడుస్తుంది. ఇక దీప ముఖం కడుక్కొని వస్తానని వెళ్తుంది. టేబుల్ మీద పడిన దీప కన్నీళ్లు కార్తీక్ చూస్తాడు. దీప దగ్గరకు వెళ్తాడు. జరిగింది తలచుకొని ఆనంద పడాలి కానీ ఏడవకూడదని చెప్తాడు. ఇక కార్తీక్ దీపలు మాట్లాడుకోవడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. అనసూయ తీసుకున్న నిర్ణయం వల్లే తనకు మంచి జరిగిందని దీప అంటుంది. దీనంతటికి కారణం మీరే అని మీ మేలు మర్చిపోలేనని దీప కార్తీక్‌తో అంటుంది. ఇక శౌర్య కలెక్టర్ అవ్వడం ఖాయమని తానే అందుకు సాయం చేస్తానని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.