Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శివన్నారాయణ సంతోషంగా వచ్చి దశరథ్, సుమిత్ర, పారులతో గౌతమ్ కాల్ చేశాడు. ఎవరో ఏదో నింద వేస్తే ఆవేశపడినందుకు సారీ తాతగారు అని చెప్పి జ్యోత్స్నని పెళ్లి చేసుకుంటానని చెప్తాడని చెప్తారు. నింద ఇంకా నిరూపణ కాలేదు కదా నాన్న అని దశరథ్ అంటాడు. దీప వేసిన నిందలన్నీ ఆధారాలు లేనివే అని తన తప్పు తెలుసుకొని దీప నిరూపించకుండా సైలెంట్ అయిపోయిందని అంటాడు. ఈ సారి గౌతమ్ పెళ్లి ముహూర్తం పెట్టమని చెప్తాడని దీప అక్కడికి వచ్చి హడావుడి చేస్తే పోలీసులకు పట్టిస్తానని తాతగారు అంటారు.  

జ్యోత్స్నకు చెప్పొద్దు..

దశరథ్ జ్యోత్స్నకు చెప్పమని సుమిత్రతో అంటే సుమిత్ర వద్దని అంటుంది. ఇప్పుడే అన్నీ చెప్పి జ్యోత్స్నని ఇబ్బంది పెట్టొద్దని ముందు గౌతమ్ వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడి అన్నీ కుదిరిన తర్వాత ముహూర్తం పెట్టి అప్పుడు పెళ్లి గురించి జ్యోత్స్నకు చెప్దామని అంటుంది. ఇప్పటికే రెండు సార్లు నిశ్చితార్థం ఒకసారి పెళ్లి ఆగిపోయినందుకు జ్యోత్స్న చాలా బాధ పడుతుందని ఇప్పుడు అటు ఇటూ అయితే తట్టుకోలేదని అన్నీ సెట్ అయిన తర్వాతే విషయం చెప్దామని సుమిత్ర అంటుంది. పెద్దాయన అది కరెక్టే అని కోడలికి సపోర్ట్ చేస్తారు. 

మొత్తం వినేశా తాత..

జ్యోత్స్న  తాత తల్లిదండ్రులతో చెప్పిన విషయాలన్నీ వినేస్తుంది. గౌతమ్ గాడికి పెళ్లి మీద ఆత్రం ఆగినట్లు లేదని అనుకుంటుంది. దీప సంగతి చూడమని అంటే నాతో పెళ్లికి రెడీ అయిపోతున్నాడు. నా పెళ్లి ఎప్పటికైనా బావతోనే. ఏం చేస్తే ఆ ఇంట్లో పెద్ద గొడవ అవుతుందో అది ఆలోచించాలి. 

దీప ముగ్గేయాలా..

దీప ముగ్గు వేస్తేంటే కార్తీక్ చూసి దీప సాయం చేయాలా అని అంటాడు. నేను వంట చేయడం లేదు ముగ్గు వేస్తున్నా మీరు ముగ్గు వేస్తే ఎవరైనా చూస్తే ఇక అంతే సంగతి అంటుంది. ఇక ఇద్దరూ కలిసి ముగ్గు వేసి రంగులు వేస్తారు. ఒకర్ని ఒకరు చూసి నవ్వుకుంటారు. శౌర్య చూసి ఫోన్‌లో ఫొటోలు తీస్తుంది. కార్తీక్ దీపలు ఫోజ్‌లు ఇస్తారు. ఇక తర్వాత అందరూ కలసి ఫొటోలు తీసుకుంటారు. ఫొటోలు చాలా బాగా వచ్చాయని అనుకుంటారు. దీప బైక్ కొనుక్కోమని అంటుంది. ఈ వారం కొందామని కార్తీక్ అంటాడు. 

దీప సంగతి చూడరా అంటే పెళ్లి కావాలంట..

జ్యోత్స్నకి గౌతమ్ కాల్ చేస్తాడు. దాంతో జ్యోత్స్న గౌతమ్‌తో దీప సంగతి ఏంటి అని అడుగుతుంది. మళ్లీ గౌతమ్ కాల్ చేస్తే పారు వస్తుంది. ఫోన్ మాట్లాడమని అంటే దీప కాల్ లిఫ్ట్ చేసి ముందు నేను పెట్టిన మెసేజ్‌కి ఆన్సర్‌ చేయ్ అంటుంది. దాంతో గౌతమ్ జ్యోత్స్నని పెళ్లి చేసుకోవాలి అంటే ముందు దీప సంగతి చూడాలి అనుకుంటాడు. 

దీప ఒక మాట ఇస్తావా..

కాంచన దీపని పిలిచి నిన్న కార్తీక్ నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాడో తెలీదు కానీ అప్పటి నుంచి నీలో చాలా మార్పు వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నావ్. నువ్వు ఎప్పటికీ ఇలా ఉంటాను అని మాట ఇవ్వు అని అంటుంది. దాంతో దీప కాంచన చేతిలో చేయి వేసి మాట ఇచ్చే టైంకి గౌతమ్ దీప ఇంటి డోర్ కొడతాడు. దీప వెళ్లి చూసి షాక్ అవుతుంది. కోపంగా గౌతమ్‌ని చూస్తుంది. 

దీపకు గౌతమ్ వార్నింగ్..

దీప గౌతమ్‌ని చూసి ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది. గౌతమ్ లోపలికి వెళ్లి కుర్చీ వేసుకొని కూర్చొంటాడు. నువ్వు ఎవర్ని అయినా ఉద్దరించుకో ఎలాంటి ఉద్యమాలు అయినా చేసుకో నా జోలికి మాత్రం రాకు అని గౌతమ్ దీపతో చెప్తాడు. దానికి దీప ఆల్రెడీ వచ్చాను అంటుంది. నాకు ఎదురు రావడం ఎంత డేంజరో అర్థం చేసుకో అని అంటుంది. దానికి అనసూయ నా కోడలు పెట్రోల్‌లా మండిపోతుంది. వంకరగా మాట్లాడే వారినే వాయించేస్తుంది అలాంటిది మిమల్ని వదలదు అంటుంది. నాతో పెట్టుకుంటే ఎక్కడికి వెళ్తానో నాకే తెలీదు. కార్తీక్ రెస్టారెంట్ వరకు అయినా వెళ్తా.. నీ కూతురి స్కూల్ వరకు అయినా వెళ్తానని అంటాడు. నా వాళ్ల జోలికి వస్తే నీకు ముత్యాలమ్మ జాతరే అని దీప అంటుంది. దానికి గౌతమ్ నువ్వు జాతరే చేసుకుంటావో జాగారం చేసుకుంటావో నీ ఇష్టం కానీ ఇప్పటి నుంచి నువ్వేం చేసినా నాకు తెలుస్తుంది నేను రియాక్ట్ అయితే ఎలా ఉంటుందో నీకు తెలీదు అంటాడు. గౌతమ్ వెళ్లిపోతాడు. బలుపుతో వచ్చాడని దీప అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: అసలైన వారసురాలు ఎవరు నాన్న? కాశీ, స్వప్నల ఎంక్వైరీ