Karate Kalyani About Pavithra Jayaram And Chandrakanth: బుల్లితెర ఆర్టిస్ట్ పవిత్ర జయరామ్ మరణం, ఆ తర్వాత చంద్రకాంత్ సూసైడ్.. ఇవన్నీ ఒక్కసారి కలకలం సృష్టించాయి. పవిత్ర లేదనే బాధతో చందు సూసైడ్ చేసుకున్నాడు. దీంతో వీరిద్దరి పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలు బయటికొచ్చాయి. ఎంతోమంది బుల్లితెర ఆర్టిస్టులు.. వీరితో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. తాజాగా కరాటే కళ్యాణి కూడా చందు, పవిత్రల గురించి మాట్లాడారు.
అప్పటివరకు తెలియదు..
‘‘చందు నాకు ఎనిమిదేళ్ల నుంచి తెలుసు. చాలా డెడికేషన్‌తో పనిచేసేవాడు. మంచి ఆర్టిస్ట్. ఎనిమిదేళ్ల ముందు ఆ అబ్బాయి హైట్, పర్సనాలిటీ చూసి కచ్చితంగా మంచి స్థాయికి వస్తాడు అనుకునేవాళ్లం. మేము కలిసి 2,3 సీరియల్స్ చేశాం. బిగ్ బాస్‌కు వెళ్లే ముందు త్రినయని సీరియల్‌లో నేనే చేశాను. అందులో పవిత్ర నా సిస్టర్ క్యారెక్టర్, చందు నా అసిస్టెంట్ క్యారెక్టర్. అప్పుడు నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడలేదు. తాజాగా జీ తెలుగు ఈవెంట్ జరిగినప్పుడు మొదటిసారి నేను పవిత్రతో మాట్లాడాను. భర్త, పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగాను. నేను చందును పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. తన పెళ్ల అయిపోయింది కదా, ఆ పెళ్లికి కూడా నన్ను పిలిచాడు అన్నాను. విడాకులు అయిపోయినట్టున్నాయి వాళ్లిద్దరి మధ్య ఏదో సమస్య వచ్చింది అని చెప్పింది’’ అని గుర్తుచేసుకుంది కరాటే కళ్యాణి. ఇద్దరిలో ఎవరికీ విడాకులు కాలేదు అనే విషయం తనకు అప్పుడు తెలియదని చెప్పింది.
చచ్చిపోతాను అన్నాడు..
‘‘పవిత్ర చనిపోయిన తర్వాత త్రినయని టీమ్‌ను అడిగి చందు నెంబర్ తీసుకున్నాను. కాల్ చేశాను. బాగా ఏడ్చాడు. తన మాటలను బట్టి డిప్రెషన్‌లో ఉన్నాడని అర్థమయ్యింది. జాగ్రత్త అని చెప్పాను. తర్వాత మెసేజ్ చేస్తే చచ్చిపోతాను అన్నాడు. బాధలో ఉన్నప్పుడు అందరూ అదే అంటారులే అనుకున్నాను. కానీ నా వల్ల అయినంత ధైర్యం చెప్పాను. మూడు రోజులు ఫోన్లు చేస్తూ ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాను. పవిత్రతో పెళ్లి అయిపోయిందా అని అడిగితే అయిపోయిందని చెప్పాడు. భార్య గురించి అడిగితే దాదాపు విడాకులు అయిపోయాయి అన్నాడు. ఇద్దరు చనిపోయిన తర్వాత ఇంటర్వ్యూలు అన్నీ చూసిన తర్వాత నాకు అర్థమయ్యింది ఇద్దరూ విడాకులు తీసుకోలేదని. తన భార్యను చందు ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పవిత్రను పెళ్లి చేసుకున్నాడు అనగానే వాళ్లిద్దరూ మంచిగానే ఉండేవాళ్లు కదా, ఈమెను ఇష్టపడి చేసుకున్నాడేమో అని మాత్రమే అనుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి.
అట్రాక్షన్..
‘‘పవిత్ర కోసం భార్యను వదిలేశాడని తెలిసిన తర్వాత చందు మీద చాలా కోపం వచ్చింది. ముందే తెలిస్తే కచ్చితంగా తిట్టేదాన్ని. ఈ ఇద్దరు చేసిన తప్పుకు రెండు కుటుంబాలు బాధపడుతున్నాయి. అక్కడ పవిత్ర భర్త బాధపడుతున్నాడు. అసలు ఆయన లేడని చెప్పింది. నిజంగానే చందు భార్య తనను చాలా భరించింది. చాలా కొట్టేవాడట. పవిత్రను కూడా కొట్టాడట. త్రినయని సెట్‌కు వెళ్లి తన భర్తను వదిలేయమని పవిత్ర కాళ్ల మీద పడి చందు భార్య బ్రతిమిలాడిందట. అప్పుడే చందును ఆ సీరియల్ నుంచి తీసేశారు. తీసేసిన తర్వాత అతను లేకపోతే నేను యాక్ట్ చెయ్యనని పవిత్ర గొడవ చేసిందట. అయినా సరే వాళ్లు ఒప్పుకోలేదు. పవిత్ర, చందుది అట్రాక్షన్. పవిత్రకు యాటిట్యూడ్ ఉంటుంది. ఆమె తక్కువ స్థాయి నుంచి వచ్చాను అని చెప్తున్నప్పుడు ఆ పొగరు ఉండకూడదు. చందు పిల్లలు పెద్దయ్యాక యూట్యూబ్‌లో ఈ వీడియోలు అన్ని చూసి మా నాన్న వేస్ట్ అనుకుంటారు’’ అని తన అభిప్రాయాలను బయటపెట్టింది కళ్యాణి.
Also Read: ఇండస్ట్రీ నుంచి చందు కుటుంబానికి ఆర్థిక సాయం.. అసలు విషయం చెప్పిన టీవీ నటి నీరజ!