Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode పోలీసులు విహారి ఇంటికి వస్తారు. లక్ష్మీ, విహారి నిందని తమ మీద వేసుకుంటే చారుకేశవ ఆ ప్రాజెక్ట్ ఇన్‌ఛార్జిని నేనే నాదే పూర్తి బాధ్యత అని అంటాడు. మీరు ఎందుకు అని లక్ష్మీ, విహారి అంటే మీరు బయటే ఉండాలి.. మొన్న వందకోట్లు ఇప్పుడు ఇది దీని వెనక ఉన్నది ఎవరో మీరే తెలుసుకోవాలి అని తాను అరెస్ట్ అవ్వడానికి సిద్ధపడతాడు.

వసుధ ఏడుస్తుంది. భయపడకు విహారి నన్ను బయటకు తీసుకొస్తాడు అని చారుకేశవ ఆ దారుణానికి బాధ్యత వహిస్తూ పోలీసులతో వెళ్తాడు. అంబిక, సుభాష్ చక్కగా నువ్వుకుంటూ ఇది సరిపోదు రెండో ప్లాన్ కూడా చేసేయాలి అని అనుకుంటారు. అంబిక సుభాష్‌కి విషం బాటిల్ ఇచ్చి రేపు కాంటీన్ ఫుడ్‌లో పెట్టమని అప్పుడు అందరూ ఫుడ్ పాయిజిన్ అయి హాస్పిటల్‌కి వెళ్లాలని అప్పుడే విహారిని దించి తాను ఛైర్మన్‌ గద్దె ఎక్కొచ్చని అనుకుంటుంది. 

చారుకేశవ జైలులో ఉండటం వల్ల వసుధ ఏడుస్తుంది. పద్మాక్షి ధైర్యం చెప్తుంది. విహారి వసుధ దగ్గరకు వెళ్లి బాధ పడొద్దని మామయ్యకి ఏం కాదని చెప్తాడు. అంబిక మనసులో నీకు అంత టైం గ్యాప్ ఇవ్వను విహారి అని అనుకుంటుంది. ఇక టీవీలో విహారి, లక్ష్మీ వల్లే ఇవంతా జరుగుతున్నాయని విహారిని ఛైర్మన్‌గా తొలగించాలని లక్ష్మీని ఎండీ పదవి నుంచి తొలగించాలని కార్మికులు కోరినట్లు చూపిస్తారు. ఇక ఈ దారణం వెనక ఉన్నది చారుకేశవ అని తేలితే ఉరి శిక్ష వేస్తారని చూపిస్తారు. వసుధ ఏడుస్తుంది. లక్ష్మీ మనసులో ఏదో ఒక చిన్ని ఆధారం దొరికినా బాగున్ను అనుకుంటుంది.  

లక్ష్మీ మొత్తం గుర్తు చేసుకొని సీసీ టీవీ ఫుటేజ్ చూసి ధర్నానికి వచ్చిన వాళ్లు అసలు కార్మికులో కాదో తేల్చాలని అనుకుంటుంది. అందులో ఒక వ్యక్తిని చూసి గతంలో అతనితో సిగరెట్ తాగాడని గుర్తు చేసుకొని వాడు లక్ష్మీతో కేర్‌ లెస్‌గా మాట్లాడటం చారుకేశవ వాడిని కొట్టి ఉద్యోగంలో తీసేయడం గుర్తు చేసుకుంటుంది. ఇదంతా కుట్రే అని లక్ష్మీకి అర్థమైపోతుంది. లక్ష్మీ బయటకు వెళ్తుంటే విహారి ఆపుతాడు. లక్ష్మీని ఎండీ పోస్ట్‌కి రిజైన్ చేయమని అంటాడు. నిన్ను అరెస్ట్ చేస్తారుఅని అంటే లక్ష్మీ చేస్తే చేయని ఇదంతా కుట్ర అది చేసింది ఎవరో తెలుసుకోవాలని అంటుంది.  ఛైర్మన్‌గా నన్ను అరెస్ట్ చేసినా పర్లేదు ఎండీగా నిన్ను అరెస్ట్ చేస్తారు అని అంటాడు. ఏం జరిగినా నాకే జరగాలి మీకేం కాకూడదు అని విహారి అంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకున్నారు ఇప్పుడు నేను మిమల్ని వదిలేయలేను అంటుంది. నీ ఆలోచన నువ్వేం చేయాలి అనుకుంటున్నావో నీకు అయినా అర్థం అవుతుందా.. మన బంధం వదిలేస్తున్నావ్.. కానీ నా వెంటే ఉంటున్నావ్.. కన్నీళ్లు రాకుండా దాయగలవు కానీ కళ్లతో భావాలు దాయలేదు అని విహారి అంటాడు. 

సుభాష్ క్యాంటీన్ ఫుడ్‌లో విషం కలిపిస్తాడు.  అందరూ ఆ ఫుడ్ తిని వాంతులు చేసుకొని పడిపోతారు. దూరం నుంచి చూస్తూ సుభాష్ నవ్వుకుంటాడు. ఇక ఇంటికి పద్మాక్షి సుప్రీం కోర్టు సూపర్ సీనియర్ లాయర్‌ని ఇంటికి పిలిపిస్తుంది. విహారి అతనికి విషయం చెప్తారు.  ఇది చాలా కాంప్లికేంట్‌ విషయం అని లాయర్ అంటారు. నాసి రకం సిమెంట్ వాడారని వచ్చిందని ఆ సిమెంట్ కంపెనీ అధికారి కూడా వచ్చి రిపోర్ట్స్ చూపిస్తారు. ఆ సిమెంట్‌లో ఏం ప్రాబ్లమ్ లేదని.. బిల్డింగ్ దగ్గర వేరే నాసిరకం సిమెంట్ వాడారని రిపోర్ట్స్‌లో అర్ధమవుతుందని చెప్తారు. ఆ నాసిరకం సిమెంట్ నేను అక్కడ పెట్టించామని అంబిక అనుకుంటుంది. ఈ కేసు కోర్టుకి వెళ్తే మీకు పెద్ద శిక్ష పడుతుందని కంపెనీలు మూసేయాల్సి వస్తుందని లాయర్ చెప్తారు. కార్మికులతో మాట్లాడి సెటిల్ చేసుకోండి.. పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వండి అని అంటారు. 

విహారి చనిపోయిన కుటుంబానికి కోటి ఇస్తాను అంటే సిమెంట్ కంపెనీ అతను 50 లక్షలు ఇస్తానని అంటారు. ఇంతలో విహారి కంపెనీలో మరో దారుణం అని చాలా మందికి ఫుడ్ పాయిజిన్ అయిందని న్యూస్ వస్తుంది. విహారి ఆ న్యూస్ చూసి కుప్ప కూలిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.