Illu Illalu Pillalu Serial Today Episode చెంబు గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. చెంబులో నగలు ఉన్నాయి.. చెంబు వెనక ఏదో పెట్ట కథే జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని రామరాజు అంటారు. వల్లీ చాలా టెన్షన్ పడుతుంది. తిరుపతి వణుకుతూ పోలీస్ కంప్లైంట్ ఇస్తారా అని అంటే దానికి రామరాజు మీరు ఎందుకు అంత షాక్ అవుతున్నారు అని అడుగుతాడు. గతంలో విషయాలు గుర్తు చేసుకొని రామరాజు పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటాడు.

రామరాజు బయటకు వెళ్లే సరికి వల్లీ తల్లి భాగ్యం ఎంట్రీ ఇస్తుంది. అన్నయ్యా గారండీ నగలు దొరికాయండీ.. అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. ఫ్లాష్‌ బ్యాక్‌లో వల్లీ తల్లికి  విషయం చెప్తే భాగ్యం పరుగున షాప్‌కి వెళ్లి చెంబు కొనేస్తుంది. వల్లీ గిల్ట్ నగలు తల్లికి గోడ చాటు నుంచి అందిస్తుంది. ఆ గిల్ట్ నగల్ని చెంబులో పెట్టి భాగ్యం పట్టుకొని వస్తుంది. దాన్ని రామరాజుకి భాగ్యం చూపించి ఆ చెంబే ఇది అని అంటారు. సాగర్ వాళ్లు చెంబు ఇది కాదు అని అంటాడు. 

తిరుపతి కూడా ఇది కాదే దానితో నేను కాపురం చేశా కదా నాకు తెలుసు అని అంటాడు. రామరాజు భాగ్యంతో అసలు నీకు ఎక్కడ దొరికిందమ్మా అని అడుగుతాడు. దాంతో భాగ్యం రోడ్డు పక్కన పొదల్లో దొరికిందన్నయ్యా అని చెప్తుంది. మా ఇంట్లో నగలు పోయిన విషయం నీకు ఎలా  తెలుసు అని అంటే మా అమ్మడు కాల్ చేసి చెప్పిందండీ.. వెతుక్కుంటూ వస్తుంటే దొరికిందని అంటాడు. 

రామరాజుకి ఇంకా అనుమానం పెరిగిపోతుంది. దొంగ ఎత్తుకెళ్లకుండా పొదల్లో ఎలా పడేస్తాడు. పైగా మీకు అక్కడే ఎలా దొరికింది అంటాడు. మొత్తానికి భాగ్యం ఏదో ఒకటి చెప్పేస్తుంది. రామరాజుకి కన్వీనెన్స్‌గా అనిపించదు. ప్రేమ మాత్రం దొంగతనం జరగడం ఇది రెండో సారి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని అంటుంది. వేదవతి కూడా పోలీసులకు చెప్దామంటుంది. రామరాజు వెళ్దాం అని బయల్దేరుతుంటే మళ్లీ నర్మద అపేస్తుంది. నగలు అయినా చూద్దాం అని ప్రేమ అంటే ఎలా ఉన్న మూతి అలాగే ఉందని భాగ్యం కవర్ చేసేస్తుంది. 

వల్లి బట్టలు ఆరేస్తూ మొత్తానికి తప్పించుకున్నా ఆ ప్రేమ మాత్రం నన్ను వదలడం లేదు దాని పని చెప్తా అనుకుంటుంది. ఇంతలో కొరియర్ వస్తుంది. ప్రేమ పేరులో వచ్చిందని తెలిసి వల్లి తీసుకోవడానికి వెళ్తుంది. వల్లి ఆ పార్శిల్ తీసుకొని అందులో ఏముందో చూడాలని ఎవరూ లేని చోటుకి తీసుకెళ్లి తీసుకుంటుంది. అందులో ఓ బొకే ఉంటుంది. దాని మీద వన్ వీక్ అని రాసుంటుంది. వల్లీ ఆదిశగా ఆలోచిస్తుంది. దాని వెనక ఏముందో తెలుసుకోవాలి అనుకుంటుంది. 

ప్రేమ దగ్గరకు పార్శిల్ తీసుకెళ్లి బొకే వచ్చిందని చెప్తుంది. పంపిన వాళ్లు ఊరు పేరు రాయలేదు అని కూడా చెప్తుంది. ప్రేమ చాలా భయపడుతుంది. వల్లీ మొత్తం గమనించి ఏదో ఉందని అనుకుంటుంది. తీసుకో అని ఈరోజు నీ పుట్టిన రోజు కాదు ఏదో స్పెషల్ కూడా కాదు అయినా బొకే వచ్చింది ఏంటి అని అడుగుతుంది. వెళ్తూ వెళ్తూ దాని మీద వన్ వీక్ అని రాసి ఉంది దాని అర్థం ఏంటి అని అంటుంది. నేను చూసుకుంటా నీకు ఎందుకు అని ప్రేమ అంటుంది. నీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నేను పాలు పంచుకుంటా అని అంటుంది. ప్రేమ వెళ్లిపో మని చెప్తుంది. వల్లి తొంగి తొంగి చూస్తే డోర్ వేసేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.