Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్రకు తన తండ్రి నీకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతాడు. దానికి సహస్ర బావని అత్తని ప్రేమగా చూసుకుంటాడని అది చూసి తనకు బావ చాలా నచ్చాడని అంటుంది. తల్లీకొడుకుల బాండింగ్ చూసి పెళ్లి అనగానే ఓకే చెప్పేశానని సహస్ర అంటుంది.


పద్మాక్షి: నువ్వు ఇంత నమ్మకం పెట్టుకుంటున్నావ్ కానీ ఆ యమున మీద నాకు నమ్మకం లేదు. ఆఖరి నిమిషంలో ఏదో ఒకటి చేస్తుంది. తల్లీ మాటనే విహారి కూడా వింటాడు.
సహస్ర: అమ్మ బావకి నేను అంటే ఇష్టం నాకు కూడా బావ అంటే ఇష్టం. అందుకే కదా పూజకు రాలేకపోయినందుకు బావ చాలా ఫీలయ్యాడు. మనం వచ్చేసినందుకు బావ ఎంత బాధపడ్డాడో బావ ప్రేమ నాకు అర్థమైంది. 


ఇక పద్మాక్షి ఫ్యామిలీ విహారి ఇంటికి బయల్దేరుతారు. మరోవైపు అంబిక తన లవర్‌తో మాట్లాడుతుంటే కనకం అక్కడికి కాఫీ తీసుకొని వెళ్తుంది. కాఫీ ఇస్తూ ఉండగా కాఫీ చుక్కలు అంబిక చేయి మీద పడటంతో అంబిక కనకం కొంగు పట్టి లాగి తన చేయి తుడుచుకుంటుంది. కనకం అవమానంగా ఫీలవుతుంది. ఏడుస్తూ క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కనకం ఏడుస్తుంటే యమున చూసి ఏమైందని అడుగుతుంది. కంట్లో నలక పడిందని కనకం చెప్తే యమున తన కొంగుతో ఆవిరి పెడుతుంది. దానికి కనకం తన తల్లిని గుర్తు చేసుకుంటుంది. 


యమున: ఈ ఇళ్లు ఈ ఇంట్లో మనుషులు నీకు నచ్చారా. ఎవరు ఏమన్నా నువ్వు ఏం పట్టించుకోకు. నీకు ఏం కావాలి అన్నా నన్ను అడుగు.
కనకం: లేదండి నా లాంటి అమ్మాయి గురించి మీరు ఆలోచించి మీ ఇంట్లో చోటు ఇవ్వడమే ఎక్కువ. మీ అభిమానం చాలు.
యమున: లేదమ్మా నువ్వు నిస్వార్థం లేని అమ్మాయివి నా కొడుకులా అందరి కోసం ఆలోచిస్తావు. నీ లాంటి మంచి అమ్మాయికి ఆ దేవుడు మంచి జీవితం ఇస్తాడు. మంచి అమ్మాయి. భగవంతుడా ఇంత మంచి అమ్మాయికి మంచి జీవితం ఇచ్చే బాధ్యత నీదేనయ్యా.


మరోవైపు కనకం దగ్గర నగలు కొట్టేసిన విహారి చిన్న మామ తన భార్యకి గాజులు ఇస్తాడు. ఎక్కడివని అతని భార్య అడిగితే కొన్నానని చెప్పి వాటిని ఆమె చేతులకు తొడుగుతాడు. భర్త నిజంగానే కొనుక్కొచ్చాడని మురిసిపోతుంది. నీ ప్రేమ కోసం ఎంత అయినా ఖర్చు చేసి కొనచ్చని అంటాడు. ఇక విహారి కంపెనీని కొట్టేయాలని ప్లాన్‌లో ఉంటాడు. గాజులకే తన భార్య ఇంత మురిసి పోతే కొట్టేసిన మొత్తం బంగారం చూస్తే ఇంకేమైపోతుందా అని అనుకుంటాడు. మరోవైపు విహారి రెడీ అయి కిందకి వస్తాడు. కనకం కృష్ణుడి దగ్గర దీపాలు వెలిగిస్తుంది. పండగ అంతా నీ చేతుల మీద జరుగుతుందని చాలా సంతోషంగా ఉందని విహారి చిన్న అత్త కనక మహాలక్ష్మీతో అంటే మీరు ఇచ్చిన చనువే అని కనకం అంటుంది. పని వాడు వచ్చి కనకానికి ఫోన్ వస్తుందని చెప్తే కనకం పైకి వెళ్తుంది. ఇక కనకం పెట్టిన దీపం ఆగిపోకుండా విహారి అడ్డుకుంటాడు. మరోవైపు సహస్ర విహారికి కాల్ చేసి వచ్చేస్తున్నాం అని చెప్తుంది. కనకం పైకి వెళ్లి ఫోన్ చూస్తే తన తండ్రి ఫోన్ చేస్తుంటాడు. అది చూసి కనకం ఫోన్ పట్టుకొని ఏడుస్తుంది.


తల్లిదండ్రులు మాట్లాడుతుంటే కనకం ఏడుస్తుంది. కృష్ణాష్టమి కదా నువ్వు లేకపోవడం వల్ల నీ జ్ఞాపకాలతో ఉన్నామని అల్లుడు ఏం చేస్తున్నాడని ఆదికేశవ్ అంటాడు. ఇక తర్వాత ఆది కేశవ్ వీడియో కాల్ చేయమని అంటాడు. ఇక సర్పంచ్ నువ్వు, అల్లుడు అమెరికా వెళ్లిన విషయం పేపర్లో వేస్తున్నారని చెప్తాడు. ఇక కనకం తండ్రి ఆరోగ్యం గురించి మాట్లాడుతుంది. కనకం ఫోన్ పెట్టేసి తనని క్షమించమని కోరుకుంటుంది. ఇక సహస్ర వాళ్లు ఇంటికి వచ్చేస్తారు.


 సహస్ర బావని పట్టుకొని గిరి గిరా తిప్పేస్తుంది. ఈ రోజు మొత్తం చేయి వదలని అంటుంది. ఇక యమున కనకం దగ్గరకు వస్తుంది. కనకం పాయసం చేస్తానని యమునతో చెప్తుంది. వంట గదిలోకి వెళ్తుంది. కిచెన్ నీటిగా లేకపోవడంతో ముందు స్టవ్ కిచెన్ క్లీన్ చేస్తుంది. స్టవ్ శుభ్రంగా తుడిచి బొట్లు పెడుతుంది. ఇక విహారి తాత విహారి, సహస్రలకు కలసి కృష్ణుడికి మాల వేయమని చెప్తుంది. ఇద్దరూ వేస్తారు. తర్వాత సహస్ర పక్కనే ఉన్న మరో దండ తీసి విహారి మెడలో వేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అత్తా కోడళ్ల ఛాలెంజ్ అదుర్స్.. సుమతి వస్తే మహాలక్ష్మీ తట్టాబుట్టా సర్దాల్సిందేనా!