Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ తన భర్తతో కలిసి అమ్మవారికి సారె ఇవ్వకపోతే 100 కొరడా దెబ్బలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇస్తారు. లక్ష్మీ వల్ల అరిష్టం జరిగినందుకు పంచాయితీ చెట్టు దగ్గర తీర్పు ప్రకటిస్తారని అక్కడికి అందరూ రావాలని దండోరా వేయిస్తారు. లక్ష్మీ, చారుకేశవ, వసుధలు అది వింటారు.
చారుకేశవ, వసుధలు ఇప్పుడేం చేస్తాం అంటే శిక్ష అనుభవిస్తా అని లక్ష్మీ అంటుంది. ఊరి జనం విహారి కుటుంబం మొత్తం చెట్టు దగ్గర సమావేశం అవుతారు. అందరూ లక్ష్మీతో నీ భర్త వచ్చారా అని అడుగుతారు. ఇంకా రాలేదు కాబట్టి లక్ష్మీకి శిక్ష వేద్దాం అని వీర్రాజు ఊరి పెద్దలు అంటే లక్ష్మీకి శిక్ష పడితే నేను ఊరుకోను అని విహారి అంటాడు. సహస్ర విహారిని పక్కకి తీసుకెళ్లి నువ్వేం మాట్లాడకు బావ.. మళ్లీ అందరూ నీ గురించి తప్పుగా అనుకుంటారు అని చెప్తుంది. నా కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను అని విహారి అంటాడు. అన్యాయం ఏంటి విహారి తన భర్తని తీసుకురమ్మని అతని గురించి అడుగుతున్నారు అంతే కదా అని పద్మాక్షి అంటుంది.
లక్ష్మీ ఊరి జనంతో నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను.. విహారి గారు మధ్యలో రావొద్దు అని చెప్తుంది. వీర్రాజు శిక్ష వేయమని అంటాడు. తనకి శిక్ష వేయడానికి వీల్లేదు అని విహారి అంటాడు. కాదాంబరి మనవడితో ఇందాక నుంచి మీ తాతయ్య ఎందుకు మాట్లాడలేదో తెలుసా ఆయన కూడా ఒకప్పుడు ఊరి పెద్ద.. ఊరి గురించి ఆయనకు తెలుసు అందుకే సైలెంట్‌గా ఉన్నారు అని అంటుంది. ఇంటి పని మనిషి కోసం నువ్వు ఒకల్తా పుచ్చుకోవడం ఏం బాలేదు విహారి అని పద్మాక్షి అంటుంది. లక్ష్మీ విహారితో మీరు జోక్యం చేసుకోవద్దు నేను శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నాను అంటుంది.
వీర్రాజు ఊరిలో ఒకరికి కొరడా ఇచ్చి కొట్టమని అంటాడు. అతను లక్ష్మీని కొరడాతో కొడతాడు. లక్ష్మీ నొప్పికి విలవిల్లాడిపోతుంది. మళ్లీ కొట్టబోతే విహారి వెళ్లి కొరడా పట్టుకొని లక్ష్మీని చూస్తాడు. యమున లక్ష్మీని పట్టుకొని లక్ష్మీ అని ఏడుస్తుంది. నేను ప్రాణం పోయిన విహారి నా భర్త అని చెప్పను అని లక్ష్మీ మనసులో అనుకుంటుంది. తనంతట తాను అమ్మవారి విగ్రహం పునఃప్రతిష్ట చేస్తానని చెప్పిందా.. మీరే కదా తనతో చేయించారు అమ్మవారిని అడ్డు పెట్టుకొని మీరు తప్పు చేస్తున్నారు. మీ అందరి ముందే తను తన తాళిని తన భర్త కోసం పూజ చేసింది.. తను తప్పుడు మనిషి కాదని అంటాడు. లక్ష్మీని కొడుతుంటే మధ్యలో విహారి వెళ్లి దెబ్బలు తింటాడు.
లక్ష్మీ ఏడుస్తూ విహారిని అడ్డు లేవమని అంటుంది. నాకు నీ మీద ప్రేమ ఉన్నా లేనట్టు నటించను ఇదీ నా ప్రేమ అని విహారి అంటాడు. ఈ శిక్ష ఆపండి అని లక్ష్మీ అంటుంది. ఈ శిక్ష వద్దు అనుకుంటే మీకు మరో శిక్ష ఉంది చేస్తావా.. ఈ శిక్ష వద్దు అంటే నువ్వు ఊరిపెద్దల అందరి కాళ్లు పట్టుకో అని వీర్రాజు చెప్తాడు. పద్మాక్షి, సహస్ర ఆపినా విహారి ఆగడు.. కాళ్లు పట్టుకోవడానికి వెళ్తాడు. దాంతో లక్ష్మీ విహారి గారు ఆగండి ఈ శిక్ష నేను ఆనందంగా అనుభవిస్తా అని లక్ష్మీ కొరడా తీసుకొని కొట్టుకుంటుంది. విహారి ఆపుతాడు. పద్మాక్షి వచ్చి నీకు ఏంటి సంబంధం తనని కాపాడటానికి అంటుంది. తను మనతో వచ్చింది తన బాధ్యత మనది.. పోచమ్మ మీరు పిలిస్తే కదా మేం ఊరు వచ్చాం.. మమల్ని పిలిచి ఇలా చేయడం ఏం బాలేదు. అయినా తను ఎవరి కోసం స్కూల్ మంటల్లో పిల్లల్ని కాపాడింది.. అమ్మవారికి రక్త తర్పణం చేసింది అని అడుగుతాడు. ఈ శిక్ష ఆపలేం అని వీర్రాజు అంటే పోచమ్మ ఆపుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఇలాగే తప్పు చేశాం.. యమునమ్మని అనాథ అని అవమానించి పంపించేశాం ఇప్పుడు అదే తప్పు చేయొద్దు.. లక్ష్మీకి ఎవరూ లేకపోవడం ఏంటి.. సాక్ష్యాత్తు అమ్మవారే తన కోసం వచ్చింది తను అమ్మవారి బిడ్డ అని పోచమ్మ అంటుంది. అమ్మవారే తనని దత్తత తీసుకుంటే ఎలాంటి అరిష్టాలు అపశకునాలు ఉండవు.. ఆ అమ్మమాట చెప్తున్నా నా మాట అతిక్రమించకండి అని లక్ష్మీని అమ్మవారి దత్తత తీసుకున్నట్లు కార్యక్రమం చేయిస్తుంది. ఇకపై లక్ష్మీ స్వయంగా అమ్మవారి బిడ్డ తనకు అమ్మవారికి సంబంధించి ఏ కార్యక్రమం అయినా చేసే అర్హత ఉంది అని పోచమ్మ చెప్తుంది. తాంబూలం చీర ఇచ్చి అచ్చం అమ్మవారిలా రెడీ అయి రేపు రమ్మని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.