Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ పట్టీ అమ్మవారి గుడి దగ్గర దొరకడంతో లక్ష్మీనే అమ్మవారి విగ్రహం దొంగతనం చేసిందని వీర్రాజుతో పాటు అతను తీసుకొచ్చిన కొంత మంది ఊరి జనం అంటారు. మీ వల్ల మా ఊరి ఆచారాలు దెబ్బతిన్నాయ్, మా మనోభవాలు దెబ్బతిన్నాయి అని రాళ్లు విసిరి విహారి కుటుంబాన్ని కొడతారు. 

Continues below advertisement

లక్ష్మీకి ఎక్కువ రాళ్లతో కొడతారు. తలకు రాళ్లు తగిలి రక్తం వస్తుంది. లక్ష్మీ అమ్మవారి విగ్రహం పట్టుకునే పరిస్థితిలో ఉండదు. ఆడవాళ్లని రాళ్లతో కొట్టే పరిస్థితికి దిగజారిపోయారా అని పోచమ్మ అడిగితే మన అమ్మవారి విగ్రహం దొంగతనం చేస్తే ఎలా ఊరుకుంటాం.. వాళ్లందరిని ఊరు నుంచి వెలివేయాలని అంటారు. మీ కోసం వచ్చిన వాళ్లని వెలివేసి ఇలాగే దరిద్రంలో బతుకుతామా.. తను అమ్మవారిని దొంగతనం చేయలేదు అని పోచమ్మ అంటుంది. సాక్ష్యాలు ఉన్నాయని వీర్రాజు మనుషులు అంటారు. అయితే పాప రాత్రి ప్రకాశ్‌ని చూడటం అలా వీర్రాజుని చూస్తూ ఉండటం పోచమ్మ చూసి పాప దగ్గరకు వెళ్లి ఆ పట్టీని ఎక్కడైనా చూశావా అని అడుగుతుంది. దాంతో పాప ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ పట్టీ గుడిలో పడేశారు. కానీ ఆ అక్క గుడికి రాలేదు అని చెప్తుంది.

విహారి, చారుకేశవ వాళ్లు వీర్రాజు వాళ్ల మీద కోప్పడతారు. మూర్ఖంగా మీరు చేసిన పనికి మీకు ఏ శిక్ష వేయాలి అని పెద్దాయన అడుగుతారు. ఇక లక్ష్మీ తల మీద  నుంచి రక్తం కారుతూ అమ్మవారి మీద పడుతుంది. లక్ష్మీకి పోచమ్మ ఊరి జనం తరుఫున క్షమాపణలు చెప్తుంది. లక్ష్మీ విగ్రహం పట్టుకోలే ఇబ్బంది పడుతుంది. లక్ష్మీని హాస్పిటల్‌కి తీసుకెళ్తానని విహారి అంటే ముందు ఈ కార్యక్రమం పూర్తి చేద్దామని అని లక్ష్మీ అంటుంది. పోచమ్మ కలుగజేసుకొని అమ్మాయి విగ్రహాన్ని ఎత్తుకుంది.. అది కింద పెట్టకూడదు గుడిలో పెట్టి పునఃప్రతిష్ట చేసిన తర్వాత సారె ఇచ్చి ఊరు నుంచి వెళ్లండి అయ్యా అని చెప్తుంది. 

Continues below advertisement

లక్ష్మీ అమ్మవారి విగ్రహం పట్టుకొని  కాస్త దూరం నడిచి గాయాల వల్ల నడవలేకపోతుంది. అమ్మవారి విగ్రహం కింద పెట్టకూడదు కాబట్టి లక్ష్మీని విహారి ఎత్తుకొని గుడి వరకు తీసుకెళ్తాడు. గుడిలోకి వెళ్లిన తర్వాత పంతులు విగ్రహం తీసుకొని గర్భగుడిలో పెడతారు. పోచమ్మ లక్ష్మీని వైద్యం చేయడానికి తీసుకెళ్తుంది. విహారి లక్ష్మీ వెనకాలే వెళ్తుంటే సహస్ర ఆపి దండం పెట్టుకోమని చెప్తుంది. పోచమ్మ లక్ష్మీకి నాటు వైద్యం చేసి తలకు కట్టు కడుతుంది. అమ్మవారిని కాపాడిన నిన్ను మేం ఇక నుంచి ఈ ఊరి మనిషిలా భావిస్తున్నాం ఇను నుంచి నువ్వు ఈ ఊరి మనిషివే అని పోచమ్మ చెప్తుంది. అంతా నా అదృష్టం అని లక్ష్మీ అంటుంది. తర్వాత పోచమ్మ లక్ష్మీని తీసుకెళ్లి విహారి పక్కన నిల్చొపెడుతుంది. ఇద్దరు భార్యల మధ్యలో విహారి నిల్చొంటాడు. తర్వాత విహారి కుటుంబం అమ్మవారి సారె ఇచ్చి ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. విహారి, పద్మాక్షిలు ఇక నుంచి ఊరికి ఏ కష్టం రాకుండా చూసుకుంటామని అంటారు.

పోచమ్మ విహారి ఫ్యామిలీతో త్వరలోనే మీరు శుభవార్త వింటారని మీ నాన్న గారు త్వరలోనే పుడతారని చెప్తుంది. అందరూ చాలా సంతోషిస్తారు. విహారిని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమని పంపిస్తారు. లక్ష్మీని కూడా పోచమ్మ పంపిస్తుంది. సహస్ర వెళ్తాను అంటే సారె ఇవ్వాలని పంతులు తీసుకెళ్తారు. విహారి లక్ష్మీని పట్టుకుంటాడు. పోచమ్మ ఏం చెప్పిందో విన్నావా అని విహారి అంటే మీకు సహస్రమ్మకి త్వరలో సంతానం కలుగుతుందని అంటుంది. అలా కాదు నాకు పిల్లలు పడతారు అని చెప్పారు. అది నీతో అని నేను చెప్తా అని విహారి అంటాడు. అలా మాట్లాడొద్దని లక్ష్మీ అంటుంది.

నా కోసం నువ్వు ప్రాణాలకు తెగించి అన్నీ చేస్తావ్ నాకు నువ్వు దూరంగా ఉండాలి కానీ నువ్వు ఉంటున్నావా.. నా కోసం ఆలోచించకుండా ఉంటున్నావా.. ఉండటం లేదు.. ఇదంతా నీకు నా మీద ఉన్న ఇష్టం కానీ నువ్వు బయట పెట్టడం లేదు.. అని అంటాడు. నాకు మీరు ఇష్టం లేదు ఇదంతా కేవలం కృతజ్ఞత మాత్రమే అని లక్ష్మీ అంటుంది. కనక మహాలక్ష్మీ నువ్వు దాచి పెడుతున్న ప్రేమని నీతోనే చెప్పిస్తా అని విహారి అనుకుంటాడు.  లక్ష్మీ ఆరు బయట తలకు ధూపం వేసుకుంటుంటే విహారి వెనక నుంచి చూసి  లక్ష్మీ దగ్గరకు వెళ్లి మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు. లక్ష్మీ షాక్ అయి లేచి విహారి ఏంటి ఇది అని అంటే చిన్ని కాంప్లిమెంట్ అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.