Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక గురించి పూర్తి నిజం తెలుసుకున్న విహారి అంబికను కాల్చేస్తాడు. అంబికకు బులెట్ తగలడంతో విహారి, లక్ష్మీ ఇద్దరూ అంబికను హాస్పిటల్‌లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయిస్తుంటాడు. ఇంతలో విహారికి తల్లి, అత్తలు కాల్ చేస్తే హాస్పిటల్‌లో ఉన్నామని జరిగింది అంతా చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు.
యమున మేం కూడా హాస్పిటల్‌కి వస్తాం అని అంటే వద్దు సహస్ర, చారుకేశవలు వస్తున్నారని మీరు వద్దని అనేస్తాడు. అంబిక కండీషన్ బాగానే ఉందని చెప్తాడు. పద్మాక్షి విహారితో అంబికను జాగ్రత్తగా ఇంటికి తీసుకురారా అందరం కలిసి మాట్లాడుదాం అని అంటుంది. విహారి సరే అంటాడు. ఇక డాక్టర్ అంబికను చూసి విహారి వాళ్లతో బులెట్ తీసేశాం.. ఇప్పుడు బాగానే ఉంది. మెలకువ రాగానే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని అంటాడు.
సహస్ర వాళ్లు వచ్చి విషయం తెలిసి షాక్ అయిపోతారు. అందరూ లోపలి అంబిక దగ్గరకు వెళ్తారు. అంబిక అందర్ని క్షమించమని అడుగుతుంది. సహస్ర అంబికతో పిన్ని నువ్వు ఇవన్నీ చేశావ్ అంటే నమ్మలేకపోతున్నాం.. నువ్వు నీ సొంత వాళ్లకే ఇదంతా చేస్తావని అనుకోలేదని అంటుంది. విహారి అత్తతో మీరు ఏ లాభంతో ఇలా చేయాలి అనుకున్నారో తెలీదు కానీ లక్ష్మీని ఎందుకు చంపాలి అనుకున్నారు అని అడుగుతుంది.
అంబిక నీ కోసమే విహారి అని చెప్తుంది. ఇదంతా నేను నా అంతట చేయలేదు.. అని అంటే లక్ష్మీ మనసులో అంబికమ్మ ఏదో కొత్త కుట్ర చేస్తున్నారని అనుకుంటుంది. చారుకేశవ అయితే ఇదంతా నువ్వు నీ అంతట చేయలేదు అని చెప్తే నమ్మలేం అని అంటాడు. దానికి అంబిక తనని కొందరు బెదిరించి ఇదంతా చేయమని చెప్పారని వద్దు అనడంతో విహారిని చంపేస్తా అన్నారని చెప్పి కొన్ని వీడియోలు చూపిస్తుంది. వాటిలో విహారిని టార్గెట్ చేసి గన్ గురి పెట్టినట్లు ఉంటుంది. అందరూ షాక్ అవుతారు. అంబిక విహారితో ఇవి చూపించి నన్ను బెదిరించి ఈ ఆస్తులు, కంపెనీల కంటే నాకు నువ్వే ముఖ్యం అనిపించి వాళ్లు చెప్పనట్లు చేశానని అంటుంది.
ఫ్లాష్‌బ్యాక్‌లో విహారి అంబికను చంపాలని గన్ గురిపెట్టినప్పుడే అంబిక సుభాష్‌కి సైగ చేసి కాల్చమని అంటుంది. ఈ బులెట్ కూడా వాళ్లు నీకు గురి పెడితే నాకు తగిలిందని అంటుంది. విహారి, సహస్రలు అంబిక చెప్పిన మొత్తం నమ్మేసి అంబికకు సారీ చెప్తారు. అంబికను తీసుకొని ఇంటికి వెళ్తారు. అందరూ అంబికను చూసి ఎలా ఉందని మాట్లాడుతారు. అంబిక అందరికీ సారీ చెప్తుంది. నువ్వు కావాలి అని తప్పు చేయలేదు కదా అని పద్మాక్షి అంటే బావ కోసమే ఇదంతా చేశావ్ కదా పిన్ని అందరూ నిన్ను అర్థం చేసుకున్నారని సహస్ర అంటుంది. మొత్తానికి అంబిక అందర్ని తన మాయలో పడేస్తుంది.
లక్ష్మీకి అందరి ముందు థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు మా వాళ్లని నన్ను కాపాడావని చెప్తుంది. ఇక మీద మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని లక్ష్మీ అంటుంది. ఇక ముందు మరింత జాగ్రత్తగా ఉంటానని అంబిక అంటుంది. లక్ష్మీ మనసులో అంబికమ్మ కట్టుకథ అల్లేసి అందర్ని నమ్మించింది ఇప్పటికైనా మారితే మంచిది అనుకుంటుంది. ఇక లక్ష్మీ జడ్జి తమని ఎందుకు గుడికి రమ్మని చెప్పారా అని ఆలోచిస్తుంది. జడ్జికి కాల్ చేసి విడాకులు ఇచ్చేలా చెప్పాలని బతిమాలుతా అని జడ్జికి కాల్ చేస్తుంది. విడాకులు ఇచ్చేయండి మేడం అంటే మీరు గుడికి రావాల్సిందే అని జడ్జి అంటుంది. సహస్ర చాటుగా ఆ మాటలు వింటుంది.
విహారి లక్ష్మీని పిలిచి జడ్జి ఎందుకు గుడికి రమ్మని పిలిచారని అడుగుతాడు. విడాకులు ఇస్తారా ఇవ్వరా ఏమైనా గెస్ చేసుంటావ్ కదా చెప్పు అని అడుగుతాడు. సహస్ర ప్రకాశ్‌ని పిలిచి విహారి, లక్ష్మీని జడ్జి గుడికి రమ్మని చెప్పారని విషయం చెప్తుంది. వాళ్లకి కచ్చితంగా విడాకులు అయిపోవాలని సహస్ర అంటే విహారి లక్ష్మీతో అస్సలు నీకు నేను విడాకులు ఇవ్వను అని అంటాడు. మీ భవిష్యత్ బాగుండాలి అంటే ఈ ఇంట్లో అందరూ కలిసిమెలసి ఉండాలి అంటే మీరు విడాకులు ఇవ్వాల్సిందే అని అంటుంది. నువ్వు లేని భవిష్యత్ నాకు వద్దు కనకం.. నువ్వు లేనప్పుడు నా చుట్టూ ఎవరు ఉంటే నాకేంటి అని అంటాడు.
సహస్ర ప్రకాశ్‌తో లక్ష్మీ మెడలో తాళి ఉండటానికి వీల్లేదు. దాని మెడలో ఆ తాళి నువ్వే తీసేయాలి అని అంటుంది. విహారి లక్ష్మీతో నువ్వే కాదు జడ్జి కాదు ఎవరు నీ మెడలో తాళి తీయాలి అన్నా తీయలేరు అని అంటాడు. ప్రకాశ్ సహస్రతో లక్ష్మీ, విహారిని కచ్చితంగా విడదీస్తానని చెప్తాడు. ఉదయం యమున పూజ చేస్తుంది. నీ ముందు దీపం వెలిగిస్తూ ఒక బంధాన్ని ఆపేయాలని ప్రయత్నిస్తున్నాను.. నేను ఎంత గానో అభిమానించే లక్ష్మీకి అన్యాయం చేస్తున్నాను అని తెలుసు కానీ నా భర్త కోరిక విహారి ఆశయం కోసం ఇంత మందిని బాధ పెట్టలేక లక్ష్మీని బాధ పెడుతున్నా విహారికి లక్ష్మీకి విడాకులు వచ్చేలా చూడమని కోరుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.