Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకమే సహస్ర డ్రస్ కట్ చేసేసిందని పద్మాక్షి కనకాన్ని కొడుతుంది. తానే తప్పు చేయలేదని లక్ష్మీ ఎంత చెప్పినా పద్మాక్షి వినదు. లక్ష్మీని ఇంటి నుంచి పొమ్మని అంటుంది. చేయి పట్టుకొని ఈడ్చుకెళ్లబోతే లక్ష్మీ తనకు ఏ పాపం తెలీదు అని అంటుంది. అయినా పద్మాక్షి ఊరుకోకుండా లక్ష్మీని ఈడ్చుకెళ్లి బయటకు నెట్టేస్తుంది. లక్ష్మీ కింద పడిపోతుంది. ఇంతలో అప్పుడే విహారి కారు వచ్చి ఆగుతుంది. 


యమున వచ్చి లక్ష్మీని లేపి ఏమైంది అమ్మా లక్ష్మీ లే అమ్మా ఏమైంది అని అడుగుతుంది. లక్ష్మీ యమున వెనక దాక్కుంటుంది. విహారి లక్ష్మీని చూడాలని ప్రయత్నించినా చూడలేకపోతాడు. లక్ష్మీ కూడా విహారికి కనిపించకుండా దాక్కుంటుంది.


యమున: ఏం తప్పు చేసిందని లక్ష్మీని ఇంత నిర్దాక్షిణ్యంగా వాకిట్లోకి విసిరేశారు. మీకు ఇష్టం లేకపోతే ఒక మూల ఉంటుంది అంతే కానీ ఇలా చేయడం ఏంటి.
పద్మాక్షి: అది చేసిన పని తెలిస్తే విసిరి పడేయడం కాదు చంపి పారేస్తావ్. 
విహారి: అత్తా అందరూ ప్రశాంతంగా ఉండండి అసలేం జరిగింది అని లక్ష్మీని బయటకు గెంటేశారు.  
సహస్ర: బావ చూడు తనేం చేసిందో అని డ్రస్ చూపిస్తుంది. ఎంతో ఇష్టపడి కొనుకున్న డ్రస్. 
లక్ష్మీ: నాకు ఏం పాపం తెలీదమ్మా ఆ డ్రస్ జోలికే నేను పోలేదు. ఇంట్లో శుభకార్యం జరిగితే నేను ఎందుకు అలా చేస్తా.
పద్మాక్షి: ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తా. ఇలాంటి అడ్రస్‌ లేని వాళ్లని చంకనెక్కించుకుంటే ఇలాగే చేస్తారు.
యమున: లక్ష్మీ అలాంటిది కాదు వదిన తనని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. ఒక్క క్షణం నిదానంగా ఆలోచించండి.
పద్మాక్షి: అర్థమైంది మాకు చాలా బాగా అర్థమైంది అర్హత లేని వాళ్లని అందలం ఎక్కిస్తే ఇలాగే చేస్తారు. విలువ లేని వాళ్లని కలుపుకోవాలని చూస్తే వెన్నుపోటు పొడుస్తారు.ఈ లక్ష్మీ కూడా అలాంటిదే.
విహారి: అత్త ఒక్క నిమిషం లక్ష్మీ ఆ డ్రస్ చింపడం నువ్వు చూశావా. సహస్ర నువ్వు చూశావా.
సహస్ర: లేదు బావ కానీ రూంలోకి వెళ్లింది తనే నీ డ్రస్‌కి నేను మ్యాచింగ్‌కి వేసుకోవడం లేదని చింపేసింది.
విహారి: నేను వేసుకునేది ఏంటి.
యమున: నాన్న విహారి మీ నాన్న డ్రస్ నువ్వు వేసుకోవాలి అనుకున్నా.


ఇంట్లో ఎవరైనా లక్ష్మీ ఆ డ్రస్ చింపడం చూశారా అని అడుగుతాడు విహారి.తప్పు చేస్తే శిక్షించాలి కానీ తప్పు చేశారనే అనుమానంతో చేయడం తప్పు అని అంటాడు. ఆ అధికారం మీకు ఎక్కడిది అని అంటాడు. పండు వచ్చి లక్ష్మీ గదిలోకి వెళ్లి అర నిమిషంలోనే వచ్చిసింది అని చెప్తాడు. దాంతోవిహారి అర నిమిషంలో ఇది సాధ్యం కాదు కానీ తనని నిందిచారని అంటాడు. వేలెత్తి చూపడం సులభమే కానీ రుజువు చేయడం కష్టమని అంటాడు లక్ష్మీ మీద నిందలు వేయొద్దని చెప్తాడు. పెద్దాయన ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని లక్ష్మీని లోపలికి తీసుకెళ్లమని  యమునతో చెప్తాడు. యమున లక్ష్మీని తీసుకెళ్తుంది. అంబిక డిసప్పాయింట్ అయిపోతుంది. ఇక విహారి అత్త చేతులు పట్టుకొని ఇది ఇక్కడితే వదిలేద్దామని చెప్పి పద్మాక్షిని లోపలికి తీసుకెళ్తాడు.


జరిగిన దాని గురించి విహారి గదిలో ఆలోచిస్తూ ఉంటే భక్తవత్సలం అక్కడికి వస్తాడు.  లక్ష్మీని అలా అవమానించడం ఎందుకని అంటాడు. ఇక అత్త నిజంగానే నన్ను ఇష్టపడి అల్లుడిని చేసుకుంటుందా అని అడుగుతాడు. దానికి భక్తవత్సలం ఇష్టం లేకుండా పద్మాక్షి ఇక్కడి వరకు రాదు అని అంటుంది. ఇక ఏదో ఒక రోజు మీ అమ్మ విలువ అందరూ తెలుసుకుంటారని అంటాడు. ఇంతలో పండు వచ్చి విహారికి డ్రస్ ఇస్తాడు. ఇది మీ నాన్న డ్రస్ అని మీ అమ్మ జాగ్రత్తగా దాచుకుందని భక్తవత్సలం విహారికి చెప్తాడు. విహారి డ్రస్ పట్టుకొని ఎమోషనల్ అవుతాడు. మరోవైపు యమున లక్ష్మీ కోసం వెతుకుతుంటుంది. లక్ష్మీ సహస్ర డ్రస్ కుడుతూ ఉంటుంది. అది యమున చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ప్రీతి, ఉషల్ని చంపేస్తా అని మహాని బెదిరించిన సీత.. పిన్ని, తండ్రిని కొట్టమని రామ్‌తో చెప్పిన సీత!