Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ దగ్గర నిశ్చితార్థం రింగులు ఉన్నాయని యమున అందరితో చెప్తుంది. దానికి పద్మాక్షి నిశ్చితార్థం జరగాలి అనుకునే వాళ్ల కంటే నాశనం అయిపోవాలి అని కోరుకునే వాళ్ల ఎక్కువ ఉన్నారని అందుకే ఏదో ఒక అడ్డు పుల్ల వేస్తున్నారని అంటుంది. అలా మాట్లాడొద్దని ఎవరూ నిశ్చితార్థం ఆపాలని చూడట్లేదని విహారి అంటాడు.  


పద్మాక్షి: ఇంకా మీ అమ్మని వెనకేసుకురాకు. 30 లక్షల విలువైన ఉంగరాలు ఎక్కడ భద్ర పరచాలో మీ అమ్మకి తెలీదా. ఇంత ముఖ్యమైన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీ అమ్మకి చెప్పాలి. 
కాదాంబరి: మీ అమ్మకి బుద్ధి బుర్ర లేదు అని చెప్తావా.
విహారి: నువ్వు కూడా ఏంటి నానమ్మ.
కాదాంబరి: నేనే కాదు ఈ పరిస్థితిలో ఎవరూ అయినా ఇలాగే మాట్లాడుతారు. 30 లక్షల ఉంగరాలురా. పని మనిషికి ఇవ్వడం ఏంట్రా. పైగా లక్ష్మీ ఏదో గొప్పదని వెనకేసుకొస్తున్నారు.
చారుకేశవ: ఆ 30 లక్షలతో అది ఎప్పుడో వెళ్లిపోయి ఉంటుంది.
యమున: చారు కేశవ లక్ష్మీ అలాంటిది కాదు.
చారుకేశవ: తనని ఇంకా ఎందుకు వెనకేసుకొస్తున్నారో తనని ఎందుకు ఇంట్లో ఉండనిస్తున్నారో అర్థం కావడం లేదు.
విహారి: మామయ్య లక్ష్మీ ఉత్తమురాలు కాబట్టే మంచిది కాబట్టే అమ్మ ఇంత పెద్ద బాధ్యత లక్ష్మీకి ఇచ్చింది. ఇప్పుడు లక్ష్మీ ఎక్కడుందో చూస్తే సరి ఈ రాద్ధాంతం అంతా అవసరం లేదు. 
భక్తవత్సలం: విహారి లక్ష్మీ చాలా మంచిదిరా కానీ చిన్న చిన్న పనులు చేయించుకోవాలి కానీ ఇంత పెద్ద బాధ్యత ఇవ్వకూడదురా.
విహారి: తాతయ్య మీరంతా లక్ష్మీని పని మనిషిగా చూస్తున్నారు కానీ అమ్మ తనని ఈ ఇంటి మనిషిగా చూస్తుంది అందుకే ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది. అమ్మ  చేసిన పని నాకు తప్పు అనిపించలేదు.
పండు: బాబుగారు లక్ష్మీమ్మ చాలా మంచిది. తనకు అలాంటి దొంగ బుద్ధి ఉండదు అయ్యా. 


ఏంట్రా దాన్ని వెనకేసుకొస్తున్నావ్ అని చారుకేశవ పండుని కొడతాడు. విహారి అడ్డుకొని చారుకేశవని మందలిస్తాడు. పండుకి క్షమాపణ చెప్తాడు. మరోవైపు లక్ష్మీ నడుచుకుంటూ అమ్మవారి దగ్గరకు ఆగుతుంది. తన కొంగు అమ్మవారి త్రిశూలానికి తగలడంతో ఎవరో వెనక నుంచి పట్టుకొని లాగుతున్నారని కంగారు పడి వెనక్కి తిరిగి చూస్తుంది. చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటుంది. ఇక కొంగులో ఉంగరాలు చూసి నిశ్చితార్థం విషయం గుర్తు చేసుకొని చాలా కంగారు పడుతుంది. అందరూ యమునమ్మ గారిని తిడుగుతుంటారని సమయానికి వెళ్లాలని బయల్దేరుతుంది. సహస్రని మీ ఇంటి కోడలిని చేసుకోవడం మీకు ఇష్టమేనా అని అడుగుతుంది. దానికి విహారి మన రెండు కుటుంబాలు కలడానికి ఎంత ప్రయత్నిస్తున్నానో తెలిసి కూడా ఇలా అనడం బాలేదు అత్త అంటాడు. మొదటి సారి మీ అమ్మవల్ల నిశ్చితార్థం ఆగిపోయింది. ఇప్పుడు కూడా మీ అమ్మ వల్లే అని అంటుంది. 


మరోవైపు విహారి ఫ్రెండ్ ఫోన్ స్విఛ్ ఆఫ్ అయిపోతే షాప్ అతనికి ఛార్జింగ్ పెట్టమని ఫోన్ ఇస్తాడు. ఇక విహారి తనతో సహస్ర పెళ్లి చేయాలని మా అమ్మే కోరుకుందని చెప్తాడు. మరోవైపు అంబిక ఫోన్ రావడంతో బయటకు వెళ్లిపోతుంది. పద్మాక్షి లక్ష్మీని దొంగ అని అంటే లక్ష్మీ దొంగ కాదు అని విహారి అంటాడు. విహారికి సహస్రకి రాసి పెట్టి లేదనుకుంటా అందుకే నిశ్చితార్థం ఇన్ని సార్లు ఆగిపోతుందని చారుకేశవ అంటాడు. దాంతో విహారి షాక్ అవుతాడు. మరోవైపు సత్య విహారికి కనకమహాలక్ష్మీ ఫొటో పంపిస్తాడు. ఇక విహారి సిగ్నల్‌ లేక ఫొటో చూడలేడు. ఇంతలో లక్ష్మీ పరుగున వస్తుంది. విహారి తనని చూసేస్తాడని బయట నుంచి వెళ్లబోతే అంబిక లక్ష్మీని చూసి లాక్కొని ఇంట్లోకి వెళ్తుంది.  లక్ష్మీని  విసిరేస్తే వెళ్లి అందరి మందు పడిపోతుంది. విహారి కూడా అక్కడే ఉంటాడు. లక్ష్మీ కింద పడిన లక్ష్మీని అంబిక జుట్టు పట్టుకొని విహారి ఎదురుగా నిలబెడుతుంది. విహారి లక్ష్మీని చూసి బిత్తరపోతాడు. చెమటలు పట్టేస్తాడు. ఇక ఫొటో అప్పుడే ఓపెన్ అవుతుంది. ఫొటో చూసి లక్ష్మీని చూసి పెళ్లి మొత్తం గుర్తు చేసుకుంటాడు. మనసులో ఇంట్లో లక్ష్మీగా ఉన్నది కనక మహాలక్ష్మీనా ఇన్ని రోజులు నేను లక్ష్మీ లక్ష్మీ అని పిలిచింది కనక మహాలక్ష్మీనా అని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకం ఫూల్.. తప్పించుకొని పరుగులు.. మళ్లీ నిశ్చితార్థం డౌటే!