Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక, సహస్రలు లక్ష్మీ మిస్సింగ్ కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. విహారి కూడా వస్తే అంబిక విహారితో మేం కంప్లైంట్ ఇస్తామో లేదో అని చెక్ చేయడానికి వచ్చావా అని అడుగుతుంది. అలా ఏం లేదు అత్త ఇందాక కోపంతో అనేశా అని విహారి అంటాడు. అందరూ ఎస్‌ఐ దగ్గరకు వెళ్లి విషయం చెప్తారు.
ఎస్‌ఐ లక్ష్మీ గురించి వయసు అడిగి ఎవరితోనైనా వెళ్లిపోయిందేమో అని అంటాడు. విహారి అరవడంతో నేను కేసు తీసుకోని అని ఎస్‌ఐ అంటాడు. అంబిక, సహస్రలు ఎస్‌ఐ గారు మీరు చాలా రూడ్‌గా మాట్లాడుతున్నారు.. కేసు తీసుకోవడం మీ బాధ్యత అని అంటారు. నేను తీసుకోను ఇది నా స్టేషన్ అని ఎస్‌ఐ అంటాడు. ఇంతలో స్టేషన్‌కి విహారి ఫ్రెండ్ షీటీమ్ స్పెషన్ వింగ్ ఎస్‌ఐ సంధ్య వస్తుంది. ఆమెను కూడా ఎస్‌ఐ లెక్క చేయడు. నేను తలచుకుంటే నీ మీద ఇక్కడికి ఇక్కడే వంద కేసులు పెడతా అని ఎస్‌ఐ అంటే నేను తలచుకుంటే ఏం చేస్తానో తెలుసా అని విహారి డీఎస్పీకి కాల్ చేసి విషయం చెప్తాడు.
ఎస్‌ఐ వణికిపోతాడు. డీఎస్పీతో కూడా మాట్లాడుతాడు. డీఎస్పీగారు ఏం చెప్పారు అని సంధ్య అడిగితే సారీ మేడం మీ సాయం తీసుకొని ఆ లక్ష్మీని కనిపెట్టమని చెప్పారని అంటాడు. ఇక విహారి వాళ్లు లక్ష్మీ ఫోటో మిస్సింగ్ రోజు వేసుకున్న బట్టల రంగుతో సహా అన్నీ డిటైల్స్ ఇస్తారు. అంబిక సహస్రతో ఆ లక్ష్మీ అడవిలోకి వెళ్లి చచ్చిపోయింది అని అనుకుంటే విహారి కేసులు అవి ఇవీ అని తిరుగుతున్నాడు అని అంటుంది. పిన్ని నీ టెన్షన్ చూస్తుంటే నువ్వే ఏదో చేసినట్లు ఉన్నావ్ అని సహస్ర అంటుంది. నేనేం చేయలేదు.. ఏమైనా చేస్తే నీకు చెప్పనా అని అంటుంది. ఇంతకీ నువ్వు ఏమైనా చేశావా నీ బావ లక్ష్మీ.. లక్ష్మీ అని దాని చుట్టూ తిరుగుతున్నాడని నువ్వే ఇలా చేశావా అని అడుగుతుంది అంబిక.
సహస్ర కోపంగా ఆ లక్ష్మీ అంటే నాకు కోపమే అది మన ఇంటికి పని మనిషిగా వచ్చి నా స్థానం కొట్టేయాలి అని చూస్తుంది. అది దొరికితే దాని సంగతి అప్పుడు చెప్తా అని సహస్ర అంటుంది. ఇక ఇంతలో ఎస్ఐకి ఒకరు కాల్ చేసి పొలిమేర చివరన ఓ అమ్మాయి బాడీ దొరికింది అని విహారి చెప్పిన గుర్తులతో ఒకమ్మాయి బాడీ దొరికిందని ఎస్ఐకి చెప్తారు. ఎస్‌ఐ ఆ విషయం విహారి వాళ్లకి చెప్తారు. విహారి చాలా కంగారు పడతాడు. చారుకేశవ, విహారి పోలీసులతో పాటు లొకేషన్కి బయల్దేరుతారు. అంబిక, సహస్ర ఇంట్లో విషయం చెప్పడానికి ఇంటికి వెళ్దాం అని అనుకుంటారు. ఆబాడీ లక్ష్మీదే అయితే దాని దరిద్రం వదిలిపోతుందని అనుకుంటారు.
విహారి వాళ్లు బాడీ ఉన్న లొకేషన్కి వెళ్తారు. బాడీ మీద క్లాత్ కప్పేసి ఉంటే విహారి లక్ష్మీని అలా చూడలేను అని బాధ పడతాడు. తప్పదురా అని చారుకేశవ విహారిని తీసుకెళ్తాడు. విహారి లక్ష్మీతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకొని ఏడుస్తూ లక్ష్మీని ఈ పరిస్థితుల్లో చూడలేను.. నా వల్ల కాదు అని అంటాడు. సంధ్య కూడా చూడమని అంటుంది. విహారి కుదరదు అనేస్తాడు. అది లక్ష్మీనే అయితే నేను బతకను తనతో పాటు నేను చచ్చిపోతా అని విహారి అంటాడు. శవం దగ్గరకు వెళ్లిన విహారి ఏడుస్తూ చూడలేకపోతాడు. దాంతో చారుకేశవ బాడీ కన్ఫ్మమ్ చేయడానికి వెళ్తాడు. చారుకేశవ చూసి విహారి తను మన లక్ష్మీ కాదు అని సంతోషపడతాడు. విహారి కూడా చూసి లక్ష్మీ కాదు అని చెప్తాడు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.