Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి మందులు తీసుకొని లక్ష్మీ దగ్గరకు వెళ్తాడు. నాకు చూపు రావడానికి మీరు యమునమ్మ గారు నా కోసం చాలా ఖర్చు చేస్తున్నారు.. కష్టపడుతున్నారు.. మీకు యమునమ్మకి చాలా రుణపడి ఉంటా అని లక్ష్మీ అంటుంది. రుణం ఏంటి ఇది నా బాధ్యత అని విహారి అంటాడు.

Continues below advertisement

నర్సులా సుభాష్ అక్కడే ఉంటే మరో నర్సు పిలిచి విహారి వాళ్లని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమని అంటుంది. సుభాష్‌ తీసుకెళ్తాడు. విహారి బయట కూర్చొంటాడు. సుభాష్‌ లక్ష్మీ కళ్లలో కెమికల్స్ ఉన్న డ్రాప్స్ వేస్తాడు. ఇక సహస్ర డాక్టర్‌తో నాకు అన్ని టెస్ట్‌లు చేశారు కదా నాకు ఏ ప్రాబ్లమ్ లేదు కదా.. మా ఇంట్లో అందరూ ఇంటి వారసుడి కోసం ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు అన్నీ నా మీద మా బావ మీద ఉన్నాయి అని అంటుంది. డాక్టర్ సహస్రతో నువ్వు మీ బావ సంతోషంగా ఉంటారు. నీ ఆశ నెరవేరుతుంది అని అంటారు. సహస్ర చాలా సంతోషపడుతుంది. త్వరలోనే అమ్మని అవుతా అని డాక్టర్‌తో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉందని అంటుంది.

డాక్టర్ సహస్రని బయట వెయిట్ చేయమని అంటుంది. పద్మాక్షి ఏడుస్తూ చూశారు కదా డాక్టర్ అందుకే మీకు అంత రిక్వెస్ట్ చేశాను.. ఈ విషయం నా కూతురికి తెలీకూడదు అని అంటుంది. ఇక విహారి గురించి అడిగితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకొస్తా అని అంటుంది. లక్ష్మీ విహారితో డ్రాప్స్ వేసినప్పటి నుంచి కళ్లు మంటగా ఉన్నాయి అని నాకు చూపు వస్తుందా అని అడుగుతుంది. నీకు కచ్చితంగా చూపు వస్తుంది అని విహారి అంటాడు. ఇంతలో రెటీనా టెస్ట్ చేయడానికి పిలుస్తారు. 

Continues below advertisement

పద్మాక్షి బిల్ కట్టడానికి వెళ్తుంది. సహస్ర డాక్టర్ గదిలో అటూ ఇటూ తిరుగూతూ ఉంటుంది. లక్ష్మీని డాక్టర్ రెటీనా టెస్ట్ చేస్తుంటారు. ఇద్దరూ ఒకే హాస్పిటల్‌లో ఉండటం ఇద్దరికీ ఒకే టైంలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సహస్ర అక్కడేఉన్న ఓ బేబీ ఫొటో ముట్టుకుంటుంది. హ్యాపీగా ఫీలవుతూ ఉంటే నర్సు వచ్చి చూసి సహస్ర దగ్గరకు వెళ్లి బాధగా ఏ అమ్మాయి అయినా పిల్లలు కావాలనే కలలు కంటారు.. అమ్మ అవ్వాలని చాలా ఆశపడతారు అమ్మా.. కానీ చాలా కొంత మందికే అమ్మతనం ఉండదు.. అని అంటుంది. నాతో ఇవన్నీ చెప్తున్నారు ఏంటి అని సహస్ర అనుకుంటుంది. ఇక లక్ష్మీని చూసిన డాక్టర్ కూడా ఇదేంటి ఇలా ఉంది అని అనుకుంటాడు.

విహారిని లోపలికి పిలిపిస్తారు. లక్ష్మీని బయటకు పంపిస్తారు. ఇక నర్సు సహస్రతో నువ్వు కూడా దురదృష్టవంతురాలే అని అంటుంది. ఏయ్ ఏంటి అలా అంటున్నావ్ అని సహస్ర షాక్ అయిపోతుంది. విహారి డాక్టర్‌తో ఏమైంది లక్ష్మీకి అంతా బాగుందా.. అని అడుగుతాడు. ఇక నర్సు సహస్రతో అదే అమ్మా మీకు గర్భసంచి తీసేయడం వల్ల పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు కదా అని అంటుంది. సహస్ర బిత్తరపోతుంది. విహారితో డాక్టర్ లక్ష్మీకి చూపు శాశ్వతంగా రాదు అని చెప్తాడు. విహారి బిత్తర పోతాడు. లక్ష్మీ, సహస్రలకు ఇద్దరికీ ఒకే సారి డాక్టర్లు బ్యాడ్ న్యూస్ చెప్తారు. 

లక్ష్మీకి మ్యాచ్ అయ్యే ఐ డానర్ దొరికితే తప్ప లక్ష్మీకి చూపు రాదు అని అంటారు. విహారి షాక్ అయిపోతాడు. ఇక సహస్రని నర్సు మీరు ఎప్పటికీ తల్లి కారు అని డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చారని చెప్పడంతో సహస్ర కోపంతో నన్నే అంత మాట అంటావా అని నర్సు మీదకు కత్తెర పట్టుకొని చంపేస్తా అని వెళ్తుంది. పద్మాక్షి, డాక్టర్ వచ్చి సహస్రని ఆపుతారు. సహస్ర ఏడుస్తూ ఇది నేను ప్రెగ్నెంట్‌ని కాను నాకు గర్భసంచి తీసేశారు.. నాకు పిల్లలు పుట్టరు అని అంటుంది అని ఏడుస్తుంది. సహస్ర ఆవేశపడుతుంటే పద్మాక్షి ఆపి తను చెప్పేది నిజం అని అంటుంది. సహస్ర షాక్ అయి కుప్పకూలిపోతుంది. నేను బతకను చచ్చిపోతా అని సహస్ర చాలా ఏడుస్తుంది. పద్మాక్షి సహస్రని ఆపుతుంది. 

సహస్ర ఏడుస్తూ పిల్లలు పుట్టకపోతే ఎందుకు బతకడం అమ్మా.. నాకు పిల్లలు పుట్టరు అని తెలిస్తే ఆ ఇంటి కోడల్ని అవుతానా.. బావ నన్ను అంగీకరిస్తాడా.. బావ లేని బతుకు నాకు వద్దు అమ్మా నేను బతకలేను అని అంటుంది. నీకు విహారికి పిల్లలు పుట్టాలు అనే ఈ డాక్టర్‌ని కలిసింది అని పద్మాక్షి చెప్తుంది. పాజిబిలిటీ ఉంది కానీ ఏ ప్రాసెస్ తెలుసుకోవడానికి చూస్తున్నాం అని డాక్టర్ చెప్తుంది. మీ బావని ఇక్కడికి తీసుకురా మిగతాదంతా నేను చూసుకుంటా అని డాక్టర్ చెప్తుంది. 

విహారి లక్ష్మీ దగ్గరకు వచ్చి లక్ష్మీని చూసి అలా ఉండిపోతాడు. లక్ష్మీ విహారితో నాకు చూపు వస్తుందని డాక్టర్ చెప్పారా అని అడుగుతుంది. ఇంతలో ఓ నర్సు విహారికి సహస్ర రిపోర్ట్స్ ఇచ్చేస్తారు. మరో నర్సు వచ్చి వాటిని తీసుకొని రిపోర్ట్స్ మారిపోయావి సార్ అని చెప్పి తీసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.