Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక వీర్రాజుకి ఓ బ్యాగ్ నిండా డబ్బు ఇస్తుంది. డబ్బు లేకుండా నువ్వేం చేయవు అని నాకు తెలుసు అన్నయ్య అని అంటుంది. డబ్బు చూసిన వీర్రాజు రైతుల్ని బెదిరించో బుజ్జగించో పొలాలు రాయించుకుంటా అని అంటాడు. రెండు వందల ఎకరాల కోసం అడిగితే అవి నేను చూసుకుంటా లక్ష్మీకి చూపు లేదు విహారి ఇప్పుడు ఏంటీ సరిగా పట్టించుకోవడం లేదు అని అంటుంది.

Continues below advertisement

అంబిక రుక్మిణి ఫొటో చూస్తుంది. బిత్తరపోతుంది. ఈ రుక్మిణి ఏంటి ఇక్కడ అని అడుగుతుంది. వీర్రాజు అంబికతో కాశీకి వెళ్లిన రుక్మిణి తప్పిపోయింది ఉందో లేదో తెలీదు తన కోసం వెతికిస్తున్నాం.. రుక్మిణి కూతురు కావేరి మాతోనే ఉంది అని కావేరిని పిలిచి చూపిస్తారు. అంబిక షాక్ అయిపోతుంది. కావేరితో మీ అమ్మ ఎక్కడ అంటే కావేరి కూడా తెలీదు అంటుంది. మా అమ్మ మీకు తెలుసా అని కావేరి అంటే తెలుసు అని అంబిక అంటుంది. వీర్రాజు కావేరిని పంపేస్తుంది. 

Continues below advertisement

అంబిక వీర్రాజుతో కావేరిని నువ్వు ఎందుకు  ఉంచావ్.. రుక్మిణిని ఎందుకు వెతికిస్తున్నావ్ అంటే వీర్రాజు కొంచెం బంధం ఉందని కావేరికి అమ్మిరాజుకి రెండు రోజుల్లో పెళ్లి అని అంటాడు. అంబిక ఫొటో తీసుకొని తన మనుషులకు పంపి ఎక్కడున్నా వెతికి పట్టుకోమని చెప్తుంది. 

విహారి హాల్‌లోని సోఫాలో పడుకుంటాడు. యమున చూసి లేపబోతే పండు వద్దు అంటాడు. రాత్రి విహారి బాబు లేటుగా పడుకున్నాడు అని అంటాడు. లక్ష్మీ, విహారి మధ్య జరిగిన గొడవ పండు యమునకు చెప్తుంది. యమున కన్నీరు పెట్టుకొని మనసులో వీడిది ఎవరికీ చెప్పుకోలేని బాధ.. ఎవరూ తీర్చలేని బాధ.. ప్రశాంతంగా నిద్రలో మాత్రమే ఉంటాడు అనుకుంటా అని అనుకుంటుంది. 

పద్మాక్షి వచ్చి చూసి ఏమైంది వీడు ఇక్కడ పడుకున్నాడు అని అంటే టెండర్ పనులకు వెళ్లి అలిసిపోయి ఇక్కడే పడుకున్నాడు అని అంటుంది. ఏంటో వీడి ప్రవర్తన ఈ మధ్య వింతగా ఉంటుంది అని అంటుంది. మనసులో వీడి భార్యగా నా కూతురు మాత్రమే ఉండాలి.. ఏదో ఒకటి చేసి ఇద్దరినీ ఒకటి చేస్తా అనుకుంటుంది. యమున మనసులో వీడు ఇలా సహస్రకు దూరంగా ఉంటే అందరికీ అనుమానం వస్తుంది. ఇక నుంచి ఇలా చేయొద్దుని వీడికి చెప్పాలి అని అనుకుంటుంది. 

సహస్ర గది క్లీన్ చేయడానికి పండు వస్తాడు. ఇంతలో పద్మాక్షి సహస్ర దగ్గరకు వచ్చి కడుపు నొప్పి అంటున్నావ్ కదా ఒకసారి చూపించుకుందాం పద అని తీసుకెళ్తుంది. ఇక పండుకి యుమన ఫోన్ కనిపిస్తుంది. పండు సహస్రకు చెప్పగానే అత్తయ్యది వెళ్లి ఇచ్చేయ్ అంటుంది. పండు యమునకు ఫోన్ ఇస్తాడు. అయితే ఫోన్ ఓపెన్ కాదు.. దాంతో యమున ఛార్జింగ్ పెట్టడానికి వెళ్తుంది. 

రుక్మిణి కావేరి ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అంబిక ఫోన్‌లో మాట్లాడుతూ నేను ఉండగా ఏ నిజం బయట పడటానికి వీల్లేదు అనుకున్నదిద అనుకున్నట్లు జరిగిపోవాలి అని అంటుంది. హరికృష్ణ ఫోటో చూస్తుంది. ఇక విహారి అక్కడే పడుకోవడం చూసి వెళ్లితూ ఉంటే ఇంతలో విహారికి ఫోన్ ఇస్తుంది. విహారికి కంటి వైద్యుడు కాల్ చేసి అమెరికా నుంచి ఐ స్పెషలిస్ట్ వస్తున్నారు లక్ష్మీని చూపిస్తే కచ్చితంగా చూపు వస్తుందని త్వరగా రమ్మని చెప్తారు. విహారి చాలా హ్యాపీగా ఫీలవుతాడు. అంబిక విషయం అడిగితే విహారి చెప్తాడు. లక్ష్మీ మీద ఎవరు పగ పట్టారో వాళ్ల పని చూడాలి అని విహారి అంటాడు. అంబిక మనసులో ఆ లక్ష్మీకి చూపురాకుండా నేను చూసుకుంటా.. నన్ను నువ్వు పట్టుకోలేవు అని అనుకుంటుంది. 

విహారి ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే లక్ష్మీ వచ్చి పడిపోతుంటే పట్టుకుంటాడు. లక్ష్మీ విహారి చేయి వదిలించుకుంటుంది. పండుని విహారిని పిలిచి లక్ష్మీని ఒంటరిగా వదిలేశావు ఏంట్రా.. తనకు డాక్టర్‌ని చూపించాలి.. అమెరికా నుంచి డాక్టర్ వచ్చారు. వెళ్లాలి అంటాడు. నాకు చెప్తారేంటి బాబు మీ పక్కనే లక్ష్మీమ్మ ఉంది కదా అంటే తనకి ఏం చెప్పినా నీకే చెప్తుంది కదరా అందుకే నీకు చెప్తే తనకు అర్ధమవుతుందని చెప్పా అంటాడు. నీకు భర్తలా చెప్పడం లేదు లక్ష్మీ శ్రేయాభిలాషిగా చెప్తున్నా.. నన్ను దూరం పెట్టినట్లు నా మాట కూడా పెడచెవిన పెట్టుకు.. చెప్పరా అని పండుని అంటాడు. పండు కూడా లక్ష్మీకి చెప్తాడు. లక్ష్మీ సరే అంటుంది.  

అంబిక సుభాష్‌కి కాల్ చేసి లక్ష్మీని పోయిన చూపు రావడానికి హాస్పిటల్‌కి తీసుకొస్తున్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు దానికి శాశ్వతంగా చూపు రాకూడదు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.