Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర వాళ్లని చెక్ చేసిన డాక్టర్ సహస్రకి సరోగసి ద్వారా పిల్లలు పుడతారు అని కాకపోతే అందుకు ఒక అద్దె గర్భం కావాలని ఒకమ్మాయిని వెతకాలి అని అంటారు. ఆ సంగతి నేను చూసుకుంటా అని పద్మాక్షి అంటుంది. ఇంతలో విహారి అత్తయ్యా అంటూ ఎంట్రీ ఇస్తాడు.
విహారికి విషయం తెలిసిపోయిందేమో అని సహస్ర, పద్మాక్షి చాలా కంగారు పడతాడు. విహారి వాళ్లతో మీరు నాకు ఎందుకు ఈ హాస్పిటల్‌కి తీసుకొచ్చారు.. ఏం టెస్ట్‌లు చేశారు.. మత్తు మందు ఎందుకు ఇచ్చారు.. అని సీరియస్ అవుతాడు. విహారి పద్మాక్షిని రెట్టించి ప్రశ్నిస్తాడు. దాంతో డాక్టర్ మీకు ఏమైందో తెలీదు బ్లడ్ తీయగానే మీరు కళ్లు తిరిగి పడిపోయారు.. అందుకే ఫ్లూయిడ్స్ కూడా ఎక్కించాం అని అంటుంది. పద్మాక్షి, సహస్ర కూడా మాకు ఏం ఉద్దేశం లేదురా అంటారు. విహారి అత్తకి సారీ చెప్తాడు. ఇక డాక్టర్ విహారితో మీకు సహస్రకు ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుందని చెప్తుంది. విహారి కొంచెం పని ఉందని చెప్పి సహస్ర వాళ్లని ఇంటికి వెళ్లిపోమని అంటాడు. పద్మాక్షి డాక్టర్‌కి థ్యాంక్స్ చెప్పి వెళ్తుంది.
అంబిక సుభాష్‌కి కాల్ చేసి హాస్పిటల్‌కి వచ్చానని చెప్తుంది. లక్ష్మీకి కట్లు విప్పుతారు అని చెప్తుంది. లక్ష్మీ కళ్లు తెరిచేస్తే మన పరిస్థితి ఏంటి అని అడిగితే లక్ష్మీకి చూపు రాదు.. రేపు దాన్ని రిజిస్టర్ ఆఫీస్‌కి తీసుకొస్త అక్కడే అన్ని చేస్తా అని అంబిక అంటుంది. లక్ష్మీని చూసిన డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ చూపు రాకపోవడానికి కారణం ఏంటో తెలీడం లేదు మళ్లీ టెస్ట్‌లు చేసి చెప్తా అని అంటారు.
యమున చాలా ఏడుస్తుంది. ఇలా అయింది ఏంటమ్మా అని లక్ష్మీని అంటుంది. వీర్రాజు అటుగా వస్తూ అక్కడ చాకు పడటంతో లక్ష్మీకి ఆ చాకు కనిపిస్తుంది. వీర్రాజు హాస్పిటల్‌కి కత్తి తీసుకొని రావడంఏంటి మళ్లీ ఏమైనా ప్లాన్ చేశాడా అనుకుంటుంది. యమున లక్ష్మీకి చూపు రాలేదు అని లక్ష్మీని జాగ్రత్తగా తీసుకెళ్తుంది. లక్ష్మీ తనకి దాహంగా ఉందని చెప్పి యమునని వాటర్‌కి పంపించి వీర్రాజు వాళ్లని ఫాలో అవుతుంది.
వీర్రాజు, పానకాలు విహారి కోసం వెతుకుతూ ఉంటారు. లక్ష్మీ పానకాలు పని పట్టాలి అని ఒ అమ్మాయి నడుం గిల్లి పానకాలుని చితక్కొట్టేలా చేస్తుంది. తర్వాత వీర్రాజుని ఫాలో అయి ముసుగు వేసి చేతులు కట్టేసి స్టోర్ రూంలో వేసి చితక్కొట్టి కొడుతుంది. యమున నీరు తీసుకొచ్చి లక్ష్మీ లేకపోవడంతో వెతుకుతూ ఉంటుంది. ఇక లక్ష్మీ దగ్గరకు విహారి వస్తాడు. లక్ష్మీకి చూపు రాలేదని విహారి అనుకుంటాడు. విహారి బాధ పడటంచూసి లక్ష్మీ చాలా బాధ పడుతుంది. ఇంతలో యమున వచ్చేస్తుంది. యమున లక్ష్మీని తీసుకొని ఇంటికి వెళ్దామని విహారితో చెప్తుంది.
యమున లక్ష్మీతో ఏం పాపం చేశామమ్మా నీకు చూపు రాలేదు అని అంటుంది. లక్ష్మీ మనసులో అంబికమ్మ కుట్ర బయట పెట్టాలని ఇలా చూపు లేనట్లు నటిస్తున్నా అనుకుంటుంది. కావేరి, పండు లక్ష్మీ దగ్గరకు వస్తారు. కావేరి లక్ష్మీతో మాఅమ్మ కళ్లు నీకు బాగున్నాయి అంటుంది. లక్ష్మీ నిజం చెప్పేస్తా అనుకొని తర్వాత విహారిని చూసి నాకు చూపు రాలేదు అని అంటుంది. కావేరి చాలా బాధ పడుతుంది. ఇక పండు, కావేరి వెళ్లిపోయిన తర్వాత విహారి లక్ష్మీకి కనిపించదు అనుకొని లక్ష్మీ కాలిదగ్గర కూర్చొని బాధ పడతాడు. అది చూసి లక్ష్మీ బాధ పడుతుంది. నన్ను ఎన్నో సార్లు కాపాడావ్.. నా పరువు నిలబెట్టావ్ కానీ నేను నీకోసం ఏం చేయలేకపోయా.. రుక్మిణి గారు నీకు కళ్లు ఇచ్చారు కానీ అది ఫలించలేదు.. అని ఏడుస్తాడు. విహారి ఏడుస్తూ లక్ష్మీ ఒడిలో పడుకుంటాడు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.