Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక వీర్రాజుకి కాల్ చేసి రుక్మిణి మా ఇంట్లో ఉంది అని అంటుంది. నా మనుషుల్ని పంపిస్తా దాన్ని ఏదో ఒకటి చేసి నాతో పంపేయ్ అని వీర్రాజు అంటాడు. అంబిక వీర్రాజుతో నీ గురించి ఇంట్లో అందరికీ చెప్పేసింది.. నీ కొడుకుతో బలవంతంగా పెళ్లి చేస్తున్నావు అని కూడా చెప్పేసింది అని అంటుంది. 

Continues below advertisement

వీర్రాజు కోపంగా అది చెప్తే మీ వాళ్లు నన్ను ఏం చేస్తారు అని అంటాడు. విహారి ఆల్‌ రెడీ బయల్దేరాడు అని అంబిక చెప్పగానే వీర్రాజు భయపడతాడు. నువ్వేం చెప్తావో నాకు తెలీదు జాగ్రత్త పడతావని చెప్పాను అని అంబిక అంటుంది. వీర్రాజు పరుగున ఇంట్లోకి వెళ్లి అంట్లు తోముతున్న కావేరి దగ్గరకు వెళ్లి నువ్వు పని చేయడం ఏంటమ్మా.. చూడు ఎలా చిక్కిపోయావు.. నాతో రామ్మా అని గదిలోకి తీసుకొచ్చి రేపు పెళ్లి అయ్యే వరకు ఎలాంటి పనులు చేయొద్దమ్మా.. లక్ష్మీ దేవిలా ఉండాలి అని గదిలో పెట్టి బంధిస్తాడు. 

కావేరి డోర్ కొట్టినా వీర్రాజు తీయడు. తన మనుషుల్ని రప్పించమని పానకాలుకి చెప్తాడు. విహారి వస్తూ ఉంటాడు. తండ్రీ కొడుకులు తాగుతూ విహారిని ఏం చేయాలా అనుకుంటారు. ఈ రోజు విహారి శవాన్ని పంపాలి అనుకుంటారు. విహారి ఎంట్రీ ఇచ్చేస్తాడు. రౌడీలు ఆపడానికి ప్రయత్నించడానికి చూస్తే రౌడీ చితక్కొడతాడు. 

Continues below advertisement

వీర్రాజు, అమ్మిరాజులు కావేరిని అక్కడి నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తారు. విహారి కావేరి కోసం మొత్తం వెతుకుతాడు. అంబిక సుభాష్‌కి కాల్ చేసి  రుక్మిణి గురించి చెప్తుంది. నన్ను గుర్తు పట్టలేదు అని అంబిక అంటే తను క్రైమ్ జరిగిన చోటే ఉంది.. తనని అంత తేలికగా తీసుకోవద్దు.. ఎప్పుడైనా గుర్తు పడితే ప్రమాదం.. తనని సైడ్ చేయ్ అని సుభాష్ చెప్తే అయితే రుక్మిణిని చంపేస్తా అని అంబిక అంటుంది. 

సహస్ర తనకు పిల్లలు పుట్టరు అని చాలా బాధ పడుతుంది. జీవితం మీద చాలా ఆశలు పెట్టుకున్నాను.. నా బావ నా పిల్లలతో సంతోషంగా ఉంటాను అని ఎన్నో కలలు కన్నాను,, కానీ ఒక ఆడపిల్లకి అమ్మతనం దేవుడు ఇచ్చిన వరం కానీ నేను ఎందుకు దేవుడు ఈ శాపం ఇచ్చాడు అని చాలా బాధ పడుతుంది. పద్మాక్షి కూతురి దగ్గరకు వచ్చి ఎప్పుడూ ఈ గదిలోనే ఉంటున్నావ్.. దిగులుగా ఉంటున్నావ్,, అందరితో కలువు హ్యాపీగా ఉండు అని అంటుంది. ఎలా ఉండగలను అమ్మ సంతోషంగా నాకు బావకి పిల్లలు పుడతారు అని ఎన్నో కలలు కన్నాను కానీ అవేమీ జరగవు అని తెలిసి ఎలా సంతోషంగా ఉండాలి అమ్మా అని ఏడుస్తుంది. నేను గర్భవతిని కాలేను.. నాకు గర్భ సంచి లేదు అని ఇంట్లో వాళ్లకి తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని భయంగా ఉందమ్మా అని సహస్ర అంటుంది. 

నువ్వు భయపడితే మనం ఏం చేయలేమే.. నవ్వు ధైర్యంగా ఉంటేనే మనం ఏదో ఒకటి చేయగలం.. కనీసం అందరితో నవ్వుతూ నటించవే అని అంటుంది. బావని త్వరగా హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి అమ్మా.. అని బావ కూడా నాకు చెప్పకుండా వెళ్లలేదు అని సహస్ర అంటే మొత్తం స్టోరీ పద్మాక్షి చెప్తుంది. ఇంట్లో ఉన్న పెళ్లాన్ని పట్టించుకోడు కానీ ఊరి వాళ్ల సమస్యలు చూస్తాడు.  బావ నాకు అర్థం కాడు అమ్మా అని సహస్ర అంటుంది. 

లక్ష్మీ పండు దగ్గరకు వెళ్లి విహారికి ఫోన్ చేయమని ఫోన్ ఇస్తుంది. పండు చేయి ఇవ్వగానే లక్ష్మీ విహారితో మాట్లాడుతుంది. రుక్మిణి కూడా దూరం నుంచి వింటుంది. కావేరిని ఇంకా కాపాడలేదని వాళ్లు కావేరిని తీసుకొని పారిపోయారని విహారి చెప్తాడు. రుక్మిణి గారికి ధైర్యం చెప్పండి నేను కావేరిని కాపాడుతా అని విహారి అనగానే రుక్మిణి నా కూతుర్ని ఎలా అయినా కాపాడుకుంటా అని అనుకుంటుంది. 

వీర్రాజు కావేరిని ఓ చోటుకి తీసుకొచ్చి కట్టి పడేస్తాడు. రుక్మిణి బయటకు వెళ్లడం అంబిక చూసి రౌడీలకు ఫోన్ చేసి రుక్మిణిని చంపేయమని అంటుంది. లక్ష్మీ కూడా రుక్మిణి కోసం వెళ్తే రుక్మిణి బయటకు వెళ్తుందని పండు చెప్పడంతో లక్ష్మీ, పండు పరుగులు తీస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.