Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode రుక్మిణి విహారి వాళ్లతో తన కూతుర్ని కాపాడమని చెప్తుంది. పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని పద్మాక్షి అంటే ఆ ఊరి వాళ్లని ఎవరూ ఏం చేయలేరు అని  రుక్మిణి అంటుంది. మీ అమ్మాయి పేరు ఏంటి అని లక్ష్మీ అడిగితే కావేరి అని రుక్మిణి చెప్తుంది.

Continues below advertisement

లక్ష్మీ వెంటనే కావేరిని గుర్తు చేసుకొని రామపురంలో చూశానని చెప్తుంది. రేపు అమ్మిరాజుకి కావేరికి పెళ్లి నువ్వే కా కూతుర్ని కాపాడు అని చెప్తుంది. పద్మాక్షి విహారితో వీటిన్నింటికి మీ అమ్మే కారణం విహారి.. ఇప్పుడు నాకు అర్థమైంది మీ అమ్మ నా జీవితంతోనే కాదు ఇంకా చాలా మంది జీవితాలతో ఆడుకుంది అని పద్మాక్షి అనడంతో విహారి ఆశ్చర్యపోతాడు. అయిపోయిన గతం ఇప్పుడు ఎందుకు పద్మాక్షి అని రుక్మిణి అంటే ఎందుకు చెప్పకూడదు దాని వల్లే కదా మన జీవితాలు ఈ జన్మలో తేరుకోలేని స్థితికి చేరుకున్నాయని అంటుంది. 

విహారిని యమున ఊరు వెళ్లమని అంటుంది. పద్మాక్షి అమ్మిరాజు, వీర్రాజులతో జాగ్రత్త అని చెప్పి రుక్మిణిని తనతో పాటు తీసుకెళ్తుంది. విహారితో యమున ఆ రుక్మిణిని పెళ్లి చేసుకోవాల్సింది.. ఈ అత్తని ఆ రుక్మిణిని వాళ్ల అన్నయ్య పెళ్లి చేసుకోవాల్సింది కానీ మా ప్రేమ వల్ల మీ అత్తయ్య పెళ్లి ఆగిపోయింది.. రుక్మిణి వేరే వాళ్లని పెళ్లి చేసుకుందని యమున అంటుంది. కచ్చితంగా కావేరిని నేను కాపాడతాను అని విహారి వెళ్తాడు.

Continues below advertisement

రుక్మిణి పద్మాక్షి మాట్లాడుకుంటారు. రుక్మిణి తన, తన అన్న ఫ్యామిలీ మొత్తం చనిపోయారని చెప్తుంది. విహారి దగ్గరకు లక్ష్మీ వెళ్లి జాగ్రత్త చెప్తుంది. విహారి చేతికి వీరాంజనేయుడి రక్ష తాడు కడుతుంది. పద్మాక్షి, యమున, రుక్మిణిని హాల్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరూ రుక్మిణికి ధైర్యం చెప్తుంటారు. అయితే అంబిక కిందకి వస్తూ రుక్మిణిని చూస్తుంది. అంబిక బిత్తర పోతుంది. రుక్మిణిని చూసి దాక్కోవడానికి గదికే వెళ్లిపోతూ ఇంకా నిజం చెప్పుండదులే అని అనుకుంటూ ఈ లోపే రుక్మిణిని చంపేయాలి అని అనుకుంటుంది. గదిలోకి వెళ్లి పాయిజిన్ ఇంజక్షన్ సిద్ధం చేసి ఎవరికీ అనుమానం రాకుండా గొంతు తడి ఆగిపోయి చనిపోతుందని అనుకుంటుంది. 

రుక్మిణి పక్కనే ఉన్న పద్మాక్షి యమునల్ని డైవర్ట్ చేయాలి అనుకొని పద్మాక్షికి వేరే నెంబరు  నుంచి కాల్ చేస్తుంది. రుక్మిణి సిగ్నల్ లేదు అనుకొని పక్కకి వెళ్తుంది. యమున కూడా ఫోన్ వచ్చిందని వెళ్తుంది. రుక్మిణి హరికృష్ణ ఫోటో దగ్గరకు వెళ్లి ఆరోజు నీతో నా పెళ్లి ఆగిపోవడంతో నిన్ను చాలా తిట్టుకున్నా చాలా శాపాలు పెట్టుకున్నా కానీ ఈ రోజు నా కూతుర్ని నీ కొడుకు కాపాడటానికి వెళ్లాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అంబిక వచ్చి రుక్మిణికి ఇంజెక్షన్ వేయాలని చూస్తే రుక్మిణికి అంబికను చూసేస్తుంది. రుక్మిణి అంబికను చూసి మాట్లాడుతుంది. అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉన్నావ్ అని అంటుంది. మీ అన్నయ్యని యాక్సిడెంట్‌లా చెప్పారు కానీ అది యాక్సిడెంట్ కాదు అని అంటుంది. రుక్మిణికి తన అన్నని చంపింది తానే అని తెలీదు అని అంబిక అనుకుంటుంది. రుక్మిణిని పట్టుకోలేదని వీర్రాజు రౌడీలను చితక్కొడతాడు. ఇంతలో అంబిక వీర్రాజుకి కాల్ చేసి రుక్మిణి మా ఇంట్లో ఉందని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.