Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి లక్ష్మీ ప్రశ్నలకు బాధ పడుతూ కారు దిగి బాధ పడతాడు. రుక్మిణి కూడా కరెక్ట్‌గా అక్కడికి వచ్చి విహారి కారు వెనక దాక్కుంటుంది. వీర్రాజు రౌడీలు, అంబిక రౌడీలు అక్కడే ఉండటంతో భయంతో విహారి కారు డిక్కీలోకి ఎక్కేస్తుంది. 

Continues below advertisement

విహారి లక్ష్మీని చూసి నా వల్లే లక్ష్మీకి ఈ పరిస్థితి తనకు చూపు శాశ్వతంగా రాదని ఎలా చెప్పాలి అని కన్నీరు పెట్టుకుంటాడు. లక్ష్మీ కూడా తన దగ్గర ఏదో దాస్తున్నాడని బాధ పడుతుంది. ఇక విహరి కారు స్టార్ట్ చేసి ఇంటికి బయల్దేరుతాడు. రౌడీలు విహారి దగ్గరకు వచ్చి రుక్మిణి ఫొటో చూపించి తెలుసా అని అడుగుతారు. విహారి తెలీదు అంటాడు. లక్ష్మీ, విహారి ఇంటికి వచ్చేస్తారు. లక్ష్మీని లోపలికి తీసుకెళ్లడానికి విహారి చేయి పట్టుకుంటే లక్ష్మీ వదిలేసి పండుని పిలిచి లోపలికి తీసుకెళ్లమని అంటుంది. 

రుక్మిణి కూడా విహారి ఇంటికే వస్తుంది. ఎవరూ చూడకుండా కారు దిగుతుంది. బయటకు వెళ్లబోతే రౌడీలు ఉంటారు. ఇక అంబిక కూడా మేడ మీదే ఉంటుంది. రౌడీలను చూసిన రుక్మిణి మళ్లీ ఇంట్లోకి దూరుతుంది. కిచెన్‌లో ఉన్న రుక్మిణి చాకు కింద పడేయడంతో లక్ష్మీ ఎవరూ అంటూ వస్తుంది. లక్ష్మీ వచ్చి చాకు తొక్కేయబోతే రుక్మిణి చెప్తుంది. దొంగ దొంగ అని లక్ష్మీ అంటే పండు వస్తాడు. ఇక తాను దొంగ కాదు అని రౌడీలు తరుముతున్నారని చెప్తుంది. ఇక రుక్మిణి చేతికి గాయం చూసిన పండు లక్ష్మీకి చెప్పడంతో లక్ష్మీ ఫస్ట్‌ ఎయిడ్ బాక్స్ తీసుకురమ్మని అంటుంది.

Continues below advertisement

రుక్మిణి వెళ్లిపోతా అంటే లక్ష్మీ తిని వెళ్లమని చెప్పి భోజనం వడ్డిస్తారు. రుక్మిణి కడుపు నిండా తింటుంది. లక్ష్మీకి చాలా కృతజ్ఞతలు చెప్తుంది. సిటీలో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి అని రుక్మిణి అంటే ఇక్కడే పడుకోండి అని లక్ష్మీ చెప్తుంది. ఇక లక్ష్మీ గదికివెళ్తూ వచ్చినామె పేరు కనుక్కోలేదని అనుకుంటుంది. 

యమున ఉదయం లక్ష్మీ కోసం పూజ చేస్తుంది. విహారి కూడా లక్ష్మీకి కంటి చూపు రావడానికి ఐ డోనర్ దొరికితే బాగున్ను అనుకుంటాడు. ఇక రుక్మిణి అమ్మిరాజు తన కూతురు కావేరి జీవితం నాశనం చేసినట్లు కల కని కంగారుగా లేస్తుంది. ఇక అంబిక ఉదయం తనకు పండు కాఫీ ఇవ్వలేదు అని కోపంగా కిచెన్ వైపు వెళ్తుంది. ఇక లక్ష్మీ రుక్మిణిని కలిసి మిమల్ని రౌడీలు ఎందుకు తరుముతున్నారు అని అడుగుతుంది. రుక్మిణి విహారి, వీర్రాజుల పేరు చెప్పకుండా విషయం లక్ష్మీకి చెప్తుంది. ఇక లక్ష్మీ తనని ఫ్రెష్ అవ్వమని టిఫెన్ తినేసి వెళ్లిమని చెప్పి చీర ఇస్తుంది. రుక్మిణి లక్ష్మీతో నీ సాయం ఎప్పటికీ మర్చిపోలేను కచ్చితంగా నీ రుణం తీర్చుకుంటా అని అంటుంది. ఇక రుక్మిణి వెళ్లగానే అంబిక అక్కడికి వస్తుంది. పండు ఎక్కడ అని అడుగుతుంది. బయట పని చేస్తున్నాడు అని అంటే పని వాళ్లకి బుద్ధి లేదు అని తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.