Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీని చంపడానికి అంబిక చెప్పిన పాముల వాడు పాముని తీసుకొచ్చి పాముని లక్ష్మీని కాటేయమని చెప్తాడు. పాము వెళ్లి పడుకొని ఉన్న లక్ష్మీని పాము కాటేస్తుంది. లక్ష్మీ అమ్మా అని మళ్లీ పడుకుండిపోతుంది. లక్ష్మీ కేక విన్న పండు పాము కాటేసి వెళ్లిపోవడం చూస్తాడు. పాము పాము అని లక్ష్మీని లేపుతాడు. 

విహారి దగ్గరకు పరుగులు తీసి లక్ష్మీకి పాము కాటేసిందని చెప్తాడు. అందరూ వచ్చి కంగారు పడతారు. యమున లక్ష్మీ లక్ష్మీ అని ఏడుస్తుంది. విషపూరితమైన పాము కాటేసిందని పండు అంటాడు. లక్ష్మీకి విహారి కట్టు కడతాడు. తన కాళ్లు పట్టుకొని ఏం చేస్తున్నావ్ అని పద్మాక్షి విహారిని అడిగితే కాసేపు ఏం మాట్లాడకండి అత్తయ్య అని విహారి తన నోటితో లక్ష్మీ కాళిలోని విషం తీస్తాడు. బావ అలా చేస్తే నీకు ప్రమాదం బావ అని సహస్ర అంటుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్దాం బావ అంటుంది. విషమైన పాము కాటేసింది సహస్ర అంత టైం లేదు అని అంటాడు. డాక్టర్‌ని తీసుకు రమ్మని విహారి పండుని కాలనీ చివరకు పంపుతాడు.  

డాక్టర్ వచ్చి చూస్తుంది. ఇంజక్షన్ వేస్తుంది. లక్ష్మీకి ఇక ఏ ప్రమాదం లేదని పది నిమిషాల తర్వాత లేస్తుందని డాక్టర్ చెప్తుంది. లక్ష్మీ లేస్తుంది. లక్ష్మీ విహారికి థ్యాంక్స్ చెప్తుంది. పండుతో చెప్పి లక్ష్మీని జాగ్రత్తగా చూసుకోమని అంటారు. పండు లక్ష్మీ దగ్గర కూర్చొని లక్ష్మీమ్మ పడుకో అని చెప్తాడు.  లక్ష్మీ పడుకున్న తర్వాత పండు అటూ ఇటూ కాసేపు తిరిగి తర్వాత పడుకుంటాడు. ఇక సహస్ర, విహారిల పెళ్లి ఉండటంతో లక్ష్మీ వేకువనే లేచేస్తుంది. పండు కూడా లేచి దీక్ష విరమించమ్మ అని అంటాడు. లక్ష్మీ అమ్మవారికి దండం పెట్టుకొని స్నానం చేసి వచ్చి పూజ  చేసి దీక్ష విరమిస్తుంది. పండుతో స్నానం చేసి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని వచ్చి అన్నీ సర్దేయ్ అంటుంది. 

వసుధ లక్ష్మీతో ఇంకొద్ది సేపట్లో నీ భర్తని పెళ్లి కొడుకుని చేస్తారు. నీ వ్రతాలు దీక్షలు ఇంకెందుకు అని అంటారు. లక్ష్మీ వాళ్లతో నేను దీక్ష చేసింది సహస్ర, విహారిల పెళ్లి ఆపడానికి కాదు. విహారి బాబు సంతోషంగా ఉండాలని చేశానని విహారి బాబు సహస్రని పెళ్లి చేసుకోవడమే న్యాయం అని చెప్పి లక్ష్మీ వెళ్లిపోతుంది. వసుధ పండుతో ఆ దేవుడు ఈ ముగ్గురికి ఏ రాత రాశాడో అని అంటుంది. ఈ చిక్కులో ఎవరు బయట పడతారో ఎవరు బాధ పడతారో అని పండు అంటాడు.

సహస్రని అందంగా పెళ్లి కూతురిలా ముస్తాబు చేస్తారు. పెళ్లి కూతురిలా సహస్రని చూసి పద్మాక్షి చాలా సంతోషపడుతుంది. యమున, కాదాంబరిలు ఏడు వారాల నగలు తీసుకొని వచ్చి సహస్రకు ఇస్తారు. సహస్ర సంతోషంగా తీసుకుంటుంది. వసుధ ఏడ్వడం చూసిన సహస్ర సంతోషంగా ఉండాల్సిన నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. అది ఏడుపు కాదు ఆనంద భాష్పాలు అని పద్మాక్షి అంటుంది. విహారి తన అత్తకు ఇచ్చిన మాట నెరవేర్చుకునే రోజు ఇది అని కాదాంబరి అంటుంది. విహారి సహస్ర  మెడలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తాళి కడతాడు నా మాట నమ్మండి అని  చెప్తుంది. ఇక అందరూ అక్కడి నుంచి వేరే పనులు చూసుకోవడానికి వెళ్తారు. సహస్ర ఎలా అయినా బావతో తాళి కట్టించుకుంటానని అందుకు చాలా ప్రిపేర్ అయ్యానని అనుకుంటుంది. పండు లక్ష్మీ దగ్గర ఏడుస్తాడు. లక్ష్మీ ఏం మాట్లాడొద్దని చెప్పినా పండు వినడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!