Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode తులసి కోట లక్ష్మీ దీపం పెట్టింది అని సహస్ర కోపంతో లక్ష్మీని నీటిలో ముంచేస్తుంది. నల్లపూసల విషయంలో లక్ష్మీ వల్ల ఆటకం కలిగిందని పద్మాక్షి కోపంగా ఉంటుంది. లక్ష్మీని గదిలోకి లాక్కెళ్లి బలవంతంగా బట్టలు సర్ది బయటకు లాక్కొస్తుంది. లక్ష్మీ ఏం తప్పు చేయలేదు కదమ్మా అని బతిమాలుతుంది.
యమున, విహారి వాళ్లు లక్ష్మీని పంపొద్దని అంటారు. పద్మాక్షి ఎవరినీ మాట్లాడొద్దు అని చెప్తుంది. కాదాంబరి కోపంతో నా కూతురికి దాని వల్ల సంతోషం లేదు అని చెప్తున్నా ఎవరూ వినడం లేదు ఎందుకు అని కాదాంబరి అంటుంది. తన ప్రమేయం లేని విషయంలో లక్ష్మీని ఎందుకు ఇబ్బంది పెడతారు అని విహారి అంటాడు. లక్ష్మీ మీద కావాలని నిందలు వేస్తారు ఎందుకు అని విహారి అంటాడు. పని మనిషికి నీ సపోర్ట్ ఏంటి అని అంబిక అడుగుతుంది. లక్ష్మీ వల్ల ఇంట్లో అందరికీ ప్రశాంతత లేదని దాన్ని తరిమేస్తే పీడ పోతుందని కాదాంబరి అంటుంది. సహస్ర నువ్వు ఎందుకు మాట్లాడవు అని అంబిక అడిగితే మా అమ్మ మాటే నా మాట అని సహస్ర అంటుంది. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు అది ఈ ఇంట్లో ఉండటానికి వీళ్లేదు అని పద్మాక్షి అంటుంది. లక్ష్మీని పంపమంటే ఇలా చేస్తారు ఏంటి అది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు వెళ్లిపోవాల్సిందే అని అంటుంది.
లక్ష్మీ మనసులో విహారి గారికి నేను బయటకు వెళ్లను అని మాట ఇచ్చాను.. ఆయనకు ఏ మాట చెప్పకుండా ఇక్కడ నుంచి వెళ్లలేను అని లక్ష్మీ మనసులో అనుకుంటుంది. విహారి మనసులో లక్ష్మీ ఇక్కడే ఉంటే తను ఎంత చేసినా విలువ ఉండదు అందుకే తనని బయటకు పంపి జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటాడు. పద్మాక్షి మాత్రం లక్ష్మీని పంపేయాలి అని పట్టు పడుతుంది. లక్ష్మీని బయటకు తోసేయండి అని కాదాంబరి అంటే విహారి అందర్ని ఆపి లక్ష్మీని ఇంటి నుంచి పంపేద్దామని అంటాడు. అందరూ షాక్ అవుతారు. యమున వద్దని విహారికి చెప్తే లక్ష్మీ తాను వెళ్లిపోతా అని దయచేసి ఆపొద్దు అని అంటుంది. విహారి కూడా లక్ష్మీని వెళ్లమనివ్వమని చెప్తాడు. లక్ష్మీ యమునకు వెళ్లిపోతా అని చెప్తే యమున ఏడుస్తూ మన బంధం ఇంతటితో తీరిపోతుందా అని లక్ష్మీని పట్టుకొని ఏడుస్తుంది. ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నా అని అంటుంది.
లక్ష్మీ అందరితో వెళ్తా అని చెప్తుంది. కాదాంబరి కాళ్లు మొక్కితే ఇంకెప్పుడూ గుమ్మం తొక్కొద్దు అని అంటుంది. సహస్ర దగ్గరకు వెళ్లి సహస్రమ్మ మీరు విహారి గారు సంతోషంగా ఉండాలి అని అంటుంది. వెళ్తాను విహారి గారు అని చెప్తుంది. లక్ష్మీ ఏడుస్తూ బయటకు వెళ్తుంది. పండు, యమున కన్నీరు పెట్టుకుంటారు. విహారి అలా చూస్తూ ఉండిపోతాడు. లక్ష్మీని విహారి వేరే ఇంటికి తీసుకొస్తాడు. ఇద్దరూ కలిసి కొత్త ఇంట్లోకి వెళ్తారు. ఇద్దరూ కలిసి ఇళ్లంతా క్లీన్ చేస్తారు. దేవుడికి దండం పెట్టుకొని పాలు పొంగిస్తారు. ఇద్దరి పెళ్లి ఫొటో లక్ష్మీ గోడకు పెట్టుకుంటుంది. లక్ష్మీ ఫొటో తుడుస్తూ కింద పడిపోతుంది. లక్ష్మీని తీసుకొని గదిలోకి వెళ్తాడు. డోర్ చేసుకొని ఇద్దరూ కాపురం చేసినట్లు సహస్ర కల కని కంగారు పడుతుంది. లక్ష్మీ వెళ్లిపోతుంటే విహారి దగ్గరకు వెళ్తాడు. మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అని లక్ష్మీ అంటుంది. పండు వచ్చి లక్ష్మీ అమ్మ వెళ్లిపోవడం బాధగా ఉందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: జల జల జలపాతం నువ్వు.. దేవా, మిథునలతో జలకాలాటాడించిన బామ్మ!