Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్రకు నల్లపూసలు వేసే కార్యక్రమం మొదలవుతుంది. సహస్ర, విహారి ఇద్దరూ పూజ చేస్తారు. పంతులు నల్లపూసలు తీసుకురమ్మని చెప్తారు. ఓ ముత్తయిదువు తీసుకొస్తుంటే అంబిక ఆవిడ కాళ్లలో కాలు పెడుతుంది. దాంతో పళ్లెం పడి నల్లపూసలు లక్ష్మీ తాళికి అతుక్కుంటాయి. అందరూ షాక్ అయిపోతారు.
పద్మాక్షి లక్ష్మీని లాగిపెట్టి కొట్టి ఈ ఇంటికి పట్టిన శనివే నువ్వు అంటుంది. విహారి లక్ష్మీని ఎందుకు కొడుతున్నారు తనేం తప్పు చేసింది అంటే తప్పు అది చేయలేదు మనం చేశాం తనని ఇంట్లో ఉంచుకొని తప్పు చేశాం అంటాడు. ఇంట్లో నా కూతురికి ఏం శుభకార్యం జరిగినా ఇదే కళ్లలో నిప్పులు పోసుకుంటుందని అంటుంది. దీని వల్లే నిన్న కార్యం చెడిపోయింది ఈరోజు ఇలా అని కాదాంబరి కోపంగా నల్లపూసలు తీసి పద్మాక్షికి ఇచ్చి లక్ష్మీ జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్లి బయట తోసేస్తుంది. నిన్ను ఇంట్లో ఉంచుకోవడం అంటే నల్ల పిల్లిని మాతో ఉంచుకోవడమే ఈ శుభకార్యం అయ్యే వరకు బయటే చావు అని కాదాంబరి అంటుంది.
విహారి, సహస్రల్ని కూర్చొమని చెప్తుంది. పంతులు పూజ మొదలు పెడతాడు. విహారి సహస్ర మెడలో నల్లపూసలు వేస్తాడు. బయట ఉన్న లక్ష్మీనే చూస్తూ సహస్ర మెడలో నల్లపూసలు వేస్తాడు. సహస్ర చాలా హ్యాపీగా ఫీలవుతుంది. నల్లపూసల్ని కళ్లకు అత్తుకొని దండం పెడుతుంది. రాత్రి సహస్ర నల్లపూసలు లక్ష్మీ తాళికి అతుక్కోవడం గుర్తు చేసుకొని బాధ పడుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది.. బావ నా వాడు కాదా.. నా బావ నాకు దూరం అయిపోతాడు అని ఆ దేవుడే ఇలా సింబాలిక్‌గా చెప్తున్నాడా అని తనని తాను గోడకు కొట్టుకుంటుంది. ఇంతలో లక్ష్మీ వెళ్లడం చూస్తుంది. రాత్రి ఎందుకు బయటకు వెళ్తుంది. బావ కూడా గదిలో లేడు ఇద్దరూ కలిసి ఏమైనా ప్లాన్ చేశారా అని బయటకు వెళ్తుంది.
లక్ష్మీ అందరూ అన్న మాటలు తలచుకొని తులసి కోట దగ్గర కూర్చొని బాధ పడుతుంది. విహారి అక్కడికి వస్తాడు. అందరి ముందు నిన్ను అత్తయ్య కొట్టినందుకు నేను సారీ చెప్తున్నా అంటాడు. ఏం పర్లేదు అని కనకం అంటుంది. మన పెళ్లి తర్వాత నీకు ఇలా నల్లపూసలు గుచ్చేలేదు కదా అంటే లేదు యమున అమ్మ గుచ్చారు అంటుంది. ఇక విహారి తులసి కోట దగ్గర లక్ష్మీ తాళికి కుంకుమ పెడతాడు. సహస్ర చూసి షాక్ అయిపోతుంది. ఇద్దరూ ఒకే ఆకులో ప్రసాదం తిందాం అంటాడు. లక్ష్మీ వద్దు అంటుంది కానీ విహారి తిందామని అంటాడు. లక్ష్మీ, విహారి ఇద్దరూ కలిసి ప్రసాదం తింటారు. సహస్ర షాక్ అయి చూస్తుంది.
యమున పద్మాక్షిని పిలుస్తుంది. మీకు ఆ లక్ష్మీ ఏం చేసినా తప్పు ఉండదు కదా దాన్ని సపోర్టు చేసి మీరు మాట్లాడితే మీ మర్యాద తగ్గిపోతుంది అని అంటుంది. లక్ష్మీ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటా అని అంటుంది. ఇక పంతులుకి కాల్ చేసి ఆగిపోయిన కార్యానికి ముహూర్తం పెట్టించమని అంటుంది. యమున సరే అంటుంది. ఇంట్లో శుభకార్యానికి లక్ష్మీని దూరంగా ఉంచమని అంటుంది. నీ అండ చూసుకొనే అది ఇష్టం వచ్చినట్లు చేస్తుంది. నీకు నీ కోడలు, కొడుకు సంతోషం ముఖ్యమా దాని సంతోషం ముఖ్యమా నువ్వు ఏమో కానీ నేను మాత్రం నా అల్లుడు, కూతురి సంతోషమే ముఖ్యం అనుకుంటుంది.
లక్ష్మీ తులసి కోట దగ్గర సౌభాగ్యం కోసం దీపం వెలిగిస్తుంది. అంబిక సహస్రని బయటకు తీసుకెళ్లి మంగళ సూత్రం గుచ్చిన తర్వాత దీపం వెలిగించమని చెప్తారు కదా పద అంటుంది. ఇద్దరూ వెళ్లేసరికి లక్ష్మీ దీపం పెట్టడం చూసి నల్లపూసల ఫంక్షన్ జరిగింది నీకు అది దీపం పెడుతుంది ఏంటి అని అంటుంది. దానికి ఎప్పుడో పెళ్లి అయితే ఇప్పుడు దీపం పెడుతుంది ఏంటి అని అంబిక అంటుంది. సహస్ర మనసులో బావ తాళి కట్టాడని ఇప్పుడు చేస్తుందని అనుకుంటుంది. సహస్ర వెళ్లి ఏం చేస్తున్నావే అని దీపం విసిరేస్తుంది. లక్ష్మీ కోపంగా సహస్రమ్మ ఏంటి ఇది అని అడుగుతుంది. ఈ రోజు ఇక్కడ ఎవరు దీపం పెట్టాలే నేను పెట్టాల్సింది నువ్వు పెడుతున్నావేంటే అని అడుగుతుంది. నీ పెళ్లి అయిపోయి చాలా రోజులు అయితే సహస్రకు పోటీగా ఇప్పుడు చేస్తున్నావేంటే.. పెళ్లికి ముందు సహస్రని ఏడిపిస్తున్నావ్.. ఇప్పుడు ఏడిపిస్తున్నావ్ అని అంబిక అంటుంది. సహస్ర కోపంగా లక్ష్మీని తీసుకెళ్లి నీటి బకెట్‌లో ముఖం ముంచేస్తుంది. ఇంకోసారి ఇలా చేస్తే చంపేస్తా అని చెప్పి వెళ్లి సహస్ర దీపం వెలిగిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: జల జల జలపాతం నువ్వు.. దేవా, మిథునలతో జలకాలాటాడించిన బామ్మ!