Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ సహస్ర దగ్గరకు వెళ్తుంది. సహస్ర డోర్ వేసి గ్లాస్‌తో నీరు తీసుకొచ్చి లక్ష్మీ ముఖం మీద విసిరేస్తుంది. లక్ష్మీ గొంతు పట్టుకొని బయట ఏం వెలగబెడుతున్నావే అని అడుగుతుంది. ఏమైందని లక్ష్మీ అడిగితే ఏం తెలీనట్లు ఎలా నటిస్తున్నావే అని అడుగుతుంది. నేను అంత పెద్ద తప్పు చేశాను అంటే చూపిస్తాను ఆగు అని ఇద్దరూ చేతులు పట్టుకొని ఉండటం చూపిస్తుంది.
నా మొగుడితో నీకు అంత చనువు ఏంటే.. నీకు చెప్పా కదా నా బావకి దూరంగా ఉండమని మరి ఇలా ఇదంతా ఏంటే అని అడుగుతుంది. నీకు ఇలా చెప్తే కాదు అని గన్ తీసి చంపేస్తా అని చెప్తుంది. దాంతో తన చేతిలో ఉన్న ఫైల్ తీసి చూపించి హెల్త్ కార్డ్‌లు గురించి వెళ్లామని విషయం చెప్తుంది. ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పి వెళ్తుంది. విహారి దగ్గరకు యమున ఇస్తుంది. నాన్న కార్యానికి ముహూర్తం పెట్టారు కాబట్టి బయటకు వెళ్లకూడదు అని చెప్తుంది. విహారి తల్లితో ఈ కార్యం అప్పుడే ఎందుకు అమ్మ కొంచెం టైం తీసుకుందాం అంటాడు. ఇంతలో పద్మాక్షి వస్తుంది.
విహారి పెళ్లికి కూడా ఇలాగే టైం కావాలి అన్నావ్ ఇప్పుడు కార్యానికి కూడా ఇలాగే చేస్తున్నావ్.. ఎందుకు విహారి ఇలా అక్కడ సహస్ర సంవత్సరంలో మీ నాన్నని మీకు ఇస్తా అని అంత గొప్పగా ఆలోచిస్తుంది అని అంటుంది. యమున కూడా సహస్రలా ఆలోచిస్తుంది నువ్వు కూడా అలాగే ఉండు అని చెప్తుంది. కార్యం త్వరగా జరిగితే మీ నాన్న మీకు పుడితే మీరు మీ నాన్నని పెంచే గొప్ప అదృష్టం మీకు దక్కుతుందని చెప్తుంది. మీ నాన్న మీ కొడుకు రూపంలో వచ్చి మనకు లోటు తీర్చుతారని యమున చెప్తుంది. పద్మాక్షి విహారితో నువ్వు పిలవగానే వచ్చేశా.. నేను వచ్చి 7 నెలలు అవుతుంది. నా ఇళ్లు బిజినెస్ అన్నీ వదిలేశా కేవలం మీ సంతోషం కోసమే నువ్వు కూడా ఆలోచించు అని చెప్తుంది.
యమున విహారితో చూడు విహారి మీ మేనత్త ఎంతలా మారిపోయిందో.. నాతో కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అన్నీ నాకు చెప్తుంది. నువ్వు సహస్రని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అందరూ నాతో చాలా సంతోషంగా ఉన్నారని యమున హ్యాపీగా ఫీలవుతుంది. ఎక్కువ ఆలోచించకుండా ఈ రోజు కార్యానికి సిద్ధం అవ్వు అని చెప్తుంది. మరోవైపు అంబిక సుభాష్‌తో మాట్లాడుతుంది. కేసు విషయంలో మరి వాళ్లు ఏం చేయలేరు అని మాట్లాడుకుంటారు. అంబిక దగ్గరకు లక్ష్మీ వస్తుంది.
లక్ష్మీ అంబికను కోపంగా చూస్తుంది. హాస్పిటల్ దగ్గరకు ఎందుకు వచ్చారని అడుగుతుంది. నేను విహారి గారు మీ అన్నయ్య గారి కేసు విషయంలో అక్కడికి వచ్చాం.. నేను మిమల్ని చూశాను అంటుంది. నేను రాలేదు నాకు తెలీదు అని అంటుంది. మా అన్నయ్య చావు గురించా అని అంబిక నోరెళ్ల బెడుతుంది. మీకు నిజంగా ఏం తెలీదు అంటే ఓకే కానీ మీకు ఆ విషయంలో తెలుసు అని నాకు తెలిస్తే ఇప్పటి వరకు మీ విషయంలో సైలెంట్‌గా ఉన్న నేను విహారి గారికి విషయం చెప్పేస్తా.. విహారి గారికి ఆయన కుటుంబానికి ఎవరైనా హాని చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్తుంది. నా సొంత అన్నయ్యని ఏమైనా చేశాను అని అనుకుంటున్నావా అంటుంది. మీరు ఏమైనా చేసుకుంటే మీకు ఆ దేవుడు కూడా కాపాడలేడు అని గుర్తించుకోండి అని చేయి చూపించి వార్నింగ్ ఇస్తుంది.
లక్ష్మీకి తన మీద అనుమానం వచ్చింది ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అంబిక అనుకుంటుంది. సహస్రని యమున, పద్మాక్షి రెడీ చేస్తారు. ఈ క్షణం నుంచి నీకు విహారి మా అందరి కంటే ఎక్కువ విహారి సంతోషం కోసమే నువ్వు ఆలోచించాలి అని భర్త కోసం జాగ్రత్తలు చెప్తుంది. నీ భర్త నమ్మకానికి విలువ ఇవ్వాలి అని చెప్తుంది. దానికి సహస్ర బావకి నచ్చినట్లు నేను ఉంటాను.. అని అంటుంది. యమున కూడా సహస్రకు మీ ఇద్దరూ అన్యోన్యంగా ఉండాలి.. నీకు తగ్గట్టుగా మీ బావ ఉండేలా నువ్వే మనలచుకోవాలని ఇవన్నీ నేను నీకు అత్తలా చెప్పడం లేదు అమ్మలా చెప్తున్నా అంటుంది. పద్మాక్షి చాలా సంతోషంగా ఉంటుంది. సహస్ర యమునకు హగ్ చేసుకుంటుంది. ఇంతలో అంబిక వచ్చి సహస్ర కుందనపు బొమ్మలా ఉన్నావ్ విహారి అదృష్టవంతుడు అని చెప్తుంది. సహస్రని ఆట పట్టిస్తుంది.
లక్ష్మీ విహారి, సహస్రల తొలిరేయి గది అలంకరిస్తుంది. లక్ష్మీ డల్‌గా ఉండటం వసుధ చూస్తుంది. లక్ష్మీ దగ్గరకు వెళ్తుంది. ఇలా ఎలా ఉండగలుగుతున్నావ్ ఎలా తట్టుకోగలగుతున్నావ్ నీ స్థానంలో ఏ అమ్మాయి ఉన్న ఇలా చేయదు భర్తకి మరో అమ్మాయితో శోభనం జరిగితే దగ్గరుండి ఏర్పాట్లు చేయదు అని అంటుంది. వసుధ ఏడుస్తూ లక్ష్మీని హగ్ చేసుకుంటుంది. పండు విహారి దగ్గరకు వెళ్లి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. నేనేం చేయాలిరా పరిస్థితులు నా నోరు తొక్కేశాయి అని అంటాడు. లక్ష్మీ వసుధతో నిజం సమాధి చేస్తేనే మీరంతా సంతోషంగా ఉంటారు అని అంటుంది. నన్ను మర్చిపోయి సహస్రమ్మ విహారి బాబు సంతోషంగా ఉండాలి అని చెప్తుంది. వసుధ లక్ష్మీతో నిజం తెలిస్తే మీ ముగ్గురి జీవితాలు ఏమైపోతాయో అంటుంది. విహారి పండుతో ఈ రోజు సహస్రకి నిజం చెప్తా నా జీవితంలో లక్ష్మీనే భార్యగా ఉండాలి అంటాడు. విహారి, సహస్రల్ని తీసుకొని తొలిరేయి ఆటలు ఆడించడానికి సిద్ధ పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: బంటీని అడ్డు పెట్టుకొని రుక్మిణి తల్లిదండ్రుల పెళ్లిరోజు జరిపిస్తుందా!