Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి లక్ష్మీతో నీ తాళికి నేను అండగా ఉంటాను గౌరవిస్తాను.. నీ ఇష్టానికి విలువ ఇస్తాను.. ఈ క్షణం నుంచి నిన్ను నా భార్యగా అంగీకరిస్తున్నానని చెప్తాడు. అందుకు సాక్షిగా లక్ష్మీ నుదిట కుంకుమ పెట్టడానికి సిద్ధపడతాడు. లక్ష్మీ చాలా సంతోషిస్తుంది. ఇంతలో సడెన్‌గా ఆగి విహారి గారు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్తుంది.
విహారి: నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేను.లక్ష్మీ: లేదు విహారి గారు మీరు నా వైపు నిల్చొవాలి అనుకుంటున్నారు. అలా జరిగితే మీ కుటుంబ పరిస్థితి ఏంటి? మీ రెండు కుటుంబాలు ఎలా కలుస్తాయి. మీ అమ్మగారి పరువు ఏం కావాలి. సహస్రమ్మ కూడా బతకడు. మీరే అన్నారు కదా స్వార్థంగా ఆలోచించు అని మీరు చెప్పినట్లు ఆలోచిస్తే నేను స్వార్థంగా ఆలోచించినట్లే కదా.విహారి: నీ స్వార్థం వెనక అర్థం ఉంది. అదే దేవుడు వేసిన బంధం. ఇన నా కుటుంబం గురించి ఆలోచించకు ఎలా జరగాలి అంటే అదే జరుగుతుంది. నిజంగా సహస్రతో నాకు పెళ్లి జరగాలి అని ఉంటే రెండు సార్లు ఆ దేవుడు ఆపే వాడు కాదు. దైవ నిర్ణయాన్ని మనం మార్చేలం. అని లక్ష్మీని భార్యగా అంగీకరించి కుంకుమ పెడతాడు.
లక్ష్మీ తన తాళి పట్టుకొని కళ్లకు అద్దుకుంటుంది. ఇక అప్పుడే ఆదికేశవ్ కాల్ చేసి సంతాన సాఫల్య వ్రతం గురించి ఏర్పాటు చేశాం త్వరగా రమ్మని చెప్తారు. కనకాన్ని తీసుకొని విహారి వెళ్తాడు. మరోవైపు అంబిక, సహస్రలు విహారి, లక్ష్మీ కోసం వెతుకుతూ ఉంటారు. అంబిక మనసులో లక్ష్మీ, విహారిల మధ్య ఏదో జరుగుతుందని ఇద్దరూ దొరికితే అప్పుడు చెప్తానని అనుకుంటుంది. సహస్ర విహారికి కాల్ చేస్తుంది. లక్ష్మీని వెతకడానికి వెళ్లావు కదా దొరికిందా అంటే ఇంకా కనిపించలేదు అంటాడు. దాంతో సహస్ర నేను పిన్ని వెతుకుతున్నామని చెప్తుంది. లక్ష్మీ నా గురించి మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారని అడుగుతుంది. నా వల్ల నీ జీవితం మీద మచ్చ పడకూడదు అని ఇలా చెప్పాను అంటాడు.
పద్మాక్షి వాళ్ల కోపంగా ఉంటే మదన్ వచ్చి లక్ష్మీ దొరికిందా అంటాడు. అది ఎక్కడికీ వెళ్లదు కంగారు పడకు అని పద్మాక్షి అంటే మదన్ కోపంతో ఫ్లవర్ వాష్ విసిరి కొడతాడు. ఏంట్రా నువ్వు చేస్తున్న పని అని యమున అంటే మరేం చేయాలి పెద్దమ్మ చిన్నప్పుడు నుంచి దేవుడు నేను ఏం కోరుకుంటే అది దూరం చేస్తున్నాడు. లక్ష్మీని నేనే వెతుక్కొని తీసుకొస్తా అని వెళ్లిపోతాడు. లక్ష్మీ, విహారిలు గుడికి వస్తారు. లక్ష్మీ పడిపోబోతే విహారి పట్టుకొని ఒకర్ని ఒకరు చూసుకుంటారు. కనకం తల్లిదండ్రుల్ని చూసి చాలా సంతోషపడుతుంది.
గౌరీ, ఆదికేశవ్ ఆనందానికి అయితే అవధులే ఉండవు. హోటల్లో ఉంచాను అని తప్పుగా అనుకోవద్దని విహారి చెప్తాడు. ఏదో కారణం వల్లే మమల్ని హెటల్‌లో ఉంచారని అర్థం చేసుకోగలమని అంటాడు. మీ ఇద్దరికీ ఒక పాపో బాబో పుడితే చూసి సంతోషపడాలని ఈ వ్రతం ఏర్పాటు చేశామని అందుకు మీరు ఒప్పుకున్నారని అది చాలని అంటారు. ఇక వ్రతానికి టైం అవడంతో లక్ష్మీ వాళ్లని రమ్మని చెప్తారు. సహస్ర మళ్లీ అడగటంతో విహారి తను దొరకలేదని అర్జెంట్ పని మీద ఆఫీస్‌కి వెళ్తున్నా అని చెప్పేస్తాడు. సహస్ర అంబికకు విషయం చెప్పడంతో మీటింగ్స్ ఏం లేదని నాకు ఏదో అనుమానంగా ఉందని అంటుంది. ఇక అంబిక ఓ వ్యక్తికి కాల్ చేసి విహారి కారు నెంబరు చెప్పి ఈ ఏరియాలో ఉందో చెప్పమని చెప్తుంది. అతను చూసి గుడి వైపు వెళ్లిందని చెప్తారు. నార్శింగి నుంచి శంకరపల్లి వైపు వెళ్లిందని చెప్తుంది. సహస్ర వాళ్లు అటుగా వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?