Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకం తండ్రితో మాట్లాడుతుంది. సిటీలోని హాస్పిటల్‌కి  చెకింగ్‌కి వెళ్తున్నామని ఆదికేశవ్ చెప్తాడు. కనకం తండ్రికి జాగ్రత్తలు చెప్పి త్వరలోనే కలుస్తాం అని అంటుంది. అన్నీ కనకానికి చెప్పి ఎందుకు టెన్షన్ పెట్టావ్ అని ఆదికేశవ్ గౌరీని అంటారు. ఇక ఇద్దరూ సిటీకి బయల్దేరుతారు.

పద్మాక్షి లక్ష్మీకి అందరూ ఇచ్చిన ప్రాధాన్యత గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంబిక వచ్చి ఏమైందని అడుగుతుంది. లక్ష్మీ విషయంలో సహస్ర చాలా ఆందోళన పడుతుందే.. ఆ లక్ష్మీని గెంటేయాలి అని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒకలా మళ్లీ అది వచ్చేస్తుంది. దాని విషయంలో పర్మినెంట్ సొల్యూషన్ రావాలి అంటుంది. అంబిక మనసులో లక్ష్మీ కంటే నాకు విహారి పెద్ద సమస్య విహారి వెళ్లిపోతే నేనే ఇక్కడ బిజినెస్‌లు ఏలొచ్చని అనుకుంటుంది. అందుకు పద్మాక్షితో విహారి, సహస్రలను యూఎస్ పంపేద్దామని అంటుంది. పద్మాక్షి నిజమే అనుకుంటుంది. పద్మాక్షి సహస్రని పిలిచి విషయం చెప్తుంది. 

లక్ష్మీని దూరం చేయడానికి ఇదే సమయం అనుకొని సహస్ర ఒకే చెప్తుంది. పద్మాక్షి యమునని పిలిచి విహారి, సహస్ర సంతోషంగా ఉండాలని నీకు ఉందా లేదా అని అంటుంది. కన్నకొడుకు కోడలు సంతోషంగా ఉండాలి అని నాకు ఎందుకు ఉండదు అని అంటుంది. పద్మాక్షి యమునతో ఇద్దరినీ అమెరికా పంపేద్దామని అంటుంది. ఒక్కగానొక్క కొడుకు వాడిని దూరంగా పంపాలి అంటే మనసు ఒప్పుకోవడం లేదు అంటుంది. నాకు ఒక్క కూతురే అని పద్మాక్షి అంటుంది. వదిన వాళ్ల సంతోషమే మనకు ముఖ్యం అని అంబిక యమునని ఒప్పిస్తుంది. యమున ఒప్పుకుంటుంది. 

పద్మాక్షి యమునతో నువ్వే విహారికి చెప్పి ఒప్పించి వారంలో వాళ్లు ప్రయాణానికి ఏర్పాట్లు చేయమని అంటుంది. మరోవైపు ఆదికేశవ్‌ని హాస్పిటల్‌లో చూపించి తిరుగు పయణమవుతారు. హాస్పిటల్‌ దగ్గర్లో ఓ బస్ స్టాండ్‌ దగ్గర వెయిట్ చేస్తారు. సహస్రకు అక్కడికి రమ్మని చెప్తారు. ఇద్దరూ వెయిట్ చేస్తుండగా ఆదికేశవ్‌కి ఆయాసం వస్తుంది. మంచి నీరు అయిపోవడంతో గౌరీ నీరు తీసుకురావడానికి వెళ్తుంది. పోడిపోయిన తండ్రిని కనకం బుర్కాలో వచ్చి పట్టుకొని నీరు తాగిస్తుంది. విహారి దూరం నుంచి చూస్తాడు. గౌరీ రావడంతో ఆదికేశవ్ విషయం చెప్తే గౌరీ రుణపడిపోతాను అమ్మా నీకు అంటుంది. హాస్పిటల్‌కి వెళ్లి వచ్చామని రేపు రిపోర్ట్స్ వస్తాయని డాక్టర్‌ని కలుస్తామని చెప్తారు. 

ఆదికేశవ్ కనకంతో నీ పేరు ఏంటమ్మా గతంలో కూడా మేం సిటీకి వస్తే నీలా ఓ అమ్మాయి వచ్చి మాకు కడుపు నిండా అన్నం పెట్టింది అని చెప్తారు. కనకం గురించి గొప్పలు చెప్తారు. మా కూతురు పెద్ద పెద్ద చదువులు చదువుకుంది. ఉద్యోగం చేయాలి అనుకుంది అని చెప్తారు. విహారి దూరం నుంచి చూస్తూ నా వల్లే కనకానికి ఈ పరిస్థితి వచ్చింది కనీసం తల్లిదండ్రులకు తన ముఖం కూడా చూపించలేకపోతుంది. కొడుకులా చూసుకోవాల్సిన నేను ఇలా ముఖం చాటేస్తున్నా సారీ మామయ్య అని విహారి అనుకుంటాడు.  పిల్లల్ని ప్లాన్ చేసుకోండి అమ్మా మీకు పిల్లలు పుట్టాలి అని మీ వాళ్లు చాలా ఆశ పడుతుంటారు అని చెప్తారు. లక్ష్మీ వాళ్లకి చెప్పి విహారి దగ్గరకు వస్తుంది. 

సహస్ర ఆదికేశవ్‌ని కలవడానికి అక్కడికి వస్తుంది. విహారి కారు చూసి ఆగుతుంది. లక్ష్మీ బుర్గా తీసి విహారి దగ్గర ఏడ్వడం చూసి షాక్ అయిపోతుంది. లక్ష్మీ ఏంటి ఈ గెటప్‌లో ఉంది అని అనుకుంటుంది. కన్నవాళ్లు కళ్ల ముందే ఉంటే ఇంటికీ కూడా తీసుకెళ్లలేను అని అంటుది. సహస్ర ఆ మాటలు విని ఆదికేశవ్ వాళ్లే లక్ష్మీ తల్లిదండ్రులు అని సహస్రకు అనుమానం వస్తుంది. కన్ఫ్మమ్ చేసుకోవడానికి డిటెక్టివ్‌కి కాల్ చేసి అడుగుతుంది. డిటెక్టివ్ చెప్పడంతో సహస్రకు వాళ్లే తల్లిదండ్రులు అని తెలిసిపోతుంది. ఇంత వరకు బాగానే దాగుడు మూతలు ఆడారు. నేను బావ అమెరికా వెళ్లే వరకు వీళ్లని మా ఇంట్లోనే ఉంచుతా అప్పుడు బావ, లక్ష్మీ అస్సలు కలవరు అనుకుంటుంది. 

సహస్ర వెంటనే ఆదికేశవ్ వాళ్ల దగ్గరకు వెళ్తుంది. ఆదికేశవ్ హాస్పిటల్‌కి వచ్చారు అని తెలుసుకున్న సహస్ర వాళ్లని తన ఇంటికి రమ్మని చెప్తుంది. సహస్ర మారాం చేయడంతో ఆదికేశవ్ వాళ్లు సహస్రతో బయల్దేరుతారు. లక్ష్మీ, విహారి ఇంటికి వస్తారు. యమున విహారి గురించి దండం పెట్టుకుంటే దీపాలు ఆరిపోతాయి. అంబిక మేడ మీద నుంచి విహారి మీద పూల కుండీ వేయాలని ప్రయత్నిస్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: రాఘవ కొడుకే ఆనంద్.. రుక్మిణి, ఆనంద్‌ల ప్రేమ కథ వెనక పెద్ద కథే ఉందిగా!