Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి లాయర్‌తో మాట్లాడుతాడు. లక్ష్మీని ఎలా అయినా బయటకు తీసుకురావాలని అంటాడు. అంబిక చూసి విహారి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. లక్ష్మీకి బెయిల్ ఇప్పించేలా ఉన్నాడని కోర్టు ఆవరణలో లక్ష్మీని చంపేస్తే అది చంపినవాళ్లు చంపేశారని అనుకుంటారని భావించి రౌడీకి కాల్ చేసి లక్ష్మీని చంపేసి పారిపోమని చెప్తుంది. 

కోర్టు బయట అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంబిక చెప్పిన రౌడీ వచ్చి యమునతో మాట్లాడుతున్న లక్ష్మీని చూసి అందరూ బిజీగా ఉన్న టైంలో లక్ష్మీని పొడవటానికి వెళ్తాడు. సరిగ్గా పొడిచే టైంకి విహారి వచ్చి అడ్డుకుంటాడు. ఆ రౌడీని చితక్కొడతాడు. అక్కడే ఉన్న పోలీసులు కూడా అలర్ట్ అయి రౌడీని చితక్కొడతారు. వాడు దొరికిపోతే నేను దొరికిపోతా అని అంబిక కంగారు పడుతుంది. రౌడీ తన వెంట తెచ్చుకున్న స్ఫ్రే అందరి కళ్లల్లో కొట్టి పారిపోతాడు. ఎస్‌ఐ మనసులో ఛా మంచి అవకాశం మిస్ చేశాడు. వీడు ఎవడో చంపేసుంటే డబ్బులు వసూలు చేసుకునే దాన్ని అనుకుంటుంది. 

కోర్టు టైం మొదలవుతుంది. జడ్జి సాక్ష్యాలు అడుగుతారు. ఇంకా రాలేదు అని లక్ష్మీ తరఫు లాయర్ చెప్తే అంబిక పెట్టిన లాయర్ లక్ష్మీకి శిక్షించమని అంటుంది. లక్ష్మీ తరఫు లాయర్ ఇంకా టైం అడుగుతారు. జడ్జి టైం ఇవ్వడం కుదరదు అని అంటుంది. బయట ఉన్న ఆదికేశవ్ చాలా టెన్షన్ పడతారు. లోపలికి వెళ్తాను అంటే గౌరీ వద్దని అంటుంది. యమున మనసులో పాపం లక్ష్మీ ఏం తప్పు చేయకపోయినా నింద మోయాల్సి వస్తుంది అనుకుంటుంది. లక్ష్మీ పీడ వదలిపోతుందని పద్మాక్షి, అంబిక, సహస్ర అనుకుంటారు. ఇక కోర్టు లక్ష్మీ హత్య చేసింది అని లక్ష్మీని దోషిగా నమ్ముతున్నా అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. 14 ఏళ్ల శిక్ష వేసే టైంకి డిఫెన్స్ లాయర్ జూనియర్ వచ్చి ఆపుతారు. సాక్ష్యాలు వచ్చాయని చెప్తారు. 

విహారి, యమున అందరూ సంతోషపడతారు. హత్య చేయడానికి వచ్చిన బ్రాస్లెట్ చూపిస్తారు. ఇక చనిపోయిన వాడి క్రిమినల్ హిస్టరీ చూపిస్తారు. లక్ష్మీని కావాలనే అలా నింద వేశారని.. మృతుడి మీద ఇద్దరి వేలిముద్రలు ఉన్నాయని అన్ని పోరెన్సిక్ రిపోర్ట్స్ చూపిస్తారు. లక్ష్మీ స్ఫ్రుహాలో లేని టైంలో మరొకరు హత్య చేశారని నిరూపిస్తారు. దాంతో కోర్టు లక్ష్మీ నిర్దోషి అని తేల్చుతుంది. అందరూ సంతోషంగా ఫీలవుతారు. లక్ష్మీని పోలీస్ కస్టడీ నుంచి విడుదల చేయమని చెప్తారు. అందరూ సంతోషంగా చప్పట్లు కొడతారు. సహస్ర, పద్మాక్షి, అంబికల ముఖం మాడిపోతుంది.

లక్ష్మీ పరుగున వచ్చి అందరి యమున వాళ్లతో సంతోషం పంచుకుంటుంది. అందరూ లాయర్‌కి కృతజ్ఞతలు చెప్తారు. విహారి అందర్ని ఇంటికి వెళ్లిపోండి అని చెప్పి లక్ష్మీకి చిన్ని ఫార్మాలిటీ ఉందని చెప్పి పంపేస్తాడు. తర్వాత లక్ష్మీని ఆదికేశవ్, గౌరీల దగ్గరకు తీసుకెళ్తాడు. లక్ష్మీ వాళ్లని హగ్ చేసుకుంటుంది. ముగ్గురూ ఎమోషనల్ అయిపోతారు. మీ అల్లుడు గారు నన్ను కాపాడారమ్మా అని లక్ష్మీ చెప్తుంది. ఆదికేశవ్ అల్లుడికి చాలా థ్యాంక్స్ చెప్తాడు. తన బాధ్యత నాది అని చెప్తాడు. లక్ష్మీ, విహారి వాళ్లని తీసుకొని కారు ఎక్కించి పంపిస్తారు. లక్ష్మీ విహారికి థ్యాంక్స్ చెప్తుంది. లక్ష్మీ ఇంటికి రాగానే వసుధ, యమున వాళ్లు దిష్టి తీస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: కోర్టులో ఉత్కంఠ.. లక్ష్మీకి శిక్ష గ్యారెంటీ.. విహారి ఏం చేయనున్నాడు!