Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీని కోర్టుకి తీసుకెళ్లడానికి పోలీసులు రెడీ అవుతారు. విహారి, ఆదికేశవ్, గౌరీలు పోలీస్ స్టేషన్‌కి వస్తారు. కనకం తల్లిదండ్రులు కనకాన్ని పట్టుకొని ఏడుస్తారు. సహస్ర చాటుగా చూస్తుంది. లక్ష్మీకి బేడీలు వేసి తీసుకెళ్తారు. సహస్ర ఆదికేశవ్ వాళ్లని చూసి అమ్మా అత్తయ్య వాళ్లు కోర్టుకి బయల్దేరారు కదా వాళ్లు ఆదికేశవ్ వాళ్లని చూస్తే ఇక అంతే ఎలా అయినా అపాలి అనుకుంటారు.

లక్ష్మీని పోలీసులు తీసుకెళ్లగానే విహారి అత్తామామల్ని తీసుకొని వెళ్తాడు. సహస్ర అంబికకు కాల్ చేస్తుంది. ఎక్కడున్నారు అంటే కోర్టుకి బయల్దేరామని చెప్తారు. మీరు ఎందుకు కోర్టుకి అని సహస్ర అంటే మీ అత్తయ్య లక్ష్మీ మంచిది శిక్ష పడకూడదు అని బయల్దేరింది.. మీ అమ్మ ఆ లక్ష్మీకి శిక్ష పడితే కల్లారా చూడాలి అని వస్తున్నారు అంటుంది. సరే రండి అని సహస్ర చెప్తుంది. ఎలా నిజం బయట పడకుండా ఆపాలి అనుకుంటుంది. లక్ష్మీని కోర్టుకి తీసుకొస్తారు. విహారి లాయర్‌ని కనకం తల్లిదండ్రులకు పరిచయం చేస్తాడు. తమ బిడ్డ ఏ తప్పు చేయదు కాపాడండి అని వాళ్లు లాయర్‌ని కోరుతారు. 

సహస్ర కోర్టుకి వచ్చి ఎవర్ని ఎలా ఆపాలి అని టెన్షన్ పడుతుంది. ఆదికేశవ్ వాళ్లు కనకాన్ని కలిసి మాట్లాడుతారు. ఆదికేశవ్‌కి గుండెలో దడ మొదలై ఆయాసం వచ్చేస్తుంది. లాయర్ విహారి వాళ్లతో ఈ టైంలో ఆయన లోపలికి రాకపోతే బెటర్ వస్తే వాదనలు విని ఇంకా ఇబ్బంది పడతారు అని చెప్తారు. విహారి ఆదికేశవ్‌ని తీసుకొని బయటే ఉండమని గౌరీతో చెప్తాడు. ఇక గౌరీ భర్తని తీసుకెళ్తుంది. వాళ్లు వెళ్లగానే సహస్ర వాళ్లు లక్ష్మీ దగ్గరకు వెళ్తారు. లక్ష్మీని చూసి యమున ఏడుస్తుంది. లక్ష్మీ యముని హగ్ చేసుకొని ఏడుస్తుంది. నువ్వే తప్పు చేయలేదు నిర్దోషిగా బయటకు వస్తావ్ అని యమున చెప్తుంది. 

లాయర్ విహారిని పక్కకు తీసుకెళ్లి కేసు మన చేతిలో లేదు సార్.. అన్నీ లక్ష్మీ గారు తప్పు చేసినట్లు ఉన్నాయి. కొన్ని ఆధారాల కోసం నేను వెయిట్ చేస్తున్నా అవి వస్తే మనం వాధించవచ్చు అంటాడు. విహారి కంగారు పడతాడు. అందరూ కోర్టులోకి వెళ్తారు. వాదనలు మొదలవుతాయి. లక్ష్మీ అతన్ని ఇంటికి పిలిపించి గడపాలి అని ప్రయత్నించి హత్య చేసిందని లాయర్ చెప్పి సాక్ష్యాలుగా చాటింగ్ హిస్టరీ, ఫొరెన్సిక్ ల్యాబ్‌ రిపోర్ట్ చూపిస్తారు. ఇక విహారి ఆపి బోనులోకి వెళ్లి ఓ యాప్ ద్వారా నెంబరు హ్యాక్ చేసి పంపొచ్చని అంటాడు. లక్ష్మీ అతన్ని హత్య చేయలేదని విహారి అరుస్తాడు. తను ఎలాంటిదో నాకు తెలుసు అంటే సాక్ష్యాలు కావాలి అంటారు.

లక్ష్మీ తరఫు లాయర్ సాక్ష్యాలు ఉన్నాయి అవి చూపించడానికి సమయం అడుగుతాడు. కోర్టు ఆవరణలో అందరూ ఉంటారు. అంబిక పక్కకు వెళ్లి తన లాయర్‌తో మాట్లాడుతుంది. లక్ష్మీ గెలవదు అని మనమే గెలుస్తామని ఆయన చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీకి జైలులో చిత్రహింసలు.. సూపర్ ఉమెన్‌తో అంబిక 60 లక్షల డీల్!