Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ, విహారిలను తీసుకురమ్మని పంతులు తొందర పెడతారు. యమున అక్కడే ఉండటంతో సహస్ర కంగారు పడుతుంది. బావ, లక్ష్మీ వస్తే అత్తయ్యకు నిజం తెలిస్తే ఆ లక్ష్మీ వైపే ఉంటుంది. బావ కూడా తన వైపే ఉన్నాడు కాబట్టి అదే అసలు భార్య అయిపోతుందని అనుకుంటుంది.
లక్ష్మీ, విహారిలు రెడీ అవుతూఉంటారు. లక్ష్మీ కొంగు సరిగా పెట్టుకోవడం రాక అలాగే విహారి దగ్గరకు వచ్చి కొంగు విసురు తుంది. అది విహారి ముఖం మీద పడి అలాగే ఉండిపోతాడు. తర్వాత లక్ష్మీ చూసి తీస్తుంది. లక్ష్మీని చీరలో బాగున్నావని విహారి అంటే డ్రస్‌లో బాగున్నారని అంటుంది. మీ అమ్మగారు పెట్టిన బట్టలు కదా చాలా బాగున్నాయ్ అని లక్ష్మీ అంటుంది. దానికి విహారి బట్టలు బాగున్నా ఇప్పుడు వీటితో వెళ్లి దొరికిపోతాం అంటాడు. నా వల్లే నీకు ఇలాంటి పరిస్థితి అని విహారి అంటే మీ వల్లే మా నాన్న గారు బాగున్నారని ప్రాణాలతో ఉన్నారని లక్ష్మీ అంటుంది. మీ వల్ల యమునమ్మగారికి ఇంట్లో న్యాయం దొరికింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. సహస్రమ్మకు న్యాయం జరిగిందని లక్ష్మీ అంటుంది.
విహారి మనసులో న్యాయం జరిగేది సహస్రకు కాదు నీకు ఎప్పటికీ నువ్వే నా భార్యవి అనుకుంటాడు. కానీ ఈ మాట నీకు ఇప్పుడే చెప్పలేను.. నా మనసులో నీ మీద ఉన్న ప్రేమ చెప్పుకోలేను.. ఏ రోజు అయితే నలుగురిలో గౌరవంగా నువ్వే నా భార్య అని చెప్పుకుంటానో ఆ రోజే నీకు ఈ విషయం తెలుస్తుందని అనుకుంటాడు. ఇక లక్ష్మీ చీర కొంగుకి పిన్ పెట్టుకుంటే విహారి నేను పెడతాను అని పిన్ తీసుకొని లక్ష్మికి చీర కడతాడు. ఇక పంతులు హడావుడి చేయడంతో గౌరీ వచ్చి కనకం వాళ్లని పిలుస్తుంది. ఇద్దరూ వచ్చేస్తున్నాం అని చెప్తారు.
పండు చాలా కంగారు పడతాడు. ఇద్దరూ వస్తే యమునమ్మకి సహస్రమ్మకి దొరికిపోతారని అనుకుంటాడు. గౌరీ పంతులు వెయిటింగ్ అని కంగారు పెడుతుంది. ఇక సహస్ర యమునతో మంగళ గౌరీ వ్రతానికి టైం అవుతుంది వెళ్దామా అని అంటే కాసేపు ఆగి వెళ్దాం అని యమున అంటుంది. ఇక మరి ఎక్కువ సేపు ఉండలేం ఏమైతే అది అయింది వెళ్దాం పద అని విహారి అంటాడు. ఇద్దరూ బయటకు వస్తారు. సహస్ర చూసి అత్త చూసేస్తుందేమో అని కంగారు పడుతుంది. పండు కూడా చాలా కంగారు పడతాడు.
సహస్ర చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో సహస్రకు ఓ ఫోన్ వస్తుంది. సహస్ర పద్మాక్షితో మాట్లాడినట్లు మాట్లాడి హడావుడి చేసేస్తుంది. వెంటనే అమ్మ రమ్మంది అత్తయ్య అని అంటుంది. పండు కూడా కంగారు పెడతాడు. దాంతో యమున, సహస్ర, పండులు వెళ్లిపోతారు. అది చూసి లక్ష్మీ, విహారిలు హ్యాపీగా ఫీలవుతారు. గౌరి విషయం అడిగితే వ్రతం పనులు ఉన్నాయని వెళ్లిపోయారని ఆదికేశవ్ చెప్తాడు.
లక్ష్మీ, విహారి పూజ చేస్తారు. ఇద్దరూ పిల్లల కోసం కవల అరటి పళ్ల ముడుపుడు చెట్టుకు తీసుకొని వెళ్తారు. విహారి ముడుపు పట్టుకొని లక్ష్మీనే తన భార్యగా చెప్పుకునేలా చూసేలా చేయమని కోరుకుంటాడు. లక్ష్మీ మాత్రం సంతాన లక్ష్మీ వ్రతం చేస్తున్నాం కానీ దీనికి ఫలితం ఉండదు అని తెలుసు నాకు కోరికలు లేదు విహారిగారు యమునమ్మా అతని కుటుంబం బాగుండాలి అని కోరుకుంటుంది. ఇద్దరూ ముడుపు కడతారు. విహారి కంట్లో దుమ్ము పడితే లక్ష్మీ చూస్తుంది. విహారి లక్ష్మీనే చూస్తూ ఉంటాడు. ఆదికేశవ్, గౌరీలు ఇద్దరినీ చూసుకొని మురిసిపోతారు. ఇద్దరూ ఇంత ప్రేమగా ఉన్నా పిల్లలు ఎందుకు పుట్టడం లేదు అని గౌరీ అంటుంది. దానికి ఆదికేశవ్ వాళ్లకి కవల పిల్లలు పుడతారు చూడు అని అంటాడు.
పంతులు పూజ పూర్తి చేసి ఇద్దరినీ దీవిస్తాడు. తర్వాత ఇద్దరూ ఆదికేశవ్, గౌరీల ఆశీర్వాదం తీసుకుంటారు. పిల్లలు గురించి టెన్షన్ పడొద్దు త్వరలోనే పుడతారు అని అంటారు. విహారి మనసులో నా భార్యగా అందరి ముందు లక్ష్మీని చూపించి మీ కోరిక నెరవేర్చుతాను అనుకుంటాడు. ఇక లక్ష్మీ, విహారిలు తమకు పని ఉందని ఇద్దరినీ పుణ్యకేత్రాలు తిరగమని కారు మాట్లాడి పంపిస్తారు. తర్వాత లక్ష్మీ, విహారిలు బట్టలు మార్చుకొని ఇంటికి బయల్దేరుతారు. లక్ష్మీకి ఎక్కిళ్లు వస్తాయి. విహారి నీరు ఇస్తాడు. లక్ష్మీ తన తండ్రి చాలా సంతోషంగా ఉన్నాడని అమ్మానాన్న ఇద్దరూ మన ఇద్దరి కోసం ప్రతీ దేవుడికి మొక్కులు మొక్కేస్తారని అంటుంది. ఇక మొదటి సారి అత్తయ్య అని మళ్లీ అదే యమునమ్మ గారు మనల్ని దీవించారని విహారితో చెప్తుంది. విహారి కూడా చాలా హ్యాపీగా ఫీలవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, కీర్తిలకు పెళ్లి చేస్తానని మాటిచ్చేసిన సీఎం.. భర్తపై విరూపాక్షి ఫైర్!