Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి ఫ్రెండ్ పోలీస్ సంధ్య ఇంటికి వస్తుంది. ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని ఇంట్లో వాళ్లని సంధ్య అడిగితే అంబిక, పద్మాక్షిలు లక్ష్మీ మీద అనుమానం ఉందని అంటారు. విహారి వాళ్లతో పర్సనల్ కోపాలు వద్దు తనని కోర్టు నిర్దోషి అని చెప్పిందని అంటాడు. దాంతో సహస్ర సంధ్యతో మేడం మీరు అడగాల్సింది ఇంట్లో వాళ్లని అడగండి అంటుంది. 

సంధ్య అందర్ని ఎంక్వైరీ చేస్తుంది. అంబికను అనుమానంగా చూస్తుంది. నెల రోజుల్లో కేసు తేల్చేస్తా అంటుంది. ఇక సహస్ర లక్ష్మీ  వేలిముద్రలు తీసుకొని సుభాష్ చెప్పిన ప్లేస్‌కి వెళ్తుంది. సుభాష్ సహస్ర గుర్తు పట్టకుండా మాస్క్ పెట్టుకొని సహస్రకు కనిపించకుండా  మాట్లాడుతాడు. ఓ చోట వేలిముద్రలు పెట్టమని చెప్తాడు. నాకేం ప్రాబ్లమ్‌ ఉండదు కదా అని సహస్ర అంటే నువ్వు తోక జాడించనంత వరకు నీకు ఏం ప్రాబ్లమ్ ఉండదు లక్ష్మీ వేలి ముద్రలు వాడుతున్నాం కాబట్టి లక్ష్మీ ఇరుక్కుంటుందని చెప్తాడు. తర్వాత వేలిముద్రలు కలెక్ట్ చేసుకొని అంబికకు కాల్ చేస్తాడు. 

సహస్ర లక్ష్మీ వేలిముద్రలు తీసుకొచ్చిందని చెప్తాడు. వాటిని త్రీడీ ప్రింట్ తీయించి సిలికాన్ కంపెనీ ట్రేడ్ చేయించమని చెప్తుంది. అంతా నేను చూసుకుంటా అని సుభాష్ అంటాడు. అంబిక తనలో తాను సహస్ర నువ్వు చాలా స్మార్ట్ నీతో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు. సహస్ర గదిలోకి వచ్చేస్తుంది. ఇంతలో విహారికి మేనేజర్ కాల్ చేస్తాడు. ఫండ్ అకౌంట్‌లోకి రాగానే అందరికీ బోనస్ ఇచ్చి వీ క్రాఫ్ట్ ప్రాజెక్ట్‌కి కూడా వాటినే వాడుతున్నాం అని అంటాడు. సహస్రకు విహారి తన సంతోషం పంచుకుంటాడు. సహస్ర చాలా బాధపడుతుంది. బావ చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు. రేపు ఎప్పుడైనా బావకి ఈ స్కామ్‌లో నేను ఉన్నానని తెలిస్తే నన్ను తన్ని తరిమేస్తాడు అనుకుంటుంది. 

లక్ష్మీ బయట ప్రాజెక్ట్‌ గురించి ఫోన్‌లో మాట్లాడుతుంటుంది. ఇంతలో తులసి కోట దగ్గర దీపం ఆరిపోతుంటే విహారి, లక్ష్మీ ఒకేసారి చూసి ఇద్దరూ చేతులు అడ్డు పెడతారు. అది పై నుంచి యమున చూసి చిరాకు పడుతుంది. ఇద్దరూ మాట్లాడుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. బ్యాంక్ నుంచి ఫండ్స్ వస్తాయని లక్ష్మీ చెప్పడంతో నువ్వు సాధిస్తావ్ లక్ష్మీ అని విహారి లక్ష్మీ భుజం మీద చేయి వేస్తాడు. యమున అసహ్యంగా చేతిలో కాఫీ కప్పు కింద పడేస్తుంది. ఆ సౌండ్‌కి లక్ష్మీ విహారితో ఎవరో వస్తున్నట్లు ఉన్నారు అని దూరం దూరం వెళ్లిపోతారు. 

విహారి లోపలికి వెళ్లే సరికి యమున ఎదురుగా నిల్చొని ఉంటుంది. విహారి ముభావంగా అమ్మా తిన్నావా మందులు వేసుకున్నావా అని అడుగుతాడు. యమున కొడుకుతో విహారి ఏమైనా నాకు చెప్పాలి అనుకుంటున్నావా అని అడుగుతుంది. నీకు చెప్పడానికి ఏం ఉంది అమ్మా అని అంటాడు. ఏ విషయం గురించి అడుగుతున్నావ్ అంటే నువ్వు సహస్ర మెడలో అనుకోని పరిస్థితుల్లో తాళి కట్టావ్ కదా నా వల్ల విడిపోయిన ఈ కుటుంబం నీ వల్ల కలిసింది. ఈ కుటుంబం మళ్లీ విడిపోయే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు అని స్ట్రాంగ్‌గా చెప్తుంది. నువ్వు తీసుకునే ఏ నిర్ణయం అయినా మంచిగా తీసుకోవాలి అంటుంది. 

సహస్ర బావకి నష్టం వచ్చేలా చేశానని బాధ పడుతుంది. ఇంతలో అంబిక సహస్ర దగ్గరకు వచ్చి లక్ష్మీ విషయం గురించి ఆలోచిస్తున్నావ్ కదా అని అంటుంది. లక్ష్మీ విషయంలో జాగ్రత్త పడకపోతే నీ స్థానంలోకి వచ్చేలా ఉందని అంటుంది. సహస్ర అంబికతో లక్ష్మీని వదిలేదే లేదు అలా అనొద్దు అని అంటుంది. ఇక లక్ష్మీ ఒక వైపు వంట చేస్తే మరో వైపు ల్యాప్‌ట్యాప్ ముందు పెట్టుకొని పనులు చేస్తుంది. వసుధ, చారుకేశవ వచ్చి నీ లాంటి కోడలు దొరకడం ఈ ఇంటి అదృష్టం అంటారు. పెద్దగా మాట్టాడొద్దని లక్ష్మీ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: అమ్మాయి గారు సీరియల్ ప్రోమో: విరూపాక్షి గ్యాంగ్ గెలిచిందోచ్.. ఈ సారి తల్లిదండ్రుల చేతుల మీదగా 'రూపాకల్యాణం'