Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode యమున లక్ష్మీని నిజం చెప్పమని అడుగుతుంది. లక్ష్మీ ఇప్పుడు అవన్నీ ఎందుకు మీకు నా వల్ల ఏమైనా ఇబ్బంది అయితే ఇంటి నుంచి వెళ్లిపోతా నన్ను వదిలేయండి అని ఏడుస్తుంది. నువ్వు నిజం చెప్పే కదలాలి చెప్పు అని యమున అడుగుతుంది. దాంతో విహారి నిజం నేను చెప్తా అంటాడు. లక్ష్మీ వద్దని అంటుంది.
అంబిక లక్ష్మీతో నువ్వు నిజం చెప్పవు చెప్పే వాళ్లని వద్ద అని అంటున్నావా అని అంటుంది. నిజం చెప్పు అని లక్ష్మీని యమున అంటుంది. దాంతో విహారి యమునతో అమ్మ తన మెడలో తాళి కట్టిన భర్త నేనే. తనని వదిలేసి వెళ్లిపోయింది నేనే. తన మెడలో మూడు ముళ్లు వేసి పెళ్లి చేసుకున్నా నా అర్థాంగి. వేదమంత్రాల సాక్షిగా దేవుడి సాక్షిగా నేను పెళ్లి చేసుకున్న నా ధర్మపత్ని అని విహారి చెప్తాడు. దాంతో పద్మాక్షి సహస్రని తీసుకొచ్చి ఏంట్రా అది నీ భార్యా? అది నీ అర్ధాంగా? అది నీ ధర్మపత్రినా? మరి నా కూతురు నీకు ఏమవుతుంది అని ప్రశ్నిస్తుంది.
సహస్ర ఏడుస్తూ బావ ఏం మాట్లాడవేంటి బావ అని అంటుంది. అంబిక విహారితో నువ్వు సహస్రనే కాదు మొత్తం ఈ కుటుంబాన్నే మోసం చేశావా అంటుంది. చారుకేశవ, వసుధలు ఏం జరిగిందో చెప్పమని అంటే పద్మాక్షి ఏం చెప్పొద్దు అని బాగా మోసం చేశాడు. వీడి తండ్రి బుద్ధులే వీడికి వచ్చాయ్.. నీ తల్లి మమల్ని మోసం చేస్తే నువ్వు నా కూతుర్ని మోసం చేస్తావా. దాని జీవితాన్ని నాశనం చేశావు కదరా నీ చేతిలో మోసం చేయడానికేనా మేం ఉన్నది. ఆ రోజు మీ బాబు చేసిన మోసానికి నేను నా పుట్టింటి నుంచి నేను వెళ్లిపోయా. ఈ రోజు అలా వెళ్లను అని గన్ తీసుకొచ్చి విహారికి గురి పెడుతుంది. అందరూ షాక్ అయిపోతారు.
విహారితో నా కూతురికి అన్యాయం చేసినందుకు నేను నీకు విధించే శిక్ష చావు అని అంటుంది. సహస్ర బావకి అడ్డంగా వెళ్తుంది. తల్లిని బతిమాలుతుంది. పద్మాక్షి కూతురితో వీడిని చంపి ఇంత కంటే మంచి వాడిని నీకు తెచ్చి పెళ్లి చేస్తాను అంటుంది. సహస్ర తల్లికి చాలా బతిమాలుతుంది. లక్ష్మీ వచ్చి నన్ను చంపండి అంటే వీడు చచ్చాక రెండో చావు నీదేనే అని అంటుంది. ఇక సహస్ర బావని కాల్చొద్దని తల్లిని అడ్డుకుంటుంది. ఇంతలో బులెట్ పద్మాక్షికి తగులుతుంది. దాంతో సహస్ర, యమున పెద్దగా అరుస్తారు. తీరా చూస్తే అదంతా యమున కల.
లక్ష్మీ ప్రసాదం ఇస్తే యమున అక్కడ పెట్టమని చెప్తుంది. లక్ష్మీ ఏమైందని అడిగితే కోపంగా చూసి నన్ను ఒంటరిగా వదిలేయ్ అని పంపేస్తుంది. నేను చూసిన నిజం పద్మాక్షికి తెలిస్తే తను చావడమో చంపడమో చేస్తుంది. ఈ నిజం తెలిస్తే కుటుంబం విడిపోతుంది. మంచో చెడో ఈ నిజం ఎవరికీ తెలీకపోవడమే మంచిదని అనిపిస్తుందని ఆగిపోతుంది. ఇక రాత్రి సహస్ర లక్ష్మీ వేలిముద్రలు తీసుకోవడానికి లక్ష్మీ గదికి వెళ్తుంది. ఒక చిన్న అబద్ధం ఆడినందుకు నా ఇంట్లో నేనే దొంగ అయిపోయా అనుకుంటుంది. ఇక లక్ష్మీ దగ్గరకు వెళ్లి నేను దొరక్కూడదు అంటే జాగ్రత్తగా వేలిముద్రలు తీసుకోవాలని లక్ష్మీ గాఢ నిద్రలోకి వెల్లగానే వేలిముద్రలు తీసుకుంటుంది.
సహస్ర తిరిగి వెళ్తుంటే సౌండ్ అవుతుంది. అది విన్న పండు, చారుకేశవ దొంగ వచ్చాడని అనుకొని ముసుగు వేసి కొట్టాలని బెడ్ షీట్ తీసుకొచ్చి సహస్ర మీద వేసి చితక్కొట్టేస్తారు. అందరూ వచ్చి ఏమైంది ఎవరు అంటే దొంగ అని అంటారు. పద్మాక్షి కుళ్లపొడవమని అంటే మళ్లీ చితక్కొట్టేస్తారు. ముసుగు తీసి సహస్రని చూసి షాక్ అయిపోతారు. నక్కి నక్కి వెళ్తున్నావేంటి అని చారుకేశవ అంటే చీకట్లో కనిపించలేదని అంటుంది. అందరూ ప్రశ్నలు వేస్తే వీళ్లు పగ పట్టినట్లు కుళ్లపొడిచేశారు. ఇప్పుడేం చెప్పలేను అని వెళ్తుంది.
ఉదయం సహస్ర వేలిముద్రలు తీసుకెళ్తుంటే పోలీస్ సంధ్య వస్తారు. సహస్ర కంగారు పడుతుంది. విహారిని పిలుస్తుంది. అందరూ చేరుకుంటారు. ఎస్‌ఐని తానే పిలిచాను అని లక్ష్మీ మర్డర్ కేసు ఎంక్వైరీ చేయడానికి పట్టుకోవడానికి వచ్చారని విహారి అంటాడు. ముందే చెప్పాలి కదా అని అంబిక అంటే చెప్పాల్సిన అవసరం ఏంటి అని విహారి అంటాడు. పద్మాక్షి, సహస్రలు ఎంక్వైరీ చేస్తేనే బెటర్ అంటారు. అంబిక తన మీదకి కేసు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని ఎస్‌ఐ అంటే లక్ష్మీ మీద అనుమానం ఉందని అంబిక అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్ ప్రోమో: విరూపాక్షి గ్యాంగ్ గెలిచిందోచ్.. ఈ సారి తల్లిదండ్రుల చేతుల మీదగా 'రూపాకల్యాణం'