Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీని రౌడీలు పాడు చేయాలని ప్రయత్నిస్తే విహారి రౌడీలను చితక్కొట్టి లక్ష్మీని తీసుకొని పారిపోతాడు. సుభాష్ అంబికతో మాట్లాడుతూ ఉండటం వల్ల సుభాష్‌ విహారి వాళ్లని చూడడు. లక్ష్మీతో జాగ్రత్తగా ఉండమని సుభాష్‌ లక్ష్మీ ఫొటో రౌడీలకు చూపించి తను కనిపిస్తే చంపేయమని అంటాడు. రౌడీ లక్ష్మీని గుర్తు పట్టి తను ఇక్కడికే వచ్చిందని చెప్తాడు. లక్ష్మీని విహారి పక్క గదిలో ఉందని అనగానే అలా ఎందుకు చేశారురా అని పరుగులు తీస్తారు. ఇంతలో మరో ఇద్దరు వచ్చి లక్ష్మీ, విహారి పారిపోయారని  చెప్తారు.

సుభాష్‌ షాక్ అయి లక్ష్మీ, విహారి కోసం వెతుకుతారు. అంబిక మళ్లీ సుభాష్‌కి కాల్ చేసి విహారి సంతకం పెట్టాడా.. ఆ చుట్టు పక్కలకు లక్ష్మీ వచ్చిందా అని అడుగుతుంది. సుభాష్ పొరపాటు జరిగిందని లక్ష్మీ వచ్చి విహారిని తీసుకొని పారిపోయిందని అంటాడు. అంబిక కోపంగా వాళ్లని ఎలా అయినా పట్టుకో విహారితో సంతకం పెట్టించకపోతే ఊరుకోను విహారి సంతకం పెడితేనే మనకు భవిష్యత్ ఉంటుంది అంటుంది. అంబిక ఫోన్ పెట్టగానే చారుకేశవని ఎదురుగా చూసి బిత్తర పోతుంది. చారుకేశవ మొత్తం వినేసుంటాడేమో అని షాక్ అయిపోతుంది. చారుకేశవ అంబిక కంగారు చూసి ప్రశ్నిస్తాడు. దేవుడు మనకు మారడానికి అవకాశం ఇస్తాడు త్వరగా మారితే మంచిది అని అంటాడు. నేనేం తప్పు చేశానని అంబిక అంటే నీ ఆత్మ సాక్షిని అడుగు అని చెప్పి వెళ్లిపోతాడు. 

విహారి, లక్ష్మీ అడవిలో పరుగులు తీస్తుంటారు. వెనకాలే రౌడీలు సుభాష్ వెతుక్కుంటూ వస్తుంటారు. విహారికి ఎక్కువగా కొట్టేయడంతో ఓపిక ఉండదు. లక్ష్మీ భుజం మీద చేయి వేసి పట్టుకొని తీసుకెళ్తుంటుంది. విహారి ఆగిపోతే లక్ష్మీ  విహారితో త్వరగా వెళ్లకపోతే చంపేస్తారని అంటుంది. పోరాడుదాం అని విహారి అంటే మీరు దెబ్బలు తగిలి నీరసపడిపోయిన్నారు వెళ్లిపోదాం అని తీసుకెళ్తుంది. సుభాష్ ఇంకొంతమంది రౌడీలను తీసుకొచ్చి వెతికిస్తాడు. ఇద్దరూ రౌడీలు లక్ష్మీ వాళ్లని చూస్తారు. వాళ్లని ఫాలో అవుతారు. లక్ష్మీ, విహారి ఓ పొద చాటున దాక్కుంటే రౌడీలు గునపంతో గుచ్చుతారు. లక్ష్మీ విహారిని లాగేయడంతో కొంచెం తగిలి తప్పించుకుంటారు. లక్ష్మీ, విహారిని తీసుకొని పరుగెడుతుంది. 

సుభాష్‌ వాళ్లు వస్తారు. గునపానికి రక్తం అతుక్కోవడం చూసి ఇక్కడే ఉంటారని వెతుకుతారు. విహారికి లక్ష్మీ కట్టు కడుతుంది. రాత్రి అయిపోతుంది. విహారి, లక్ష్మీ అడవి మధ్యలోకి చేరుకుంటారు. ఎక్కడికి వెళ్లాలా అని అనుకుంటూ గడ్డి ఉన్న చోట దాక్కుంటారు. లక్ష్మీ విహారితో ఎవరు ఇదంతా చేశారో తెలీదు మిమల్ని చాలా హింసించారని అంటుంది. మన దగ్గర వంద కోట్లు తీసుకున్న వాళ్లే ఇదంతా చేసుకుంటారని లక్ష్మీ అంటుంది. అంతా రేపు తెలుసుకుందామని విహారి అంటాడు. ఇక లక్ష్మీకి తన ప్రేమ ఇప్పుడే చెప్పాలని ఇంతకంటే మంచి అవకాశం దొరకదు అని చెప్పడానికి రెడీ అవుతాడు. 

విహారి లేచి నిల్చొని లక్ష్మీని చూడకుండా అటు వైపు తిరిగి నా మనసులో మాటలు నీకు ఈరోజు చెప్తా కనకం. నేను యూఎస్ నుంచి వచ్చాను. నాకు మనసుల గురించి అంతగా తెలీదు. నీ మెడలో తాళి కట్టాను కానీ అది తీసేసి నీకు ఓ దారి చూపిస్తే సరిపోతుంది అనుకున్నా కానీ తర్వాత  తాళి బంధం తెలుసుకొని అమ్మవారి సాక్షిగా నిన్ను భార్యగా అంగీకరించాను అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: అర్ధరాత్రి లోహితని చెట్టుకి కట్టేసిన మధు.. వెక్కి వెక్కి ఏడుస్తున్న లోహిత.. వీడియో వైరలైతే?