Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ, ఎస్‌ఐ ఇద్దరూ విహారి కారు ఉన్న ప్లేస్‌కి వెళ్తారు. ఎస్‌ఐ లక్ష్మీతో విహారికి ఏం కాదు అని చెప్పి తీసుకెళ్తుంది. ఇక యమున విహారికి కాల్ చేస్తుంది. కాల్ కనెక్ట్ అవ్వదు.. దాంతో యమున టెన్షన్ పడుతూ సహస్రని పిలుస్తుంది. సహస్రతో పాటు అందరూ హాల్‌లోకి వస్తారు. 

సహస్రకి విహారి గురించి యమున అడుగుతుంది. విహారికి సహస్ర కాల్ చేస్తే ఫోన్ స్విఛ్ ఆఫ్ వస్తుంది. చారుకేశవ్ ముంబయి ఆఫీస్‌కి కాల్ చేస్తే ముంబయి రాలేదని చెప్తారు. దాంతో ఇంట్లో అందరూ చాలా టెన్షన్ పడతారు. పోలీస్‌ కంప్లైంట్ ఇద్దామని అనుకుంటే అంబిక ఆపుతుంది. తానే విహారిని కిడ్నాప్ చేయించిందని తెలిసిపోతుందని ఇంట్లో వాళ్లని మభ్యపెట్టడానికి విహారి కనిపించడం లేదని బయటకు తెలిస్తే వంద కోట్ల ఇష్యూతో పారిపోయాడని ఇన్వెస్వర్లు గోల చేస్తారని బ్యాడ్ నేమ్ వస్తుందని ఆపుతుంది. సహస్ర, యమున కంగారు పడుతుంటే అంబిక ఆపి కాసేపు ఓపిక పడదాం విహారి నుంచి ఏదో ఒక సమాచారం వస్తుందని అంటుంది. దాంతో పద్మాక్షి కొద్ది సేపు చూసి తర్వాత కంప్లైంట్ ఇద్దామని అంటుంది. 

విహారిని రౌడీలు కట్టి పడేసుంటారు. మత్తులో ఉన్న విహారికి మెలకువ వస్తుంది. రౌడీలను చూసి షాక్ అయిపోతాడు. ఎవర్రా మీరంతా నన్ను ఎందుకు తీసుకొచ్చారు అని అంటే రౌడీలు విహారి ముఖం మీద నీరు విసిరేస్తారు. విహారి కోపంగా నా చేతులు కాళ్లకి కట్లు విప్పండ్రా అప్పుడు నేనేంటో చెప్తా అంటాడు. అప్పుడే సుభాష్ మాస్క్ పెట్టుకొని ఎంట్రీ ఇస్తాడు. ఖాళీ డాక్కుమెంట్స్ మీద సంతకం పెట్టమని వెంటనే వదిలేస్తా అని అంటాడు. చేతులు విప్పితే సంతకం పెడతానని విహారి చెప్పి చేతులు విప్పగానే ఆ కాగితాలు చింపేసి సుభాష్‌ ముఖం మీద విసిరేసి ఫైట్ చేస్తాడు. రౌడీలు విహారిని పట్టి బంధించి చితక్కొడతారు. అదంతా అంబిక తన ఫోన్‌లో లైవ్‌లో చూస్తుంది. 

విహారి వాళ్లతో నేను పడిన ప్రతీ దెబ్బకి అంతకు రెట్టింపు మీకు ఉంటుందిరా అని ముసుగు తీసి కనపడు ఆ ధైర్యం లేదా.. ముఖం చూపించలేని చేతకాని వెధన అని సుభాష్‌ని రెచ్చగొడతాడు. దాంతో సుభాష్‌ విహారిని చితక్కొట్టి కొడతాడు. అది చూసిన అంబిక వెంటనే కాల్ చేస్తుంది. విహారిని నువ్వు చితక్కొట్టి చంపేస్తే విహారి చనిపోతే ఆస్తి మొత్తం ట్రస్ట్‌కి పోతుందని చెప్తుంది. ఇక విహారితో ఇంటికి కాల్ చేయించమని అంటుంది. విహారితో వాళ్లతో మాట్లాడాలి అంటే నేను చెప్పినట్లు చేయమని ఐడియా ఇస్తుంది. 

సుభాష్‌ విహారి దగ్గరకు వెళ్లి యమున, సహస్రతో పాటు ఫ్యామిలీ ఫొటో చూపించి లక్ష్మీ ఫొటో కూడా చూపించి చెప్పినట్లు చేయకపోతే గంట గంటకి ఒక్కొక్కరూ పోతారని బెదిరిస్తాడు. విహారి మనసులో నా కోసం మా అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో ముఖ్యంగా లక్ష్మీ ఎంత కంగారు పడుతుందో అని అనుకుంటాడు. యమున మందులు కూడా వేసుకోకుండా ఏడుస్తుంటే అందరూ వెళ్లి మందులు వేసుకోమని చెప్తారు. విహారికి ఏం కాదని పద్మాక్షి, యమున, సహస్రలకు ధైర్యం చెప్తుంది. యమున కంప్లైంట్ ఇప్పిస్తానని ఆస్తి పోయినా నష్టం లేదని అంటుంది. సహస్ర కూడా వెళ్దామని అంటుంది. అంబిక చాలా టెన్షన్ పడుతుంది. ఇంతలో విహారి నుంచి అంబిక యమునకు ఫోన్ చేయిస్తుంది. 

యమున, సహస్ర ఏడుస్తూ విహారి గురించి మాట్లాడుతారు. విహారి వాళ్లతో నేను దిల్లీలో ఉన్నాను.. వంద కోట్ల పని మీద వచ్చాను. నా కోసం ఏం టెన్షన్ పడొద్దు అని చెప్తాడు. వెంటనే సుభాష్ కాల్ కట్ చేస్తాడు. ఇంట్లో అందరూ రిలాక్స్ అయిపోతారు. అంబిక మనసులో ఇక్కడ వీళ్లని ఆపాను.. వీళ్లకి విహారి గురించి మరి అనుమానం రాదులే అనుకుంటుంది. విహారి డాక్యుమెంట్స్ మీద సంతకం పెడితే విహారిని కూడా చంపేస్తా అనుకుంటుంది.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: షాకింగ్.. విహారి కిడ్నాప్.. నడి రోడ్డు మీద కారు.. అర్థరాత్రి ఏం జరిగింది?