Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి ఎదురుగా అంబిక బండారం బయట పెట్టి నిలదీయాలని దామోదర్ వాళ్లు వస్తున్నారని సుభాష్‌కి తన ఫ్రెండ్ కాల్ చేసి చెప్తాడు. సుభాష్ షాక్ అయి అంబికకు కాల్ చేస్తాడు. అంబిక బయటకు వెళ్తుంది. దామోదర్ వాళ్లు వస్తున్న విషయం సుభాష్ చెప్పడంతో అంబిక షాక్ అయిపోతుంది.


సుభాష్: ఇప్పుడే నా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాడు. వాళ్లకి విహారి ఎదురు పడితే మొత్తం పూజ గుచ్చినట్లు చెప్పేస్తాడు. మనం చేసినదంతా విహారికి తెలిసిపోతుంది దాంతో నీ పరువు మొత్తం అక్కడికి అక్కడే మట్టిలో కలిసిపోతుంది. 
అంబిక: ఓ మై గాడ్ ఇప్పుడేం చేయాలి.
లక్ష్మీ: నిశ్చితార్థం ఏర్పాటు చేయడంతో.. దయచేసి నా మాట వినండి అమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేని పెళ్లి చేస్తే నేను ఎలా సుఖపడతాను అనుకుంటున్నారు దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేయండి అమ్మా. 
పెళ్లికొడుకుతల్లి: ఏమైంది లక్ష్మీ ఎందుకు అంత కంగారు పడుతున్నావ్  మేం నిన్ను కోహినూర్ వజ్రంలా చూసుకుంటాం.
పద్మాక్షి: చూడు లక్ష్మీ ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు మేం చూసింది చాలు నువ్వు ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటున్నావ్ ఈ గడప దాటి వెళ్తున్నావ్ అంతే.
లక్ష్మీ: అమ్మగారు నా మాట వినండి.
పద్మాక్షి: లక్ష్మీ ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. పంతులు నిశ్చితార్థం విషయం చూడండి.
పంతులు: అమ్మా ఇక నిశ్చయతాంబూలాలు మార్చుకోండి.


సహస్ర వసుధతో లక్ష్మీ తరపున తాంబూలం ఇప్పిస్తుంది. ఇద్దరూ తాంబూలాలు మార్చుకుంటుంటే లక్ష్మీ వాటిని విసిరి కిందకి కొట్టేస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. లక్ష్మీ తాంబూలం పళ్లెం విసిరేసి గదిలోకి పారిపోయి ఏడుస్తుంది. సహస్ర లక్ష్మీ దగ్గరకు వచ్చి మా పరువు తీస్తున్నావ్ అని వాడి కంటే డబ్బున్నోడు కావాలని ఆశపడుతున్నావ్ అని నీకు వాడే కరెక్ట్ అని వాడితోనే పెళ్లి అవుతుంది ఇది ఫైనల్ అంటుంది. ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని లక్ష్మీ అంటే ఒక్క కారణం చెప్పమని సహస్ర అంటుంది. తనకు ఇష్టం లేదు కదా వదిలేయ్ అని యమున అంటే తాను వదలను అని ఒప్పుకోనని లక్ష్మీ పెళ్లి చేసుకొని ఇంటి నుంచి వెళ్లిపోవాలని అంటుంది. ఒక్క  కారణం చెప్తే పెళ్లి ఆపేస్తా అని సహస్ర అంటే అవన్నీ చెప్పలేను అని లక్ష్మీ చెప్తుంది. దాంతో సహస్ర ఈ రోజు నీ నిశ్చితార్థం జరిగిపోవాల్సిందే రెండు రోజుల్లో పెళ్లి కూడా అయిపోతుందని అంటుంది. లక్ష్మీ, యమున ఇద్దరూ షాక్ అయిపోతారు. 


అంబిక, సుభాష్ చాలా టెన్షన్ పడతారు. విహారిని ఆఫీస్ నుంచి పంపేయాలని అనుకుంటారు. ఇక పండు ఆఫీస్‌కి పరుగున వస్తాడు. రిసెప్షన్ ఆమెకు చెప్తే ఆమె విహారికి కాల్ చేసి చెప్పి పండుని లోపలికి పంపిస్తుంది. పండు విహారి దగ్గరకు వెళ్లి లక్ష్మీమ్మకి పెళ్లి చూపులు జరుగుతున్నాయని చెప్తాడు. జరిగినదంతా చెప్తాడు. విహారి షాక్ అయిపోతాడు. లక్ష్మీకి పెళ్లి చూపులు, నిశ్చితార్థం ఇష్టంలేదని సహస్ర బలవంతంగా చేస్తుందని చెప్తాడు. దాంతో పండు, విహారి ఇద్దరూ వెంటనే ఇంటికి బయల్దేరుతారు. మరోవైపు దామోదర్ కూడా ఆఫీస్‌కి వచ్చేస్తాడు. ఆఫీస్‌ రిసెప్షన్ దగ్గర విహారి, అంబిక ఎక్కడా ఇద్దరూ దొంగలు అని గొడవ చేస్తాడు. అంబిక, సుభాస్ చూసి భయపడతారు. ఇంతలో విహారి వస్తుంటాడు. విహారిని దామోదర్ చూడకుండా ఉండాలని అంబిక ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. ఇంతలో పండు, విహారి బయటకు వెళ్లడం చూసి వాళ్లని క్యాబిన్‌కి తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: వైకుంఠాన్ని కొట్టిన నయని.. త్రినేత్రిని బతికించమని వేడుకున్న బామ్మ.. నేత్రికి ఏమైంది?