Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకం తండ్రిని తీసుకొని ప్రకాశ్ సిటీ బయల్దేరుతాడు. లక్ష్మీ ఆనందంగా ఉంది అంటే కారణం నువ్వే అని ఆదికేశవ్ అంటే దానికి ప్రకాశ్ నేను ఆనందంగా ఉన్నాను అంటే కారణం మీరే అని మీరు దొరకడం నా అదృష్టం అని మీ వల్ల నేను కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నానని అంటాడు. లక్ష్మీ విహారికి పెళ్లి అయిపోతుందని ఆలోచిస్తూ బాధ పడుతుంది. ఏడుస్తుంది. పండు లక్ష్మీ దగ్గరకు వస్తాడు. 

Continues below advertisement

పండు: ఈ పెళ్లి తర్వాత నీకు మిగిలేది ఏంటో నీకు తెలుసా. ఆ మిగిలిన జీవితంలో జీవచ్ఛవంలా బతికేయాలి అని నిర్ణయించుకున్నావా. మౌనంగా ఉన్నావు అంటే సహస్ర, విహారి బాబుల పెళ్లికి ఒప్పుకున్నట్లేనా. విహారి బాబుకి నువ్వు భార్యగా పొందిన అదృష్టాన్ని చేతులారా పాడు చేసుకుంటావా. గంటలో పెళ్లి తర్వాత నువ్వు ఎంత అరిచి గోల పెట్టిన ఏం చేయలేవు. ఏం చేయాలి అన్నా ఇప్పుడే. నువ్వు నా సొంత చెల్లి అనుకుంటున్నా. ఏంటమ్మా నువ్వు కనీసం మాట్లాడంలేదు. నువ్వు ప్రతిఘటించాల్సిన సమయం ఇదే అమ్మా. కనీసం విహారి బాబుకి అయినా తను అంటే నీకు ఇష్ఠం అని చెప్పమ్మా. కనీసం యమునమ్మ గారికి అయినా నిజం చెప్పమ్మా. నీ గుండెల్లో ఎంత బాధ ఉందో నీ కన్నీళ్లు చూస్తే తెలుస్తుంది. వెంటనే వెళ్లి ఈ పెళ్లి ఆపు అమ్మా.లక్ష్మీ: ఈ పెళ్లి ఆగకూడదు. జరగాలి. ఆ దేవుడు నా తల రాత ఎలా రాస్తే అలాగే జరుగుతుంది. పండు: నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటున్నావమ్మా. నీకు విహారి బాబు అంటే ఇష్టమా లేదా.లక్ష్మీ: ఇష్టమే.. కానీ నాకు బాధలు అలవాటు అయిపోయావి. ఎవరికీ నేను ఏం చెప్పలేను. ఎవరూ నా సమస్య తీర్చలేరు. నా వల్ల ఈ కుటుంబం విడిపోవడం నాకు ఇష్టం లేదు. 

ఇద్దరూ మాట్లాడుకుంటూ ఏడుస్తుంటే వసుధ అక్కడికి వస్తుంది. పండు లక్ష్మీ మీద అరుస్తున్నావెందుకు అని అడుగుతుంది. పెళ్లి పనులు చేయకుండా ఎందుకు ఇక్కడ ఉన్నావని అడిగానని అంటాడు. దానికి వసుధ తనకి ఇంకేం పనులు చెప్పకు కాబోయే జంటకు పెళ్లి కాని అమ్మాయి దిష్టి తీయాలని చెప్పి లక్ష్మీని పిలుస్తుంది. లక్ష్మీని తీసుకెళ్తుంది. పెళ్లి కాని వాళ్లని తీసుకురమ్మని అంటే లక్ష్మీని తీసుకొచ్చిందేంటని యమున అనుకుంటుంది. లక్ష్మీ వద్దని అంటుంది. పద్మాక్షి యమున మీద అరుస్తుంది. దాంతో కాదాంబరి పెళ్లి కాని వాళ్లు దిష్టి తీస్తే త్వరగా పెళ్లి అవుతుందని చెప్తుంది. లక్ష్మీ దిష్టి తీయడానికి వెళ్తుంది. లక్ష్మీ దిష్టి తీస్తు ఏ పాపం ఉన్నా తనకే తగలాలి విహారి, సహస్రలు సంతోషంగా ఉండాలని కోరుకొని దిష్టి తీస్తుంది. ఇక పంతులు పెళ్లి కూతురిని ఆమె తరఫు వాళ్లని అమ్మవారి దగ్గరకు వెళ్లమని అక్కడ ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమ బట్టలు పెట్టి రమ్మని చెప్తారు.

Continues below advertisement

సహస్ర వాళ్లు వెళ్తారు. ఇక విహారి తన పెళ్లి బట్టలు చేతిలో పట్టుకొని చూస్తూ గుండెకు హత్తుకుంటాడు. నాన్న బట్టల్ని చూస్తుంటే మీరే నాతో ఉన్నట్లు ఉందని మీ చెల్లి మన కుటుంబంలో కలవాలి అనుకున్నారు ఆ కోరక తీరకుండా చనిపోయారు మీ కోరిక నేనే తీర్చుతానని అనుకొని బట్టలు పట్టుకొని హగ్ చేసుకుంటాడు. విహారి మాటలు విన్న యమున కన్నీరు పెట్టుకుంటుంది. భర్త బట్టలను పట్టుకొని ఏవండీ మన ప్రేమ ఈ రోజు గెలిచినట్లుండి.. మన ప్రేమ వల్ల ఈ కుటుంబం విడిపోయిన మన ప్రేమకు ప్రతి రూపం అయిన మన కొడుకు కుటుంబాన్ని కలుపుతున్నాడని ఏడుస్తుంది. విహారి తల్లితో ఇంకెవ్వరూ నిన్ను పరాయి దానిలా చూడరమ్మా ఈ పెళ్లి తర్వాత నీ గౌరవం పెరిగిలా చేస్తానని విహారి అంటాడు.

 మరోవైపు ప్రకాశ్ కనకం తండ్రితో ఫొటో దిగి కనకానికి పంపిస్తాడు. లక్ష్మీ భయంతో ఫోన్ చేస్తుంది. ప్రకాశ్ లక్ష్మీతో హైదరాబాద్ వచ్చేశాం.. మీ నాన్నని తీసుకొని నీ దగ్గరకు వచ్చేయాలా అంటాడు. లక్ష్మీ భయంతో వద్దని అంటుంది. దాంతో ప్రకాశ్ నేను చెప్పిన లొకేషన్‌కి నువ్వు రా అని అంటాడు. ఇంతలో ఆదికేశవ్ ప్రకాశ్ దగ్గరకు వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!