Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అమ్మిరాజు, పానకాలు విహారి ఇంటికి మారు వేషంలో ప్లంబర్స్‌లా వస్తారు. ట్యాప్స్ రిపేర్‌లు అంటూ కావేరి గదిలో సీసీ కెమెరాలు పెడతారు. అంబిక వాళ్లని పంపించేసి కావేరిని అడ్డు పెట్టుకొని లక్ష్మీని ఆడుకోవాలని అనుకుంటుంది.
సహస్రని విహారి నీకు వాంతులు అవుతున్నాయి కదా పులుపు ఏం తినాలి అనిపించడం లేదా అని అడుగుతాడు. బావకి నా మీద అనుమానం వచ్చిందని సహస్ర అనుకొని పులుపు తినాలి అని లక్ష్మీని పిలిచి పులుపు కావాలి అంటుంది. లక్ష్మీ చింతపండు పలుకులు తీసుకొచ్చి ఇస్తుంది. పులుపు ఇష్టం లేదు అనుకుంటూ బలవంతంగా తింటుంది. లక్ష్మీని కూడా అడుగుతుంది. నీకు ఇలా పులుపు తినిపించడం లేదా అని అంటుంది. నాకు ఎందుకు అనిపిస్తుంది అమ్మా ప్రెగ్నెంట్ అయిన వాళ్లకి మాత్రమే ఇలా తినాలి అనిపిస్తుందని లక్ష్మీ అంటుంది. సహస్ర బిడ్డని లక్ష్మీకి సరోగసీ చేయడం వల్ల సహస్ర లక్ష్మీని అడుగుతుంది.
విహారి సహస్ర పులుపు తినడం చూసి ఏదో జరుగుతుంది. సహస్రని నిన్న అడగగానే ఈ రోజు పులుపు తింటుంది. పద్మాక్షి అత్తయ్య ఎప్పుడూ లేనిది ఇప్పుడు కొత్తగా లక్ష్మీని జాగ్రత్తగా చూసుకుంటుంది. అసలు సహస్ర విషయంలో నిజం ఏంటో తెలుసుకోవాలని విహారి అనుకుంటాడు. సహస్ర దగ్గరకు వచ్చి బయటకు వెళ్దామా అని సహస్రని పిలుస్తాడు. సహస్ర సంతోషంగా బయటకు వస్తుంది. మన పెళ్లి తర్వాత మొదటి సారి బయటకు తీసుకొచ్చావ్ బావ.. పెళ్లి తర్వాత భర్తలు మారకపోయినా పెళ్లాం గర్భవతి అయితే మాత్రం మారిపోతారు అంటారు ఇందుకేనేమో అని అంటుంది.
పద్మాక్షి పండుకి సహస్ర గురించి అడిగితే సహస్రమ్మ, విహారి ఇద్దరూ బయటకు వెళ్తారు అని చెప్తాడు. పద్మాక్షికి అనుమానం వస్తుంది. వెంటనే సహస్రకి కాల్ చేస్తుంది. సహస్ర పద్మాక్షితో మొదటి సారి బావతో బయటకు వెళ్తున్నా ఇబ్బంది పెట్టకు అని ఫోన్ కట్ చేసేస్తుంది. విహారి సహస్రని తీసుకొని హాస్పిటల్‌కి వస్తాడు. హాస్పిటల్‌ని చూసి సహస్ర షాక్ అయిపోతుంది. ఇక్కడికి ఎందుకు బావ అని అడిగితే నీ హెల్త్ మీద నాకు కంగారుగా ఉంది అందుకే నాకు తెలిసిన గైనిక్‌ని చూపించాలని తీసుకొచ్చా అని అంటాడు. విహారి సహస్రని బలవంతంగా హాస్పిటల్‌లోకి తీసుకెళ్తాడు.
లక్ష్మీకి తన తల్లిదండ్రులు కాల్ చేస్తారు. లక్ష్మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఏడుస్తుంది. మా మీద బెంగ పెట్టుకున్నావా తల్లీ అని ఆదికేశవులు ఓదార్చుతాడు. త్వరగా పిల్లల్ని కనేయమ్మా అని ఇద్దరూ లక్ష్మీకి చెప్తారు. లక్ష్మీ ఏడుస్తూ మనసులో అది ఈ జన్మలో జరగదు నాన్న అని.. మీ కోరిక నేను ఎప్పటికీ తీర్చలేను.. నాకు తల్లి అయ్యే యోగ్యతే లేదు అని ఏడుస్తుంది.
విహారి, సహస్రని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్‌ని కలుస్తాడు. విహారి డాక్టర్‌తో విషయం చెప్పి సహస్రని టెస్ట్ చేయమని అంటాడు. సహస్ర చాలా కంగారు పడుతుంది. నిజం తెలిస్తే బావ నన్ను తన్ని తరిమేస్తాడని చాలా కంగారు పడుతుంది. డాక్టర్ సహస్ర నాడి పట్టుకొని పరీక్షించి నీకు కొన్ని టెస్ట్‌లు చేయాలి అంటుంది. సహస్ర చాలా కంగారు పడుతుంది. టెస్ట్‌లు చేస్తే దొరికిపోతాను అని సహస్ర వణికిపోతుంది. నర్స్ టెస్ట్‌లకు ఏర్పాటు చేస్తారు.
అంబిక కావేరి గదికి వెళ్లి బాత్‌రూంలోని సీక్రెట్ కెమెరాని తీసుకుంటుంది. లక్ష్మీని ఆడుకోవడానికి సరైన అస్త్రం దొరికిందని అనుకుంటుంది. అంబిక కావేరి స్నానం చేస్తున్న వీడియోని కావేరికి పంపిస్తుంది. అది చూసిన కావేరి కింద పడి ఏడుస్తుంది. లక్ష్మీ చూసి ఏమైందని కంగారు పడుతుంది. లక్ష్మీ కూడా ఆ వీడియో చూసి షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.