Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode వీర్రాజు, పానకాలు ఇద్దరూ కలిసి అంబిక పెళ్లి వంకతో అంబిక ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయాలి అని ఇంటికి వస్తారు. వీర్రాజు వాళ్లని విహారి చూసి ఆపుతాడు. చారుకేశవ, సహస్ర కూడా వీర్రాజుని కోపంగా చూస్తారు. మీరు ఎందుకు వచ్చారు అని వీర్రాజుని విహారి అడుగుతాడు. మనం మనం ఎంత కాదు అనుకున్నా బంధువులం కదా అని అంటాడు.

Continues below advertisement

విహారి కోపంగా ఎంత బంధువులు అయినా నువ్వు చేసింది మేం మర్చిపోలేదు.. నువ్వు వెళ్లిపో అని అంటాడు. ఒక సారి మా పెద్ద నాన్నకి కనిపించి క్షమాపణ చెప్పి వెళ్లిపోతా అంటాడు. విహారి మాత్రం ఒప్పుకోడు. ఇంతలో భక్తవత్సలం వచ్చి ఎంత కాదు అనుకున్నా వాడు మన బంధువురా.. ఇంటికి వచ్చిన శత్రువునైనా సరే గుమ్మం వరకు వచ్చిన వారిని వెనక్కి వెళ్లమని చెప్పకూడదు అని చెప్పి వీర్రాజుని లోపలికి పిలుస్తాడు. వీర్రాజు క్షమాపణ చెప్పి కన్నీటి చుక్కలు కార్చుతాడు. 

విహారిని వికాస్ అనే అతని ఫ్రెండ్ కలుస్తాడు. విహారి అతనికి యమున ఫోన్ ఇచ్చి రిపేర్ చేయించమని చెప్తాడు. ఈ ఫోన్‌లో ముఖ్యమైన డేటా ఉంది. అది నాకు లైఫ్ మ్యాటర్‌రా జాగ్రత్తగా రిపేర్ చేయమని చెప్పరా అని విహారి అంటాడు. సహస్ర ఆ మాటలు విని షాక్ అయిపోతుంది. ఇక అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు. అంబికను ఇద్దరు అక్కలు ముస్తాబు చేసి తీసుకొస్తారు. అంబికను చూసి అందరూ మురిసిపోతారు. ముగ్గురు అక్కాచెల్లెల్లూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని అందరూ అనుకుంటారు. 

Continues below advertisement

వీర్రాజు అంబికకు పెళ్లి శుభాకాంక్షలు చెప్పి గిఫ్ట్ ఇస్తాడు. నీకు ఎవరు రమ్మని చెప్పారు.. నువ్వు నాకు అన్నవి కాదు మా శత్రువు అని అంబిక అంటుంది. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావ్ అని పద్మాక్షి కూడా అడుగుతుంది. భక్తవత్సలం అందరికీ సర్ది చెప్తాడు. అంబిక గిఫ్ట్ తీసుకుంటుంది. లక్ష్మీకి వీర్రాజు మీద అనుమానం వచ్చి గిఫ్ట్‌లో ఏం ఉందో చూద్దాం అని గిఫ్ట్ తీసుకురమ్మని చెప్తుంది. లక్ష్మీ, పండు గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఓ బొమ్మ ఉంటుంది. లక్ష్మీ పండుతో వీర్రాజు ఇంకేదో ప్లాన్ చేశాడు.. ఒక కంట కనిపెడుతూ ఉండాలని అంటుంది. 

పానకాలు వీర్రాజుతో ఆ గిఫ్ట్‌లో బాంబ్ పెట్టారు కదా మరి ఏది అని అడుగుతాడు. దానికి బాంబ్ మార్చేశా అని వీర్రాజు చెప్తాడు. వాళ్ల చావుని ఎవరూ తప్పించలేరు అని అంటాడు. ఇంతలో అంబిక వచ్చి వీర్రాజుని పక్కకి తీసుకెళ్తుంది. మరోవైపు సహస్ర పద్మాక్షిని గదిలోకి తీసుకెళ్లి విహారి ఫోన్  గురించి చెప్తుంది. పద్మాక్షి కూతురితో ఇప్పటికే మనకు చాలా తలనొప్పులు ఉన్నాయి వదిలేయ్ అని అంటుంది. విహారికి నీ మీద కోపం ఉంది ఇక ఆ విషయాలు వదిలేయ్ అని అంటుంది. నువ్వు కేవలం ప్రెగ్నెంట్‌లా నటించు అది చాలు అని అంటుంది. 

అంబిక వీర్రాజుతో నువ్వు నా పెళ్లి చెడగొట్టాలనే కదా వచ్చావ్.. నువ్వు నా పెళ్లి చెడగొడితే జైలులో ఉన్న నీ కొడుకుని చంపేస్తా అని అంటుంది. లక్ష్మీ ఇద్దరి మాటలు చాటుగా వింటుంది. నా పెళ్లిని నువ్వు ఆపితే నీ కొడుకు నీకు దక్కడు అని అంటుంది. నాకు ఈ పెళ్లి చాలా ముఖ్యం అని అంబిక  అంటుంది. నిన్నటి వరకు పెళ్లి వద్దు అన్న అంబికమ్మ ఈ పెళ్లి ఇంత ముఖ్యం అని అంటుంది అంతే ఏదో ప్లాన్ ఉంది అని అనుకుంటుంది లక్ష్మీ. గౌరీ పూజకు ఏర్పాట్లు జరుగుతాయి. లక్ష్మీ పువ్వులు దండలు తీసుకురావడానికి వెళ్తుంది. ఇంతలో ఓ పాప లక్ష్మీని ఢీ కొట్టడంతో లక్ష్మీ విహారి ఇద్దరి మెడలో రెండు దండలు పడతాయి.. విహారి లక్ష్మీని పట్టుకుంటాడు. ఇద్దరి మీద పువ్వులు పడతాయి. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.