Continues below advertisement

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode వీర్రాజు అంబిక పెళ్లికి వెళ్లి అందరినీ చంపేయాలి అనుకుంటాడు. అందుకు సంబంధించిన ప్లాన్ పానకాలుతో చెప్తాడు. ఇక హల్దీ వేడుకకు అంబిక ఇంట్లో ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. భక్తవత్సలం దగ్గరుండి అన్నీ చూసుకుంటూ చాలా హడావుడి చేస్తారు. అందరూ పసుపు రంగు బట్టలు వేసుకొని సందడి చేస్తారు.

కునాల్సింగ్గా పరిచయం చేసుకున్న సుభాష్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అతనికి ఎవరూ లేరు కాబట్టి అన్నీ మన ఇంట్లోనే జరిపిస్తామని పిలిచానని చెప్పడంతో అందరూ మంచి నిర్ణయం అని అంటారు. ఇక సుభాష్ రావడంతో భక్తవత్సలం, చారుకేశవ, విహారి స్వాగతం పలుకుతారు. అంబికను రెడీ చేసి తీసుకొస్తారు. పసుపు దంచి అందరూ అంబిక, సుభాష్లకు పసుపు రాసి మంగళ స్నానాలు చేయిస్తారు.

Continues below advertisement

విహారి లక్ష్మీ దగ్గరకు వెళ్లి కనకం మన పెళ్లి సంప్రదాయ ప్రకారం జరిగింది కానీ ఇలా హల్దీ జరగలేదు కదా అని అంటాడు. విహారి గారు ఎవరైనా వింటే బాగోదు అని లక్ష్మీ అంటుంది. వింటే వినని అని విహారి లక్ష్మీని ఆటపట్టిస్తాడు. అందరూ వింటారు అని లక్ష్మీ అంటే వినని.. ఇలా అయినా నువ్వు నా భార్యవి అని తెలుస్తుందని అంటాడు. దానికి లక్ష్మీ విహారి గారు మీరు దయచేసి ఏం మాట్లాడొద్దు అని అంటుంది.

విహారి పసుపు తీసుకొని లక్ష్మీ బుగ్గలకు రాస్తాడు. అలా చేయొద్దు అని లక్ష్మీ అంటే మన పెళ్లిలో చేయనివి అన్నీ ఇక్కడ చేస్తా అంటాడు. మీకు దండం పెడతా అలా ఏం చేయొద్దని అంటుంది. అందరూ పసుపు రాసేసిన తర్వాత మంగళస్నానాలు చేయిస్తామని అంటారు. మంగళస్నానాలు చేయిస్తే సుభాష్ గెటప్ బయట పడిపోతుందని అంబిక, సుభాష్ఇద్దరూ కంగారు పడతారు.

సుభాష్అందరితో తన తలపాగడా తడవ కూడదు నీరు వేయొద్దు అంటాడు. మా ఆచారాలు అంటే నీరు వేస్తారని అంటాడు. దాంతో సుభాష్ తల మీద మాత్రం వద్దు అని అంటాడు. దాంతో తల తడపకుండా బాడీ మీద నీరు పోస్తారు. అంబికకు కూడా ఆడవాళ్లు అందరూ నీరు పోసి గౌరీ పూజకు రెడీ చేయాలి అని తీసుకెళ్తారు. లక్ష్మీ చివరగా వెళ్తుంటే విహారి ఆపేసి లక్ష్మీ మీద బిందెతో నీరు పోసేసి లక్ష్మీని తడిపేస్తాడు. ఇదే నా ప్రేమ లక్ష్మీ పెళ్లిలో జరగని తంతు ఇలా జరిపేసుకున్నా అని అంటాడు. లక్ష్మీ మాత్రం అలా వెళ్లిపోతుంది.

విహారి చాలా హ్యాపీగా ఉంటాడు. లక్ష్మీ చిరాకు పడినా లోపల మాత్రం చాలా నవ్వుకొని ఉంటాయి. లక్ష్మీ మనస్ఫూర్తిగా నవ్వేలా.. ఇంటి కోడలిగా దర్జాగా తిరిగేలా చేయాలి,, అందుకు సహస్ర గర్భమే కారణం.. కానీ నేను తప్పు చేయలేదు ఎలా నిరూపించుకోవాలి అని అనుకుంటాడు. ఇంతలో యమున తన ఫోన్ సరిగా పని చేయడం లేదు అని విహారికి ఇస్తుంది. విహారి ఫోన్ ఛార్జింగ్ పెడతాడు. విహారిని చూసి యమున మనసులో మనసుకి నచ్చిన లక్ష్మీతో ఉండలేక మనసుకి నచ్చని సహస్రతో ఉండలేక ఎంత నలిగిపోతున్నాడో అని బాధ పడుతుంది. కుటుంబం కోసం నీ ప్రేమని ప్రాణమైన లక్ష్మీని దూరం చేసుకుంటున్నాడని అనుకుంటుంది.

విహారి తల్లి ఫోన్ ఆన్ చేయగానే అందులో రోజు రాత్రి సహస్ర తనంతట తానే ఫస్ట్నైట్ అయినట్లు చేసిన ప్లాన్ ఉంటుంది. అదంతా విహారి చూసి బిత్తరపోతాడు. మళ్లీ ఫోన్ ఆగిపోతుంది. మరోసారి చార్జింగ్ పెడతాడు. ఫోన్ రిపేర్ చేయిస్తా అని యమునకు మరో ఫోన్ ఇచ్చి వీడియో తనకు సాక్ష్యంగా ఉంటుందని అనుకుంటాడు. ఇక వీర్రాజు, పానకాలు కూడా పెళ్లికి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.