Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode దత్తత వేడుకకు అన్నీ ఏర్పాట్లు పూర్తవుతాయి. పంతులు ఇంకా రాలేదని వసుధ, చారుకేశవ అనుకుంటారు. అంబిక అన్న మాటలకు భక్తవత్సవం బాధ పడతాడు. వసుధ వాళ్లు అదే అడిగితే అంబిక అన్న మాట నిజమే కదా.. రోజు తను పెళ్లి చేసుకోను అంటే నేను కచ్చితంగా చేసుకోవాలి అనలేదు.. రోజు తనే మన బిజినెస్లు అన్నీ చూసుకుంది.. ఇప్పుడు తన మాటని మనసుని మార్చడం అంత తేలిక కాదు అంటాడు.

Continues below advertisement

యమున భక్తవత్సలంతో ప్రశాంతంగా ఉండమని అంటుంది. నా కూతురికి పెళ్లి అవ్వదు అని తెలిశాక నేను ఎలా ప్రశాంతంగా ఉండాలి అని బాధ పడతారు. అంబికను పెళ్లికి ఎలా అయినా ఒప్పించాలి అని లక్ష్మీ అంబికను పక్కకి తీసుకెళ్తుంది. తాతయ్య గారు బాధ పడుతున్నారు పెళ్లికి ఒప్పుకోండి అని చెప్తుంది. నా పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దు అన్నాను.. ఎందుకు మళ్లీ మళ్లీ వస్తున్నావ్.. పని మనిషిగా వచ్చి ఆస్తి మీద కన్నేసి దత్తత ప్లాన్ వేశావ్.. చివరకు మా సహస్ర, పద్మాక్షి అత్తయ్యని కూడా నీ వైపు తిప్పుకున్నావ్ నీ బుట్టలో నేను పడనే అని అంటుంది. ఇంకోసారి నా పెళ్లి గురించి మాట్లాడితే సారి చేయితో జవాబు చెప్పాల్సి వస్తుందని అంబిక వార్నింగ్ ఇస్తుంది.

పద్మాక్షిని సహస్ర అంబిక ప్లాన్ గురించి అడగమని అంటుంది. ఇప్పుడు అడిగితే అంబికకు మన మీద డౌట్ వస్తుందని పద్మాక్షి చెప్తుంది. అంబిక ఏం ప్లాన్ చేసినా సరే మనం లక్ష్మీ చుట్టూ ఉండి లక్ష్మీని కాపాడుకోవాలని అంటుంది. దాని కడుపులో నీ బిడ్డ పెరుగుతుంది. బిడ్డ క్షేమంగా మన చేతికి వచ్చే వరకు లక్ష్మీని జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత దాని సంగతి చెప్తా.. ముందు తన చుట్టూ ఏమైనా ప్రమాదం ఉందా అని చూడు అని చెప్పి ఇద్దరూ వెతుకుతారు.

Continues below advertisement

పంతులు వచ్చి దత్తత కార్యక్రమం పూజ మొదలు పెడతారు. మరోవైపు అంబిక లక్ష్మీని చంపడానికి పాముని వాడుతుంది. అందుకు పాములు పట్టే అతను వచ్చి లక్ష్మీ బట్టలు వాసన చూపించి పాముని ఇంట్లోకి పంపిస్తాడు. సహస్ర, పద్మాక్షి చాలా టెన్షన్ పడతారు. అంబిక కామ్గా ఉంది అంటేనే అది చాలా ప్రమాదం అని అనుకుంటారు. పాము ఇంట్లోకి వచ్చి లక్ష్మీ పక్కనే నిల్చొంటుంది.

అంబిక పాముని చూడటం సహస్ర చూసి వెంటనే కంగారుగా లక్ష్మీ దగ్గరకు వెళ్లి లక్ష్మీ పాము అని లక్ష్మీని పక్కకి తీసుకొస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. పాము బుసలు కొట్టుకుంటూ లక్ష్మీ వైపు వస్తుంది. సహస్ర లక్ష్మీని జాగ్రత్తగా పట్టుకొని పక్కకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. ఇంతలో విహారి పాము మీద బట్ట కప్పి పాముని పట్టుకుంటాడు. లక్ష్మీ బతికిపోయిందని అంబిక అనుకుంటుంది. లక్ష్మీని కంగారు పడొద్దని సహస్ర చెప్తుంది.

లక్ష్మీ తనని కాపాడినందుకు సహస్రకు థ్యాంక్స్ చెప్తుంది. అందరూ సహస్రని మెచ్చుకుంటారు. మళ్లీ దత్తత కార్యక్రమం మొదలవుతుంది. అంబిక సహస్రని కోపంగా చూస్తుంది. ఇలా కార్యక్రమానికి మధ్యలో పాము రావడం అరిష్టంలా ఉందని పద్మాక్షి అంటుంది. అంబిక వత్తాసు పలుకుతుంది. ఇంతటితో కార్యక్రమం ఆపేయమని అంటుంది. భక్తవత్సలం వద్దని అంటారు. విహారి అస్సలు వద్దని అంటాడు. ఏం ప్రాబ్లమ్ లేదని పంతులు చెప్పడంతో కార్యక్రమం మొదలు పెడతారు. వసుధ, చారుకేశవ, లక్ష్మీ పూజ చేస్తారు. వసుధ, చారుకేశవ చేతుల్లో లక్ష్మీని చేయి పెట్టమని చేయి పెట్టి పాలు పోస్తే దత్తత కార్యక్రమం అయిపోతుందని పంతులు చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.